Vitamin D Foods: విటమిన్ డి లభించే ఆహార పదార్ధాలు

Vitamin D Foods Telugu: శరీరానికి విటమిన్-డి చాలా అవసరం. విటమిన్ డి లోపిస్తే రికెట్స్, బోలు ఎముకలవ్యాధి, మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ లాంటి వాటి బారిన పడే ప్రమాదం ఉంది. సుర్యరష్మి నుంచి విటమిన్ డి లభించినా, అది మన బాడీకి అవసరమైన మోతాదులో ఉండదు. కాబట్టి విటమిన్-డి ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవాలి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఈ ఆర్టికల్ లో మీకు అందిస్తున్నాము.

vitamin-d-foods-telugu
Source: res.cloudinary.com

విటమిన్ డి అధికంగా ఉండే ఆహార పదార్ధాలు

ఆవు పాలు

పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ప్రతీ రోజు ఒక గ్లాసు పాలు తాగితే మీకు నాల్గవ వంతు విటమిన్ డి లభిస్తుంది. పాలల్లో ప్రొటీన్, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ లాంటి ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి.

గుడ్లు

గుడ్లల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. గుడ్డులోని తెల్ల పదార్ధంలో విటమిన్ డి సమృద్ధగా ఉంటుంది. పచ్చసొన లో ప్రొటీన్స్, కావలసినంత కొవ్వు పదార్ధం కూడా ఉంటుంది. రోజు 1, 2 గుడ్లను తీసుకోవాడం ఆరోగ్యానికి చాలా మంచిది.

చేపలు

చేపల్లో కూడా విటమిన్-డి సమృద్ధిగా ఉంటాయి. అయితే కొన్ని రకాల చేపల్లో విటమిన్-డి పుష్కలంగా ఉంటాయి. సాల్మన్ చేప, పలాస చేప, ట్యూనా చేపలో విటమిన్ డి అధికంగా ఉంటుంది.

పుట్టడొడుగులు

పుట్టగొడుగులు ప్రధానంగా సూర్యకాంతిలో పెరుగుతాయి, కాబట్టి వాటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. పుట్టడొడుగుల్లో B1, B2, B5, రాగి లాంటి ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి. అడవిలో పెరిగిన పుట్టగొడుగుల్లో విటమిన్-డి అధికంగా ఉంటుంది. మాంసం తిననివారు వీటిని భుజించవచ్చు.

సోయ ఉత్పత్తులు

సోయలో కూడా విటమిన్-డి పుష్కలంగా ఉంటుంది. సోయ పాలు, సోయ పెరుగులో విటమిన్ డి తో పాటు ప్రొటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ప్యూర్ వెజిటేరియన్ గా ఉన్నవారు ఈ సోయా పదార్ధలు తింటే మంచి పోషకాలు అందుతాయి.

పెరుగు

పాలల్లో విటమిన్ డి ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే పెరుగులో విటమిన్ డి అంతకంటేఎక్కువ ఉంటుందని పరిశోధనల్లో తేలింది. కాబట్టి పెరుగును ప్రతీ రోజు భోజనంలో భాగంగా చేసుకోండి.

విటమిన్ డి కోసం కొన్ని చిట్కాలు

  • వేసవి కాలంలో రోజుకు 15 నిమిషాలు ఎండలో ఉండండి
  • ప్రతీ రోజు విటమిన్ డి కోసం సప్లమెంటరీ డైట్ తీసుకోండి
  • 40 ఏళ్ల పై బడిన మహిళల్లో బోలు ఎముకల వ్యాధి బారిన పడవచ్చు. కాబట్టి వారు విటమిన్ డి కి సంబంధించిన ఆహారం తీసుకోవాలి.
  • ఆహారంతో పాటు నడక, పరుగు, డ్యాన్స్, స్కీయింగ్ లాంటివి చాలా అవసరం. వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు కూడా చేయాలి.

వీటికి దూరంగా ఉండండి

  • అధిక చక్కెర, ఉప్పు పదార్ధాలను ఆహారంలో తీసుకోకండి
  • కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తగ్గించండి
  • కెఫిన్ తక్కువగా తీసుకోండి ఎందుకంటే ఇది బాడీలో విటమిన్ డి పెరుగుదలకు అడ్డంకిగా మారుతుంది.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు