తెలంగాణలో టీడీపీ పోటీ చేసే సీట్లు ఇవే ! కూటమి లెక్క తేలింది !

కూటమి లెక్క కొలిక్కి వచ్చేసింది. కాంగ్రెస్ టీడీపీతోపాటు మిగతా పార్టీ ఎన్నెన్ని సీట్లలో పోటీ చేస్తాయో లెక్క తేలిపోయింది. ఉన్న బలంతో పోలిస్తే టీడీపీకి దక్కిన సీట్లు తక్కువే అనే అభిప్రాయం వినిపిస్తున్నా టీఆర్ఎస్ ఓటమి కోసం కలిసి నడుస్తాం అంటున్నారు తమ్ముళ్లు. ఇంతకీ టీడీపీకి ఎన్ని సీట్లు ?

టీడీపీ తెలంగాణలో 13 సీట్లలో పోటీ చేయబోతోంది. ముందు 12 అన్నారు. కాదు 18 అని పట్టుపట్టారు. బేరం 15 సీట్లకి తెగుతుంది అనుకున్నారు కానీ కాంగ్రెస్ వైపు నుంచి నేతల ఒత్తిడి గట్టిగా వచ్చింది. చంద్రబాబు కూడా క్లియర్ గా చెప్పేశాడు. కాంగ్రెస్ తో ఇబ్బందికర బేరాలు వద్దు అని. అందుకే తెలంగాణ నేతలు మరో మాట మాట్లాడ్డానికి అవకాశం లేకపోయింది. 13 సీట్లలో పోటీ చేస్తోంది టీడీపీ. గత ఎన్నికల్లో టీడీపీ 15 సీట్లు గెలిచింది. అంటే ఓ రెండు సీట్లు తగ్గాయ్ కానీ… గెలువు శాతం మాత్రం వంద శాతం ఉంటుంది కాస్కోండి అంటూ తమ్ముళ్లు ఛాలెంజ్ చేసి చెబుతున్నారు. ఎందుకంటే ఈ సీట్లలో టీడీపీ పటిష్టంగా ఉంది. దానికి తోడు కాంగ్రెస్ బలం కాస్తో కూస్తో తోడవుతోంది. అటు కోదండరామ్ పార్టీక ఏకంగా 8 సీట్లు ఇస్తున్నారు. ఖాయం అయిపోయింది. సీపీఐ 4 సీట్లలో దిగుతోంది. అంటే మొత్తం మిత్ర పక్షాలకి 25 సీట్లు ఇచ్చింది కాంగ్రెస్. అంటే 94 చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తోంది. మహా కూటమి బలాబలాలు లెక్కలు తీసి, పార్టీల వారీగా అంచనాలు వేసి రంగంలోకి దిగుతున్నారు. అంటే కూటమి కోత కోయబోతోంది టీఆర్ఎస్ ని. అదే జరగబోతోంది అనిపిస్తోంది లెక్కలు చూస్తుంటే !

కాంగ్రెస్ లో నేతలు ఎక్కువ మంది ఉన్నారు. నియోజక వర్గాల స్థాయిలో అదే ఇబ్బంది అయింది అంటున్నారు. అసంతృప్తి కుంపట్లు రగులుతాయని, ఇదే అదునుగా కేసీఆర్ అడ్వాంటేజ్ తీసుకుంటాడు కాబట్టి టీడీపీ కాస్త వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గిందని చెబుతున్నారు. అందుకే టీడీపీ 13సీట్లకే సుర్దుకుంది. మొత్తానికి లెక్క అయితే క్లియర్ అయిపోయింది. ఇదే క్లారిటీ !

-->