Health Benefits Of Lemon: నిమ్మకాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు

Health Benefits Of lemon: నిమ్మకాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. పులుపులో నిమ్మకాయకు మించినది లేదు. ఆయుర్వదంలో కూడా నిమ్మకాయుకు ప్రముఖమైన స్థానం ఉంది. నిమ్మకాయ హెల్త్ కు ఏవిధంగా మంచిది, వీటివల్ల కలిగే దుష్ఫ్రయోజనాల గురించి కూడా ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

benefits-side-effects-and-side-effects-of-lemon
Source: budwigcenter.com

నిమ్మకాయ చెట్టు 6 మీటర్ల ఎత్తువరకు పెరుగుతుుంది. వీటి కొతమ్మలకు ముళ్లు ఉంటయి. వీటి ఆకులు కూడా ఎరుపు రంగులో ఉంటాయి. నిమ్మకాయ పువ్వులు లేత ఆకుపచ్చ రంగులో తెల్లగా ఉంటాయి. నిమ్మకాయ ఆకు పచ్చగా పెరుగుతుంది, అది బాగా పండినప్పుగే పసుపు పచ్చ రంగులోకి మారుతుంది. నిమ్మకాయలని ఎక్కువగా మెక్సికో, మొరాకో, జపాన్, గ్రీస్, అల్జీరియా, ఆఫ్రికా, ఈజిప్టు దేశాల్లో ఎక్కువగా పండిస్తారు.

మీకు తెలుసా?

100 గ్రాముల నిమ్మకాయలో 89గ్రాముల నీరు ఉంటుంది. మిగతా 11 గ్రాముల్లో 9 గ్రాములు కార్బొహైడ్రేట్, 2.8 గ్రాముల ఫైబర్, 1 గ్రాము ప్రొటీన్, 0.3 గ్రాముల కొవ్వు, 53 గ్రాముల విటమిన్ సి, 29 కిలో కేటరీల శక్తి ఉంటుంది. చిన్ని నిమ్మకాయలో ఇన్ని పోషకవిలువలు ఉండడం అద్భతం కదా!

నిమ్మకాయతో ఆరోగ్య ప్రయోజనాలు

  • నిమ్మకాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను ఇది అందిస్తుంది. విటమిన్ సి లోపం వల్ల సంభవించే స్కర్వీ రోగాన్ని కూడా ఇది రాకుండా చేస్తుంది.
  • రోజూ నిమ్మరసంలో కొంత తేనె వేసుకొని తాగితే బరువు ఈజీగా తగ్గిపోతారు.
  • నిమ్మకాయలో యాంటీబయోటిక్ పదార్ధాలు ఉంటాయి. కాబట్టి నిమ్మకాయ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జలుబు, దగ్గుకు కూడా నిమ్మకాయ బాగా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా నిమ్మకాయ దోహదపడుతుంది.
  • నిమ్మకాయలో యాంటీ యాక్సిడెంట్లు ఉండడం చేత, దీన్ని రసాన్ని జుట్టుకు పట్టితే తలలో ఉన్న బ్యాక్టీరియా, చుండ్రు తొలగిపోతాయి. చర్మం పై నిమ్మకాయ రాసుకుంటే కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
  • ముత్రపిండాల్లోని రాళ్లను కరిగించే సామర్ధ్యం నిమ్మకాయలకు ఉంటుంది. ఓ పరిశోధనల్లో.. మూత్రపిండాళ్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారికి 44 నెలల వరకు రోజూ నిమ్మరసాన్ని అందించారు. నిమ్మరసం తీసుకున్న వారి మూత్రపిండాల్లో రాళ్లు గణనీయంగా తగ్గి ఆరోగ్యవంతులుగా మారారు.

నిమ్మకాయ వల్ల కలిగే దుష్ఫ్రయోజనాలు

  • నిమ్మరసాన్ని నేరుగా చర్మం పై రాస్తే మంట వచ్చే ప్రమాదం ఉంది. కొందరి చర్మానికి నిమ్మకాయ పడదు. చర్మానికి నిమ్మరసాన్ని రాసే ముందు నీటితో శుభ్రం చేసుకోవాలి లేదా కొబ్బరి నూనె రాయాలి
  • నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ కు.. దంతాలను కూడా కరిగించే సామర్ద్య ఉంటుంది. కాబట్టి నిమ్మకాయలను రెగ్యులర్ గా తీసుకుంటే దంతాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
  • నిమ్మరసం లో యాసిడ్ పదార్ధం ఉండడం చేత అసిడిటీకి కూడా దారితీయవచ్చని అధ్యయనంలో తేలింది. కాబట్టి ఏదైనా సరే.. మితంగా తీసుకుంటేనే మంచిది.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు