Salmon Fish Benefits: సాల్మన్ ఫిష్ ఆరోగ్య ప్రయోజనాలు

Salmon Fish Benefits: సీ ఫుడ్స్ లో సాల్మన్ ఫిష్ ప్రముఖమైన స్థానం ఉంది. సాల్మన్ ఫిష్ రుచి అద్భుతంగా ఉంటుంది. రుచితో పాటు ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఎన్నో వ్యాధుల నుంచి ఈ సాల్మన్ ఫిష్ మనల్ని కాపాడుతుంది. సాల్మన్ ఫిష్ కు సంబంధించిన ఆరోగ్యప్రయోజనాలు దుష్ప్రభావాల గురించి ఈ ఆర్టికల్ లో మనము తెలుసుకుందాం.

salmon-fish-in-telugu-benefits
Source: mages.herzindagi.info

సాల్మన్ ఫిష్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

  • సాల్మన్ ఫిష్ లో ఒమేగా 3 ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన బాడీలో రక్తపోటుని తగ్గిస్తుంది, వాపును కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్ బారి నుంచి కూడా కాపాడుతుంది.
  • సాల్మన్ ఫిష్ లో ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రొటీన్ మన బాడీలో గాయాలని తొందరగా నయం చేయడానికి, ఎముకల్లో బలం పెరగడానికి దోహదపుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ ఫిష్ చాలా మంచిది.
  • ఈ చేపలో బి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి12, నియసిన్, విటమిన్ బి6, రిబోఫ్లేవిన్, పంతోతేనిక్ ఆమ్లం, థియమిన్, ఫాలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. వంట్లో ఏవైనా మంటలుంటే కూడా ఇవి తగ్గిస్తాయి.
  • సాల్మన్ లో పాటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది బాడీలో రక్తపోటును తగ్గిస్తుంది, గుండెజబ్బులు రాకుండా నిరోధిస్తుంది. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఈ పొటాషియం చాలా హెల్ప్ అవుతుంది.
  • సాల్మన్ లో ఉండే సెలీనియం ఖనిజం, థైరాయిడ్ సమస్య ఉన్నవారికి, ఎముకలు వీక్ గా ఉన్నవారికి ఉపయోగపడుతుంది. క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా ఈ సెలీనియం మనల్ని కాపాడుతుంది.
  • రోజు సాల్మన్ తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్తంలో ఉండే ఒమేగా 3 ఆమ్లాలను ఈ సాల్మన్ చేప పెంచుతుంది. ఈ ఒమేగా ఆమ్లా తక్కువగా ఉండే గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంది.
  • సాల్మన్ చేపలో కొవ్వ పదార్ధాలు ఉండవు, ప్రొటీన్స్ ఉంటాయి. కాబట్టి సాల్మన్ చేపలను తినడం వల్ల బరువు పెరగరు. అందులో ఉండే ప్రొటీన్స్ ఆకలిని పెంచే హార్మోన్స్ ను నియంత్రిస్తుంది.

సాల్మన్ ఫిష్ దుష్ప్రభావాలు

  • సాల్మన్ సముద్రచేప కావడం వల్ల సముద్రంలో విడుదలైన రసాయానాలను సాల్మన్ చేప తినే అవకాశం ఉంది
  • సాల్మన్ చేపలో ఉండే పాదరసం మన బాడీలోకి వెళ్లి అనారోగ్యానికి దారి తీస్తుంది
  • సాల్మన్ చేపలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కొన్ని సందర్భాల్లో ఎక్కువగా రక్తాన్ని శుద్ధి చేయడం వల్ల రక్తం మరింత పల్చనబడి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు