Silky Hair Tips: జుట్టు పొడువుగా, సిల్కీగా ఉండడానికి చిట్కాలు

Silky Hair Tips: జుట్టు సిల్కీగా మారడానికి మహిళలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నంలో కొన్ని హానికరమైన కెమికల్స్ వాడడం వల్ల ప్రతికూల ప్రభావం చూపడంతో జుట్టు ఉడిపోవడం లాంటివి జరుగుతాయి. జుట్టు పొడగుగా ఉంటే అందం రెట్టింపు అవుతుంది. అయితే సహజంగా ఈ జుట్టు ఆరోగ్యంగా అందంగా పెరగాలంటే న్యాచురల్ చిట్కాలు ఎన్నో ఉన్నాయి. ఆ చిట్కాలను మీకు ఈ ఆర్టికల్ లో అందిస్తున్నాము. కెమికల్స్ వాడకుండా ఈ కింది చిట్కాలను పాటించండి.

silky hair tips in telugu
Source: media.newstrack.in

సిల్కీ జుట్టు కోసం చిట్కాలు

గుడ్డు చిట్కా

  • గుడ్డులోని పచ్చసొన
  • 1 చెంచా ఆలివ్ నూనె
  • 1 చెంచా తేనె

ఉపయోగించే విధానం: గుడ్డు పగలకొట్టిన తరువాత దాంట్లో ఆలివ్ ఆయిల్, తేనె వేసి బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని జుట్టుకు ప్యాక్ లా అంటించాలి. అరగంట జుట్టును అలాగే ఆరబెట్టి, ష్యాంపుతో కడిగేసుకోవాలి.

ఇలా చేస్తే గుడ్డులో ఉండే ప్రొటీన్, సల్పర్, జింక్, ఐరన్, అయోడిన్, భాస్వరం, విటమిన్ ఎ, విటమిన్ ఇ, లాంటి పోషకాలు జుట్టుకు అందుతాయి. అలా జుట్టు పొడవుగా, సిల్కీగా మారుతుంది.

కలబంద చిట్కా

  • 1 కప్పు కలబంద గుజ్జు
  • 2 టీస్పూన్ల ఆముదము
  • 2 టీస్పూన్ల మెంతి పొడి

ఉపయోగించే విధానం: కలబంద గుజ్జు, ఆముదము, మెంతి పొడి బాగా కలుపుకోవాలి. రాత్రి పడుకునే ముందు వెంట్రుకల కొన నుంచి మొత్తం చివరి వరకు మొత్తం జుట్టుకు అంటించాలి. ఉదయం వరకు అలానే ఉంచి. లేచిన తర్వాత ష్యాంపూతో తల స్నానం చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టులో చుండ్రు మాయం అవుతుంది, జుట్టు మృదువుగా మారుతుంది.

కొబ్బరి / ఆలివ్ చిట్కా

  • 3 టీస్పూన్ల కొబ్బరి లేదా ఆలివ్ నూనె

ఉపయోగించే విధానం: ఆలివ్ లేదా కొబ్బరి నూనెను జుట్టుకు అంటించి చేతి వేళ్లతో 15 నిమిషాలపాటు మసాజ్ చేయాలి. అనంతరం టవల్ ను వేడినీటిలో ముంచి జుట్టును దానితో చుట్టి కప్పివేయాలి. ఆరగంట తర్వాత ఫ్యాంపూతో తల స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టుకు పోషకాలు బాగా అది మరింత ఒత్తుగా పెరగడానికి దోహదం చేస్తుంది.

మెంతి విత్తనాల చిట్కా

  • 1 చెంచా మెంతి గింజలు
  • కొద్దిగా కొబ్బరి నూనె

ఉపయోగించే విధానం: మెంతిగింజలను కొబ్బరి నూనెలో వేసి వారం పాటు అలాగే ఉంచాలి. తరువాత దాన్ని తీసుకొని జుట్టుకు బాగా మెత్తగా మసాజ్ చేయాలి. అరగంట తరువాత ష్యాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మెంతి గింజల్లో ఉన్న హార్మోన్లు జుట్టుకు నేరుగా అందుతాయి. అందులో ఉండే నికోటినిక్ ఆమ్లం, ప్రోటిన్ జుట్టు మూలాల నుంచి బలపరుస్తుంది.

పెరుగు చిట్కా

  • 1 కప్పు పెరుగు
  • 2 టీస్పూన్ల ఉసిరి పొడి

ఉపయోగించే విధానం: పెరుగు, ఉసిరి పొడిని బాగా కలుపుకోవాలి. తరువాత ఆ మిశ్రామన్ని జుట్టుకు బాగా అంటించి మెత్తగా మసాజ్ చేయాలి. అరగంట తర్వాత ష్యాంపూతో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే పెరుగులో ఉండే విటమిన్-ఎ, విటమిన్-డి లక్షణాలు జుట్టు పెరగడానికి దోహదపడతాయి. చుండ్రు సమస్య కూడా దీనితో తొలగి పోతుంది.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు