Thati Bellam Benefits: తాటి బెల్లం వల్ల కలిగే అద్భతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Thati Bellam Benefits: తాటి బెల్లన్ని పూర్వం చక్కెరకు బదులుగా టీలో, కూరల్లో పెద్దలు వాడే వారు. ప్రస్తుతం ఆ సంప్రదాయం పోయింది. చక్కెరను చెరుకు నుండి తయారు చేస్తారు. అయితే ఈ ఛక్కెరలో తీపి తప్ప ఎలాంటి పోషకాలు ఉండవు. కానీ ఈ తాటి బెల్లంలో చెక్కర కన్నా 60 శాతం ఎక్కువ ఖనిజాలు, పోషకాలు ఉంటాయి. తాటి బెల్లం ఇంకా ఎన్ని రకాలు మనకు బెనిఫట్స్ కలిగిస్తుందో లాంటి విషయాలను తెలుసుకుందాం.

thati bellam benefits
Source: 1.bp.blogspot.com

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

  • రక్తహీనతను తగ్గిస్తుంది, హెమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. దీంట్లో ఉండే యాంటీబాడీస్ బ్లడ్ ను ప్యూరిఫై చేస్తుంది
  • ఇందులో ఉండే పొటాషియం కొవ్వును కరిగిస్తుంది. బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. లివర్ పనితనాన్ని మెరుగుపరుస్తుంది.
  • ఉదయాన్నే ఒక టీ స్పూన్ తాటిబెల్లాన్ని తీసుకుంటే మైగ్రెయిన్ బాధ తప్పుతుంది.
  • గోరు వెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగితే జలుబు, దగ్గు, పొడి దగ్గు, ఆస్తమా లాంటివి తగ్గుతాయి.
  • తాటి బెల్లలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్దకాన్ని కూడా నివారిస్తుది. హానికరమైన టాక్సిన్స్ ను కూడా బయటకి పంపిస్తుంది.
  • తాటి బెల్లం క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. విష పదార్ధాలను బయటకి పంపిస్తుంది.
  • తాటి బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి.

తాటి బెల్లం నువ్వుల లడ్డు చేసుకునే విధానం

  • 2 కప్పుల తాటి బెల్లం
  • 2 కప్పుల నువ్వులు

పెనంపైన నువ్వులను లైట్ బ్రౌన్ కలర్ లో వేయించాలి. అనంతరం తాటి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెల్లం, నువ్వులను కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయిన దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇక తాలి బెల్లం నువ్వుల లడ్డు రెడీ.

తాటి బెల్లం కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • తాటి బెల్లం కొనడంలో చాలా జాగ్రత్తలు పాటించాలి
  • కొనే తాటిబెల్లంలో కల్తీ లేకుండా చూసుకోవాలి
  • చెక్కరతో చేసిన తాటి బెల్లాన్ని కూడా అమ్ముతారు, దాన్ని కొనవద్దు
  • తెల్లగా ఉన్న తాటి బెల్లాన్ని కొనవద్దు
  • గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం, గోదావరి జిల్లా నిడదవోలు, తాడేపల్లిగూడెం, చాగల్లు, కొవ్వూరు, పెదవేగి దేవరపల్లి, గోపాలపురం, భీమవరం, వీరవాసరం, తణుకు ప్రాంతాల్లో మాత్రమే ఒరిజినల్ అసలైన తాటి బెల్లం లభిస్తుంది.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు