వైసీపీలోకి నెక్ట్స్ జంప్ చేసేది ఆ ఎమ్మెల్యేనే ! టీడీపీలో ఆయన పెర్ఫామెన్స్ 20% మాత్రమే !

ఆత్రంగా ఎదురు చూసిన కప్పలు ఆఖరి నిమిషంలో ఎగిరిపోతున్నాయ్. చంద్రబాబు నట్లు బిగించడం ఓ కారణం అయితే, మళ్లీ టిక్కెట్టే ఇవ్వడేమో అనే భయం కుదిపేస్తోంది వాళ్లని ! ఆమంచి, అవంతి తర్వాత వేణువు మోగడం ఖాయం అయిపోయింది. త్వరలో ఉంటుంది జంపింగ్ పండగ !

గుంటూరులో ముందు నుంచి ఆయన దండగ బేరమే ! ఎమ్మెల్యేలంతా పోటాపోటీగా ఉంటే ఆయన మాత్రం దుక్కికి దూడల్లోకి, దాణాకి ఎడ్లలోకి అన్నట్టుగా ఉన్నాడు. నిధుల విషయంలో ముందుకి, విధుల విషయం వెనక్కి ఉంటున్నారని చంద్రబాబు కూడా గతంలోనే బ్రెయిన్ వాష్ చేశాడు. అయినా మార్పు లేదు. అందరూ అక్కడ ఉన్నారు. నేను మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తా ? అన్నట్టు వైసీపీ వైపు చూస్తున్నాడు ముందు నుంచి అనే విమర్శలు ఉన్నాయ్. ఇప్పుడు అదే నిజం అని అర్థం అవుతోంది. చంద్రబాబు కూడా ముందు జాగ్రత్తగా ఆల్టర్ నేటివ్ రెడీ చేసి పెట్టుకున్నాడు అని పార్టీ చెబుతోంది. ఎందుకంటే ఆయన సభ్యత్వ నమోదులో కూడా కింద నుంచి ఫస్టు వచ్చాడు. పట్టుమని 20 శాతం కూడా మించలేదు ఆయన పనితీరు. ఏందబ్బా ఇలా మరీ చిక్కిపోయింది లెక్క అంటే – ఏం చేస్తాం అన్నా. ఇంతే మరి, గొర్రె తోక బెత్తెడే అన్నాడు. ఇప్పుడు ఆ గొర్రె ఎవరో క్లారిటీ వస్తోంది. ఆయన జంపుడు కార్యక్రమం త్వరలోనే ఉంటుందని పార్టీ కచ్చితంగా చెబుతోంది. చంద్రబాబు వైపు నుంచి మాత్రం ఎలాంటి బుజ్జగింపూ ఉండదని, ఇక వదిలేయండి అనే మాట కూడా ఆల్రెడీ వచ్చేసిందని పార్టీలో టాక్ నడుస్తోంది. అంటే ఆయన వెళ్తానన్నా వద్దనే వాళ్లే లేరని తేలిపోయిందన్న మాట.

టీడీపీలో ఇంకా ఇలాంటి వాళ్లు మరో ముగ్గురు ఉంటారని టాక్ నడుస్తోంది. గెలిచే పార్టీ నుంచి వెళ్లిపోవడం ఎందుకు అంటే, వాళ్ల లాజిక్ వాళ్లకుంది. గెలిచే పార్టీలోనే ఉండి మేము ఓడిపోవడమా ? ఓడిపోయే పార్టీలోకి వెళ్లి గెలిచే ప్రయత్నం చేయడమా అనేది ఆలోచించుకుంటున్నామని చెబుతున్నారు. లాజిక్ కాస్త కన్ ఫ్యూజింగ్ గా ఉన్నా వాస్తమే అది. టీడీపీలో వాళ్ల వత్తి కాలిపోయింది. ఇక వెలుగుతుందన్న గ్యారెంటీ లేదు. అందుకే వైసీపీలో ట్రై చేస్తున్నారు. లెట్ దెమ్ ట్రై !

-->