చంద్రబాబుపైకి వెంకయ్యను దింపుతున్నాడా మోడీ రహస్య చర్చల్లో సీక్రెట్ ఇదే !

ప్రధాని ఉప రాష్ట్రపతితో మంతనాలు జరిపితే రహస్యం అని ఎలా అంటారు ? అవిదేశ ప్రయోజనాలకి సంబంధించిన విషయం – అని ఎవరైనా అంటే కొంచెం పక్కకి వచ్చి కూర్చొండి. డీటైల్డ్ గా మాట్లాడదాం. మోడీ దేశ ప్రయోజనాలు ఎలా ఉంటాయో సిలబస్ ప్రకారం చర్చిద్దాం ! లేదంటే, రాజకీయం ఉందీ అందులో, ఓ ప్లాను ఉంది అని ఒప్పుకుంటే మాత్రం ఇది చూడండి తెలిసిపోద్ది !

చంద్రబాబు ఢిల్లీని ఓ కుదుపు కుదిపేశాడు. వారంలో రెండు సార్లు టూరేసి మొత్తం కదిపేశాడు. మళ్లీ తొందర్లోనే వెళతాడు. ఇంకో పక్క నుంచి దక్షిణాదిలో పార్టీలను కదలకుండా పట్టుకుంటున్నాడు. మనం కలిసి ఉండాల్సిన అవసరం ఏంటి – ఎందుకు మనం ఒకరికొకరు సాయపడాలంటే – అని చెబుతున్నాడు. అవును. చంద్రబాబు చెప్పాడూ అంటే కచ్చితంగా మేటర్ ఉంటుంది అంటూ దేవెగౌడ లాంటి వాళ్లు సమర్థిస్తున్నారు. నిన్న బెంగళూరు. ఇవాళ తమిళనాడు. అది చూసి మోడీకి ఎకరం తడిసినట్టు ఉంది. అందుకే హఠాత్తుగా వెంకయ్యను కలిసి చర్చించాడు. విదేశీ విషయాలు చర్చకు వచ్చాయ్ అంటున్నారు ఆ భేటీలో ! కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికలు, చంద్రబాబు హడావుడి ముందు పెట్టుకొని విదేశాల గురించి మాట్లాడే వెర్రిబాగులోడు కాదు కదా మోడీ. అదైతే కరెక్ట్.

ఇంతకీ వెంకయ్యతో ఎందుకు చర్చిస్తాడు. ఎందుకంటే తెలుగు రాష్టాల ఇన్ఫో వెంకయ్యకి పక్కాగా ఉంటుంది. పై పెచ్చు దక్షిణాదిని బాగా స్టడీ చేసినోడు. కర్ణాటక నుంచి కంటిన్యూస్ గా రాజ్యసభ సభ్యుడు. అదీ కాక తమిళనాడు వ్యవహారాల్ని కాస్తో కూస్తో నడిపాడు ఒకప్పుడు. అందుకే అన్నీ కలిపి ఇప్పుడు చర్చకు వచ్చేలా చేశాయ్ మోడీని. అయితే వెంకయ్య చెప్పే మాటను మోడీ పాటిస్తాడు అని కాదు. వింటాడు. అందులో తనకి కావాల్సింది అర్థం చేసుకుంటాడు. చంద్రబాబుతో పెట్టుకోవడం మంచిది కాదు అని నేరుగా చెప్పిన వాళ్లలో వెంకయ్య ఒకడు. మరి అప్పుడు మాట వినని మోడీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు అంటే, జ్ఞాన దంతం మొలిచిందా మొన్నీ మధ్య ?

-->