వైసీపీలో చేరికలు పవన్ కి లాభమా ? ఏపీ రాజకీయాన్ని తిరగేసే లెక్క ఇదే !

శిఖరాన్ని తవ్వి గొయ్యిని పూడ్చే పనిలో ఉన్నాడు జగన్. అదేనండీ టీడీపీ నుంచి లీడర్లను లాగి వైసీపీని నింపుకొంటున్నాడు. పనిలో పనిగా పవన్ ను కూడా దెబ్బ తీస్తున్నాడు. కానీ అల్టిమేట్ గా ఈ ట్రెండ్ ముందు పవన్ కి లాభం. ఆ తర్వాత టీడీపీ గెయిన్ అయ్యేలా చేస్తుంది. చేరికలు జగన్ పార్టీని ఎలా దెబ్బ తీస్తాయో తెలుసా ?

అవునా ? జగన్ పార్టీ చేరికల్లో కూడా నెగెటివే తీశారా అని అనుకోకండి. రాజకీయం ఎప్పుడూ మన లెక్కల్ని బట్టీ మాత్రమే డిసైడ్ కాదు. కాంబినేషన్స్ అనేవి చాలా కీలకం. ఇఫ్పుడు టీడీపీలో నుంచి ఆత్రంగా లాక్కుంటున్నాడు. దాని వల్ల టీడీపీకి పెద్దగా నష్టం లేదు. ఎందుకంటే చంద్రబాబు ఆల్రెడీ ఫుల్ గా రిజర్వ్ బెంచ్ పెట్టుకున్నాడు. పార్టీకి ఉన్న గుడ్ విల్, పథకాలు, చంద్రబాబు బ్రాండ్ ఎవరికైనా పని చేస్తాయ్. నెగ్గిస్తాయ్. అందుకని నష్టం లేదు. కాకపోతే వైసీపీకి కాస్త ప్రచారం వస్తుంది. ఇది మొదట్లో కొద్ది రోజులే పనిచేస్తుంది. కానీ పార్టీ పరంగా మాత్రం చేరికలు జగన్ కి నష్టం. చీరాలలో చూడండి. ఆమంచి రాకతో వైసీపీకి మంచి కన్నా చెడే ఎక్కువ ఉంది. వ్యతిరేకత నడిచి వెళ్లడంతోపాటు పార్టీలో ఉన్న గ్రూపుల్ని కూడా రగిలించింది. ఇది టీడీపీకి అడ్వాంటేజ్. ప్రతీ చోటా ఇదే సినిమా. మరో మాట కూడా చెప్పాలి. సాయిరెడ్డి చాన్నాళ్లుగా కాపులపై కన్నేసి ఆ లీడర్లనే లాగుతున్నాడు. అవంతి లాంటి వాళ్ల వరస అదే !

పవన్ కి లీడర్లు లేకుండా పోతారు అనుకుంటున్నాడు. కానీ వాళ్లు మిస్ అయిన లాజిక్ ఒకటుంది. టీడీపీ నుంచి కొందరు వైసీపికి వెళితే, ఆల్రెడీ వైసీపీలో ఉన్నవాళ్లు – టీడీపీలోకి రాలేని వాళ్లు జన సేనలో చేరతారు. అంటే 60 శాతం ఉన్న టీడీపీ నుంచి 10 శాతం లాక్కుంటున్నాడు జగన్. మరి 35 శాతం ఉన్న జగన్ నుంచి 10- 15 శాతం లాగితే ఏమవుతుంది ? వైసీపీ 30 శాతం దగ్గరే మిగిలిపోతుంది. జనసేన 20 శాతం అందుకుంటుంది. అంటే టీడీపీకీ వైసీపీకి మధ్య 20 శాతం గ్యాప్ ఉంటుంది. ఇదే లెక్క ఫలితాలు వచ్చాక తెలుసుకుంటాడు జగన్. వెయిడ్ అండ్ సీ.

-->