Rice water benefits: బియ్యం నీటితో హెయిర్ కేర్

Rice water benefits:  జుట్టు సంరక్షణకు వయసుతో సంబంధం లేకుండా అందరూ అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. జుట్టు పొడవుగా, మందంగా, నల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలా ఉండడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల షాంపూలు, నూనెలు వాడుతూ ఉంటారు. అయితే వీటితో జుట్టుకు మేలు కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతుంది. జుట్టుకే కాకుండా కంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ఏవేవో రసాయనాలు కలిపినవి కాకుండా ఇంట్లో దొరికే బియ్యం నీళ్లతో మీ జుట్టును సహజసిద్ధంగా ఒత్తుగా తయారు చేసుకోవచ్చు. అవును మీ జుట్టు అందంగా మెరవాలంటే ఒక గ్లాసు బియ్యం నీళ్లు సరిపోతాయి. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే బియ్యం నీళ్లతో మన జుట్టును ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

rice-water-for-hair-growth-in-telugu
Source: makeherover.com

జుట్టు, చర్మ సంరక్షణకు బియ్యం నీరు చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. మాడ్ అని పిలవబడే వరి నీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బియ్యం అమైనో ఆమ్లాలు, విటమిన్ బి, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

బియ్యం నీరు ఎలా తయారు చేయాలి

  • ఒక గిన్నెలో బియ్యం తీసుకోవాలి.. తెలుపు, గోధుమ లేదా బాస్మతి ఇలా ఏ రకమైన బియ్యం అయినా తీసుకోవచ్చు
  • తీసుకున్న బియ్యాన్ని ఎక్కువగా కాకుండా..ఒకసారి పైపైన కడగాలి.
  • ఇప్పుడు ఈ బియ్యంలో కొంచెం నీళ్ళు పోసి 20 నిమిషాలు నానబెట్టాలి. ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి బియ్యాన్ని నీటితో బాగా కలపాలి.

బియ్యం నీటిని ఎలా ఉపయోగించాలి?

  • ఒక కప్పు బియ్యం నీటిని తీసుకొని దానికి కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ ను కలపండి. ఎసెన్షియల్ ఆయిల్ వాడడం వల్ల మంచి సువాసన వస్తుంది. ఎసెన్షియల్ ఆయిల్ లేకపోయినా బియ్యపు నీటిని వాడుకోవచ్చు.

జుట్టుకు బియ్యం నీటి వల్ల కలిగే ప్రయోజనాలు

  • బియ్యం నీటిలో ఇనోసిటాల్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది జుట్టును బలంగా మరియు మందంగా చేస్తుంది.
  • జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెంచడంలో బియ్యం నీళ్లు అద్భుతంగా పని చేస్తాయి. ఇందులో ఉండే అమైనో ఆమ్లం జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే బియ్యం నీటిలో ఉండే విటమిన్లు బి, సి ఇ జుట్టు పెరగడానికి తోడ్పడతాయి.
  • మార్కెట్లో దొరికే వివిధ రకాల షాంపూలను ఉపయోగించడం ద్వారా జుట్టు పొడిగా, ప్రాణము లేనిదిగా మారుతుంది. బియ్యం నీటిలో ఉన్న అమైనో ఆమ్లం మీ దెబ్బతిన్న జుట్టును తిరిగి సహజ స్థితికి చేరుస్తుంది.

చుండ్రును తగ్గించడంలో..

  • చుండ్రు చాలా సాధారణ సమస్యే అయినా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే జుట్టు వేగంగా ఊడిపోయే అవకాశం ఉంటుంది. జుట్టు ఊడిపోయేందుకు చుండ్రు కూడా ఓ కారణం కాబట్టి.. జుట్టును బియ్యం నీటితో క్రమం తప్పకుండా కడిగితే చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది.

కండీషనర్‌గా.. బియ్యం నీళ్లు

షాంపూతో తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు కండీషనర్‌ను అప్లై చేసుకోవడం చాలా అవసరం. మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన కండీషనర్లు వాడడం కంటే ఇంట్లోనే సులభంగా తయరు చేసుకునే బియ్యం నీటిని కండీషనర్ గా ఉపయోగించవచ్చు.  బియ్యం నీటిలో కొద్దిగా రోజ్మేరీ, లావెండర్ లాంటి ఎసెన్షియల్ ఆయిల్ ను వేసి కండీషనర్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మీ మొత్తం జుట్టు మీద రాసుకుని అరగంట పాటు ఉంచి చల్లటి నీటితో కడగితే మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, బలంగా కూడా తయారవుతుంది.

తలలో పేల నుంచి ఉపశమనం

మహిళల తలలో పేలు సర్వసాధారణం. వారి తలలో పేలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికి పరిష్కారం కోసం బియ్యం నీటితో జుట్టుని శుభ్రం చేసుకుంటూ ఉంటే తలలో ఉండే పేలు పూర్తిగా పోతాయి. బియ్యం నీటిలో ఉన్న పిండి పదార్ధం సులభంగా పేలని చంపగలదు.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు