తెలంగాణలో టీడీపీ బలం ఇంతా ? రాహుల్ సర్వే రిపోర్ట్ చూసి కాంగ్రెస్ ఆశ్చర్యం !

కేసీఆర్ టీడీపీ నేతల్ని ఎగరేసుకుపోయాడు. చంద్రబాబు మూడేళ్లుగా అటు పెద్దగా చూసింది లేదు. 14 ఏళ్లుగా అధికారం అందలేదు. అయినా టీడీపీ అంత పటిష్టంగా ఉందా ? సర్వే రిపోర్ట్ చూడగానే సగటు టీడీపీ అభిమాని గుండెలు గర్వంతో ఉప్పొంగుతున్నాయ్. కాంగ్రెస్ కన్నా టీడీపీ బలంగా ఉన్న స్థానాలు పాతికకు పైగా ఉన్నాయని రాహుల్ గాంధీ చేయించిన సర్వే తేల్చింది. ఇదే అసలు హైలైట్ !

మహా కూటమి సీట్ల పంపకాలు, ప్రచార వ్యూహాలు ఖరారు చేసుకునే ముందు కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో క్షేత్ర స్థాయి సర్వే చేయించింది. ఇది విశ్వసనీయ సమాచారం. మాట వరసకి కేసీఆర్ ప్రకటించే వంద సీట్ల సర్వే కాదు. నియోజక వర్గాల వారీగా ఆరా తీసి, బలాబలాలు పేపర్ మీదకి తెచ్చిన లెక్క ఇది. దీని ప్రకారం టీడీపీ పటిష్టంగా ఉండి గెలిచే స్థానాలు పాతికకు పైగా ఉన్నాయ్. ఈ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ కన్నా టీడీపీనే బలంగా ఉంది. కాకపోతే అక్కడ కాంగ్రెస్ నేతలు టిక్కెట్లు ఆశిస్తున్నారు. అలాంటి చోట్ల టీడీపీని కులుపుకొని పోలాన్నది కాంగ్రెస్ లెక్క. ఈ సర్వే తీసి రాహుల్ నేతల ముందు పడేసే సరికి చూసి ఆశ్చర్యపోయారు. గ్రౌండ్ లెవెల్లో ఇంత బలం ఉందా ? పటాన్ చెరు లాంటి చోట్ల చేరికలు అందుకేనా అంటూ ఆశ్చపోతున్నారు. పై పెచ్చు నాయకులు టీఆర్ఎస్ లోకి వెళ్లిన చోట కూడా టీడీపీ కేడర్ చెక్కు చెదరలేదని, టీడీపీ గత ఎన్నికల్లో గెలిచిన చోట, టీఆర్ఎస్ లోకి జంప్ చేసిన స్థానాలన్నిటిలోనూ 100 శాతం టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని కూడా సర్వే తేల్చింది. అంటే టీడీపీ సీట్లు ఖాయంగా టీడీపీ ఖాతాలోనే పడబోతున్నాయ్ ఈ రిపోర్ట్ చూసి మొదట షాక్ అయ్యింది కాంగ్రెస్. ఆ తర్వాత సంబరపడుతోంది. టీడీపీ బలం కచ్చితంగా కాంగ్రెస్ కి ట్రాన్స్ ఫర్ అవుతుంది.

అవును. టీడీపీ ఓటు కచ్చితంగా పొత్తులో భాగంగా కాంగ్రెస్ కి వెళుతుంది. ఎందుకంటే టీడీపీ సానుభూతి పరుల్లో, అభిమానుల్లో అంత కసి ఉంది మరి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ ని ఓడించి తీరాలన్న పట్టుదల ఉంది. అందుకే ఇపుడు టీడీపీ బలం చూసి కాంగ్రెస్ సంబరపడుతోంది. రాహుల్ రిపోర్ట్ లో హైలైట్ ఇదే !

-->