ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలూ జంప్ ! ఇది టీడీపీకి షాక్ కాదు సంబరం

ఒకే జిల్లాలో ఒకేసారి ముగ్గురు సిట్టింగ్ లు జంప్ అయితే ఏమనుకోవాలి ? షాక్ అనే కదా ? మరి టీడీపీ ఏంటి అక్కడ కొత్త లెక్కలు వేస్తోంది ? ఆ ముగ్గురూ వెళ్లిపోతే సంబరం అన్నట్టు లెక్కేస్తోంది ఎందుకు ? అసలు ఏ జిల్లా ? ఏంటి స్టోరీ ?

పదేళ్ల నాడు ఆ కుటుంబం టీడీపీ నుంచి అప్పటి చిరంజీవి పార్టీకి వెళ్లింది. నేల మట్టం అయ్యింది. ఇద్దరిలో ఒకరు గెలిచినా లాభం లేకపోయింది. ఇప్పుడు ఆ జంట లేరు. అదో విషాద గాధ. ఆమె మరణం తర్వాత, ఆయన మళ్లీ టీడీపీలోకి వచ్చాడు. చంద్రబాబు అక్కున చేర్చుకొని బిడ్డకి మంత్రి పదవి కూడా ఇచ్చాడు. ప్రతిష్టాత్మక ఉప ఎన్నికలో మొత్తం భుజాన వేసుకొని గెలిపించుకున్నాడు కూడా ! ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందిగా ఎవరో ! ఆ ముగ్గురూ ఇప్పుడు జంప్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. బ్రదర్ సిస్టర్ తోపాటు కుటుంబ సన్నిహితుడు కూడా ఆల్రెడీ క్లారిటీకి వచ్చేశాడు అంటున్నారు. కొత్తగా పవన్ పార్టీ వస్తోంది కాబట్టి అదృష్టం పరీక్షించుకుంటారట ! ఓసారి దూకి కాళ్లు విరిగిన తర్వాత కూడా తెలుకోని వాళ్లకి చెప్పేదేం లేదు. మరోసారి దూకితే ఈ సారి లోపలున్న స్టీలు రాడ్లు కూడా విరుగుతాయ్ తప్పితే అంతకన్నా ఏం జరుగుతుంది. అందుకే టీడీపీ లైట్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అక్కడ టీడీపీ బలంగా ఉంది. జిల్లా మొత్తం మ్మీద కొత్త ఊపుతో ఉరకలు వేస్తోంది. నిజానికి ఆ బ్రదర్ సిస్టర్ ఉన్న చోట టీడీపీకి బలమైన ఆల్టర్ నేటివ్ లీడర్లు కూడా ఉన్నారు. అన్నిటికీ మించి అక్కడ ఎంపీ స్థానానికి కూడా ఓ తిరుగు లేని నాయకుడు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. అంటే ప్రత్యర్థులకి బిజ్జం పడినట్టే !

అందుకే ఇప్పుడు కర్నూలులో సంబరపడుతోంది టీడీపీ. ఇప్పటి వరకూ వాళ్ల కోసం చంద్రబాబు పార్టీని కూడా ఫణంగా పెట్టాడు. ఇప్పుడు ఇక టెన్షన్ తీరిపోయినట్టే ! లగ్గేజ్ దిగిపోయినట్టే అంటున్నారు. అందుకే ముగ్గురు పోవడం కలిసొచ్చే విషయమే అనిపిస్తోంది.

-->