టీడీపీతో మళ్లీ కలిస్తే ఎలా ఉంటుంది ? అమిత్ షా రియాక్షన్ ఏంటి ? మాణిక్యం జగన్ పై గురిపెట్టింది అందుకేనా?

ఎంత పిస్తా బాదం పెట్టి పెంచినా ఐదేళ్లకి ఓటు హక్కు రాదు. నడక మాత్రమే వస్తది ! అందుకే ఎవరో ఒకరితో కలిసి నడవక తప్పదు. పైగా జమిలి అంటూ వచ్చే ముందే ఎన్నికలు ఉంటాయ్. తేడా కొట్టాక కుమిలి పోవడం కంటే జమిలికి ముందే ఎటో అటు చూడ్డం నయం. ఉన్నది మూడు పార్టీలు అయినా కలగలిగినవి రెండే అని స్టేట్ లీడర్ల అభిప్రాయం. ఇదే మూడ్ లో అమిత్ షా దగ్గర ప్రస్తావిస్తే ఆయన నుంచి ఓ సమాధానం వచ్చిందని అంటున్నారు. ఇంతకీ ఏమన్నాడు ?

అసలు టీడీపీతో కలవాలన్న ఐడియానే యమ క్రేజీగా లేదూ ! నిన్నటి వరకూ కొట్టింది అదే పార్టీని. ఇప్పుడు నంజుకుంటున్నది అదే పార్టీని ! మరి కలవడం అనే మాట ఎందుకు వచ్చింది ? ఎందుకొచ్చిందో ఆల్రెడీ చెప్పేశాం పైన. ఎవరో ఒకరితో కలిసి నడవాల్సిందే ! అవసరార్థం, ప్రతీకారం కోసం వైసీపీకి సపోర్ట్ చేసిన మాట వాస్తవమే కానీ ఇక ముందు ముందు కలిసి వెళ్లే ఉద్దేశం ఉన్నట్టు లేదు. ఆ విషయం అర్థం అవుతోంది ఆల్రెడీ. ఫలితాలు వచ్చిన నెల రోజుల్లోనే మాటలు మారాయ్. వార్నింగులు కూడా వచ్చాయ్ అంటున్నారు ఇప్పటికే ! ఇక మిగిలింది రెండు. ఒకటి జనసేన. సేన కూడా సేమ్. ఇప్పుడిప్పుడే నడుస్తోంది. అడుగులు అప్పుడప్పుడే వేస్తున్న ఇద్దరు కలిసి నడిస్తే కాళ్లు కొట్టుకొని కిందపడటం తప్పితే లాభం ఉంటుందా ? డౌటే ! ఇక ఎటొచ్చీ మిగిలింది టీడీపీ. చంద్రబాబుతో ఉంటే కాస్త సౌలభ్యం ఉంటుంది. గాలి ఆడుతుంది. అవసరం అయితే మిత్ర పక్షం కోసం సొంత పార్టీని కూడా కొరడాలతో కొడతాడు. తాడేపల్లి గూడెంలో బాపిరాజును కొట్టినట్టు ! అందుకే బీజేపీ వాళ్లలో చాలా మందికి బాబు అంటే మక్కువ. ఇటు వైపు చూస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా అందుకే ! కాకపోతే కలవాలో వద్దో చెప్పాల్సింది వీళ్లు కాదు. అమిత్ షా. అదే మాట షా దగ్గర అంటే, అప్పుడే అవసరం లేదు. అయినా ఏం చేయాలి ఎలా చేయాలి అనేది తర్వాత చూద్దాం. ముందు బలపడటం మీద దృష్టిపెట్టండి అని హెచ్చరిక స్వరంతో అన్నట్టు ప్రచారం సాగుతోంది.

ఏపీలో బీజేపీ ఏవేవో చేరికలు చేయాలి అనుకుంటోంది. మరో రెండు రోజుల్లో భారీ స్థాయిలో సన్నాహాలు కూడా చేసుకుంది. ఇలాంటి సమయంలో ఇలాంటి ఫీలర్లు రావడం ప్రచారమే అని కూడా ఓ వర్గం కొట్టిపారేస్తోంది. కాకపోతే కొంతమంది నాయకుల్లో ఉన్న ఫీలింగ్ ఇది అని వాళ్లు కూడా ఒప్పుకునే పరిస్థితి. అయినా వన్ సైడ్ లవ్ గురించి ఇంత చర్చ దేనికి ! ఇవతల టీడీపీ ఏమనుకుంటోంది అనేది కదా పాయింట్ !

-->