Wall Nuts Uses: వాల్నట్ ఆరోగ్య ప్రయోజనాలు

Wall Nuts Uses In Telugu: వాల్నట్స్ ను తెలుగులో అక్రూట్ కాయలంటారు. వీటిని దాదాపు అందరూ చూసి ఉంటరు. వాల్నట్స్ పై భాగం చాలా గట్టికా ఉంటుంది. పంటితో కొరికి పగలగొడదామనుకుంటే పళ్లు కూడా ఉడిపోవచ్చు. రాయితోనే లేక వాల్నట్స్ పగలగొట్టే పరికరంతోనే వీటిని పగలగొట్టాలి.

health-benefits-walnuts-telugu
source: Krasula / Shutterstock.com

వాల్నట్స్ లోపల ఉండేదాన్ని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో కొవ్వు, విటమిన్స్, క్యాలరీస్, ఫైబర్, ఒమేగా 3, సెలీనియం, కాల్షియం, జింక్, విటమిన్ ఈ మరికొన్ని బీ విటమిన్లు కలిగి ఉంటాయి.

వాల్ నట్స్ తో ఆరోగ్యప్రయోజనాలు

  • గుండెను ఆర్యోగ్యంగా ఉంచుతుంది
  • మెదడును అభివ్రుధ్ది చేస్తుంది
  • క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
  • ఎముకలను బలోపేతం చేస్తుంది
  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది
  • మధుమేహాన్ని తగ్గిస్తుంది
  • బరువునీ తగ్గిస్తుంది

40 గ్రాముల వాల్ నట్స్ లో పోషకాలు

కేలరీలు – 185
నీరు – 4%
ప్రోటీన్ – 3 గ్రాములు
పిండి పదార్థాలు – 9 గ్రాములు
చక్కెర – 7 గ్రాముల
ఫైబర్ – 9 గ్రాములు
కొవ్వు – 5 గ్రాములు

వాలన్స్ ఆరోగ్య ప్రయోజనాలు

గుండె సురక్షితం

వాలనట్స్ లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తప్రసరణ పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంద. చెడు కొలస్ట్రాల్ ను కూడా ఇది నియంత్రించడంతో భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

వీర్య కణాల రేటు పెరుగుదల

వాలనట్స్ తీసుకుంటే పురుషుల్లో వీర్య కణాలు పెరుగుతాయి. ఈ కాలంలో వీర్య కణాల లోపం కేసులు అధికం అవుతున్నాయి. మగవారు వాల్నట్స్ తీసుకోవడం ద్వారా వీర్యకణాలు సమ్రుధ్దికా పెరుగుతాయి. తద్వారా సంతానలేమి సమస్య కూడా వారికి రాదు.

వాల్నట్స్ మెదడు

చూడడానికి వాల్నట్స్ చాలా చిన్నగా ఉన్నా.. ఇవి మెదడు పై మంచి ప్రభావాన్ని చూపగలవు. ఇందులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మతిమరుపును తగ్గిస్తుంది. అల్జీమర్స్ వ్యాధిని కూడా రాకుండా నివారిస్తుంది. చిన్నప్పటి నుంచి పిల్లలకు వాల్నట్స్ ఇవ్వడం ద్వారా వాళ్ల మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది.

వాల్నట్స్ నెగటివ్ ప్రభావం

వాల్నట్స్ కొందరికి పడవు. ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా వాల్నట్స్ తీసుకున్న వెంటనే అస్వస్థతకు గురైతే అలాంటి వారు వీటికి దూరంగా ఉండాలి.

వాల్నట్స్ లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ కొందరికి ఛాతిలో మంట కలిగించవచ్చు. కాబట్టి ఎక్కువ మోతాదులో కాకుండా కొన్న గ్రాముల వాల్నట్స్ మాత్రమే తీసుకోండి

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు