కోడి కత్తి దాడిలో పెద్దాపురం స్టోరీ ! ఉండవల్లి లాజిక్ లాగాడు !

ఉండవల్లి గుమ్మడికాయ్ లాంటోడు. గుమ్మానికి వేలాడదీశామనుకోండి గుమ్మడి కాయను, అది లోపలికి రాలేదు. బయటకి పోలేదు. అక్కడే ఉండి వచ్చే పోయే వాళ్లకి తలెత్తితే తప్ప కనిపించదు ! ఉండవల్లి కూడా ఇంచు మించు ఇంతే ! విషయంలోకి రాడు, అలాగని దూరమూ జరగడు. గుర్తొచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఆ కోర్టు పెట్టొచ్చుగా, ఈ కమిషన్ వేయొచ్చుగా అంటున్నాడు ! మొలవని విత్తులకి ఎరువులు దండగ అన్నట్టు బీజేపీ వాళ్లు చేసే చెత్త ఆరోపణల కోసం కోర్టులు పెట్టాలా ? ఏపీకి ఇదా ఇప్పుడు అవసరం ఉండవల్లీ ? నీ తెలివి పెద్దాపురం కోడి కత్తి స్టోరీలోనే తెలిసిపోయిందిగా!

ఉండవల్లికి జగన్ మీద విపరీతమైన లవ్వు. ఆయనకేమో కొవ్వు. అందుకే వైఎస్ సన్నిహితులకి కూడా విలువ ఇవ్వడు. పరువు పోతుందేమో అని ఉండవల్లేమో వైసీపీలో చేరడు. కానీ దూరం నుంచి ఆ పార్టీ కోసం ఫీల్డింగ్ చేస్తుంటాడు. బంతి బౌండరీ దాటి పోయాక చేసేదాన్ని ఫీల్డింగ్ అనర్రా సామీ, మీరు ఇన్ని తెలివితేటలుండా ఇలా మాట్లాడతారేంటి సార్ అంటే పట్టించుకోడు. అంతేగా, జరగాల్సింది జరిగిపోయిన తర్వాత ఇప్పుడొచ్చి కోడి కత్తి స్టోరీ మీద మాట్లాడుతున్నాడు. జగన్ పొడిపించుకున్న వాడు అయితే నడుచుకుంటూ ఎందుకు వెళతాడు, రాష్ట్రం ఎందుకు గందరగోళం అయిపోలేదు అంటున్నాడు ! వైసీపీకి పక్షవాతం వచ్చి కదల్లేదు కానీ ఊపు ఊపాలని కదా ప్లాన్. లేకపోతే జగన్ ఎందుకు విచారణకి రాడు ? రాష్ట్ర పతి వరకూ ఎందుకు వెళతారు ? గవర్నర్ జోక్యం ఎందుకు కోరతారు ? డ్రామా కాకపోతే, ఉండవల్లి చెప్పిన లాజిక్ నిజం అయితే అలా చేయకూడదు కదా ! మరి ఎందుకు చేస్తున్నట్టు ? ఉండవల్లికి తెలియక కాదు. తెలివి తేటలు ఒలకబోసుకోవాలని. కన్ఫ్యూజ్ చేయాలని. కాకపోతే మాస్టారూ – మీరు కన్ప్యూజ్ చేస్తే గందరగోళంలో పడిపోయే పరిస్థితుల్లో అయితే ఏపీ లేదు. ఆయాస పడకండి. పై పెచ్చు మరో మాట అంటున్నాడు. చంద్రశేఖర్ రెడ్డితో జగన్ మాట్లాడుతున్నాడు. పెద్దాపురం సీటు మీద చర్చ జరుగుతుంటే పొడిచాడు అంటున్నాడు. పొడిచినోడే చెప్పాడు. సెల్ఫీ దిగి పలకరించి పొడిచాను. నీకోసమే పొడుస్తున్నా అని చెప్పాను కూడా అన్నాడు. మరి ఈ కవరింగ్ ఎవరి కోసం సార్ ?

అందుకే అన్నది ! గుమ్మడికాయ అని. దాని వల్ల పెద్ద లాభం లేదు. కేవలం సెంటిమెంటో, నమ్మకమో ! అంతే ! ఉండవల్లి కూడా తెలివైనోడు అని జనం అనుకోబట్టి అప్పుడప్పుడూ వచ్చి ఇలా అప్పియరెన్స్ లు ఇస్తాడు కానీ అంతకు మించి లాభం లేదు. అదీ పెద్దాపురం కోడి కత్తి స్టోరీ !

-->