Immunity Foods: రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు

Immunity Power incresing Foods: మనం నిత్యం కలుషితమైన వాతావరణంలో ఉంటాం. దీని వల్ల మన బాడీలో బ్యాక్టీరియా, ఇతర వైరస్ లాంటివి వచ్చి చేరతాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటే ఇలాంటి వైరస్, ప్రమాదకరమైన బ్యాక్టీరియా నుంచి సేవ అవ్వొచ్చు, లేదంటే చాలా ప్రమాదం. అయితే ఈ రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఏ ఆహార పదార్ధాల్లో ఉంటాయి. అవి ఏవో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

immunity-power-incresing-foods-telugu
Source: imagesvc.meredithcorp.io

విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మన బాడీలో తెల్ల రక్త కణాల ఉత్పత్తికి దోహదపడుతుంది. సిట్రస్ పండ్లలో ఈ విటమిన్ సి అధికంగా ఉంటుంది. సిట్రస్ పండ్ల లిస్ట్ చూడండి.

  • పంపారు పనస
  • ద్రాక్ష పండు
  • బత్తాయి
  • నారింజ
  • టాన్జేరిన్
  • నిమ్మకాయలు

పసుపు

పసుపులో రోగనిరోధక శక్తిని పెంచే కర్కుమిన్ ఉంది. ప్రతీ రోజు చేసే వంటల్లో చిటికెడు పసుపు వేసుకొని తింటే శరీరానికి చాలా మంచిది. పాలల్లో పసుపును వేసుకొని తాగినా చాలా మంచిది.

వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన, జింక్, సల్ఫర్, సెలీనియం, విటమిన్ ఏ, విటమిన్ ఈ ఉంటాయి. ఇవి బాడీలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆహరంలో వెల్లుల్లిని భాగం చేసుకుంటే చాలా మంచిది.

ఉసిరికాయ

ఉసిరికాయలో ఐరన్, కాల్షియం ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే తెల్ల రక్త కణాలను పెంచుతుంది. అలా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అల్లం

అల్లంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది రక్తపోటు కొలెస్టాల్ స్థియిలను అదుపులో ఉంచుతుంది.

బచ్చలి కూర 

బచ్చలి కూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంటా ఉంటాయి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

పెరుగు

పెరుగులో విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. పెరుగు ఒక ప్రోబయోటిక, ఇది మనల్ని ఫ్ల్యూ, జలుబు, దగ్గు, అనారోగ్యం నుంచి కాపాడుతుంది.

బ్రోకలీ

బ్రోకలీలో విటమిన్లు ఏ, సి, ఇ ఉంటాయి. ఇతర ఖనిజాలు కూడా దీంట్లో ఉంటాయి. తక్కువగా ఉడికించడం వల్ల దీంట్లో పోషకాలు అలాగే ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్, ప్లేవనాయడ్స్ నిండి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

బొప్పాయి

మొత్తం ఒక బొప్పాయి పండులో 224 శాతం విటమిన్ సీ ఉంటుంది. పాపైన్ అనే జీర్ణ ఎంజైమ్ కూడా బొప్పాయ్ లో ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

కివి

కివి పండ్లలో ఫోలేట్, పొటాషియం, విటమిన్ కె, విటమిన్ సి లాంటి పోషకాలు ఉంటాయి. విటమిన్ సీ తెల్ల రక్తకణాలను పెంచుతుంది. ఇలా కివి పండు మీ బాడీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలు

పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ బి-6 లాంటి పోషకాలు ఉంటాయి, ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడండ్స్ గా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

రోగనిరోధక శక్తిని తగ్గించే ఆహార పదార్ధాలు

  • కలుషితమైన ఆహారం
  • ఎక్కువ కాలం నిలవ ఉన్న ఆహారం లేదా పానీయాలు
  • మద్యం
  • జంక్ ఫుడ్స్
  • సోడా మరియు శీతల పానీయం
  • ప్యాకేజీ చేసిన ఆహారం పానీయాలు
  • అదనపు ఉప్పు / తీపి

రోగనిరోధక శక్తని పెంచుకోవాలంటే ఇవి కూడా పాటించండి

  • సమయానికి అవసరమైన టీకాలు పొందండి
  • క్రమం తప్పకుండా వ్యాయామం
  • సమతుల్య ఆహారం తీసుకోండి
  • పొగత్రాగ వద్దు
  • మద్యం సేవించవద్దు
  • ఒత్తిడి లేకుండా ఉండండి

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు