Kitchen Tips: వంటింటి చిట్కాలు, కిచెన్ టిప్స్

Kitchen Tips Telugu: మన పెద్దలు మనకు ఎన్నో రకాల వంటింటి చిట్కాలు చెబుతుంటారు. చిన్న దగ్గు, జలుబుు లాంటివి చేస్తే ఆసుపత్రికి వెళ్లకుండా నేరుగా ఇంట్లోనే నయం చేసుకునేట్టుగా ఈ చిట్కాలు మనకు ఉపయోగపడతాయి. ఈ కాలంలో చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ఆసుపత్రికి పరుగులు తీసి వేలు ఖర్చు చేస్తున్నారు. అలా కాకుండా చిన్న చిట్కాల ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోండి. అలాంటి కొన్ని వంటింటి చిట్కాలను మీకోసం కింద అందించాము.

kitchen tips telugu
Source: images.herzindagi.info

కిచెన్ టిప్స్

  • పచ్చిమిరపకాయలకు పసుపు చేసి సీసాలో వేస్తే అవి ఎరుపులోకి మారకుండా ఉంటాయి
  • ఉప్పుడ జాడీల్లో రెండు పచ్చిమిరపకాయలు వేస్తే.. ఉప్పు పచ్చిగా మారకుండా ఉంటుంది
  • పెరుగు పుల్లగా మారకుండా ఉండాలంటే.. దాంట్లో ఓ కొబ్బరి ముక్క వేయండి
  • వెల్లుల్లి రేకులు సులువుగా రావాలంటే వాటిని ఎండలో ఉంచండి
  • దోసెలపిండిలో ఓ కప్పు సగ్గుబియ్యం వేసి కలిపి రుబ్బితే దోశ చిరగకుండా వస్తుంది
  • కేక్ వేసేటప్పుడు అందులో ఓ చెంచా గ్లిసరిన్ వేస్తే కేక్ ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది
  • జామ్ సీసా మూత తీయడానికి గట్టికా ఉంటే దాన్ని మంట మీద పెట్టండి
  • కోడుగుడ్డు సొనలో కుంకుమ పువ్వు వేసి ఆమ్లెట్ వేస్తే.. అది రుచిగా మాత్రమే కాకుండా అందంగా ఉంటుంది

వంటింటి చిట్కాలు

  • ఆమ్లెట్ వేసే ముందు పెనంమీద ఉప్పు చల్లితే అంటుకోకుండా ఉంటుంది
  • గుడ్డు పగలకుండా ఉండాలంటే నిమ్మరసం పూసి ఆరబెట్టండి
  • అన్నం వార్చినప్పుడు వచ్చిన గంజిలో చాలా విటమిన్స్ ఉంటాయి. చలికాలం అయితే దాంట్లో కాస్త తేనె, నారింజ రసం, వేసవికాలంలో అయితే కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలుపుకుంటే రుచిగా మాత్రమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది.
  • అన్నం తొందరగా జీర్ణం కావాలంటే వేయించిన బియ్యాన్ని అన్నంగా వండాలి
  • టమాట కూర ఉడికేటప్పుడు అందులో చిటికెడు పంచదార వేస్తే ఆ కూర కమ్మగా ఉంటుంది
  • పురీలు పొంగి బాగా రావాలంటే.. గోదుమ పిండిలో కొద్దిగా బొంబాయి రవ్వ లేదా బియ్యపు పిండి కలపాలి
  • చపాతీలు తెల్లగా మెత్తగా ఉండాలంటే పిండిలో రెండు చెంచాల పాలు, ఒక చెంచా బియ్యం పిండి, కొంచెం నూనె వేసి ఐస్వాటర్ తో పిండిని కలపాలి.

కూరగాయలను ఎలా చూసి కొనాలి?

  • వంకాయలు ముదతలు పడకుండా ఉండాలి. గట్టిగా, మెత్తగా ఉండకూడదు. తొడిమ ఆకుపచ్చ రంగులో, తోలు నిగనిగ లాడుతూ ఉండాలి. పుచ్చులు లేకుండా చూడాలి
  • బంగాలాదుంపలు గట్టిగా వుండాలి. పైన ఆకుపచ్చ రంగులు, నల్లని మచ్చలుంటే కొనవద్దు. పై పొర తీసినప్పుడు లోపలి భాగం లేత పసుసు పచ్చ రంగులో ఉండాలి.
  • అల్లం మరీ గట్టిగా మరీ మెత్తగా ఉండకూడదు. అల్లం పొర తీస్తే దాని ఘాటు తెలుస్తుంది, దాన్ని బట్టి అల్లాన్ని కొనాలి
  • మంచి ఆకారంలో ఉన్న క్యారెట్ ను మాత్రమే కొనాలి. వంకరగా, ముడతలు ఎత్తుపల్లాలుగా ఉన్న క్యారెట్ ను కొనవద్దు.
  • బీట్ రూట్ కొనేప్పుడు కింది భాగానికి వేర్లు ఉండే విధంగా చూస్కోండి. ఎటువంటి మచ్చలు, రంద్రాలు ఉన్నా వాటిని కొనవద్దు.

ఫ్రిడ్స్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • ఆహార పదార్దాలు ఇరికించి పెట్టవద్దు
  • సువాసన వస్తువుల వాసన బయటకు రాకుండా జాగ్రత్తగా కవర్ చేసి పెట్టాలి.
  • కూరగాయలు కడిగిని తరువాత అవి ఆరిపోయిన తర్వాతనే వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టాలి.
  • పాలు, పెరుగు, రుబ్బిన పిండి లాంటివి ఏవైనా ఉంటే వాటిపై మూత వుండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి
  • వేడివేడి ఉండే పదార్ధాలను అలాగే పెట్టకుండా చల్లార్చి పెట్టాలి.
  • అరటిపళ్లను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు
  • ఫ్రిడ్జ్ లో ఐస్ పెరగకుండా ఉండాలంటే ఒక మూలన కొద్దిగా ఉప్పు వేయండి

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు