Cinnamon Health Benefits: దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు

Cinnamon Health Benefits: దాల్చిన చెక్క లేని భారతీయ వంటగది ఉండదు. పోప్ వేయడంలో దాల్చిన చెక్క ఖచ్చితంగా ఉండాల్సిందే. బిర్యానీ చేసేటప్పుడు సైతం దాల్చిన చెక్క ఉండాల్సిందే లేదంటే మొత్తం రుచిలో తేడా వచ్చేస్తుంది. దాల్చిన చెక్కను అలాగే తింటే కొంత తీపి ఘాటు కలిసినట్టుగా ఉంటుంది. సుగంధ వాసనను కూడా దాల్చిన చెక్క విడుదల చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా దాల్చిన చెక్కకు ప్రముఖమైన స్థానం ఉంది. దాల్చిన చెక్క గురించి మరిన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం

benefits-uses-and-side-effects-of-cinnamon
Source: cdn.cnn.com

దాల్చిన చెక్క గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

దాల్చిన చెక్కను 2500 బీసీ నుంచే వినియోగిస్తున్నారు. దాల్చిన చెక్క వాడకం గురించి బైబిల్ లో కూడా వివరించడం జరిగింది. ఈజిప్టుల్లో మమ్మీలను భ్రపరిచే క్రమంలో ఎన్నో రసాయనాలను డెడ్ బాడీలకు పూస్తారు. వాటిలో దాల్చిన చెక్క కూడా ఒకటి. రోమ్ లో దాల్చిన చెక్కను మరణించిన తర్వాత బాడీని కాల్చడానికి ఉపయోగించేవారు. వాస్కోడిగామా, క్రిస్టొఫర్ కొలంబస్ దాల్చిన చెక్క కోసం చాలా దూరం ప్రయాణించారు.

దాల్చిన చెక్కతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

  • కడుపులో ఏదైనా సమస్య ఉంటేదాల్చిన చెక్క వెంటనే తగ్గిస్తుంది. కడుపులో నొప్పి ఉన్నా, ఉబ్బరంగా ఉన్నా లేదా మలబద్దకం సమస్య అయినా దాల్చిన చెక్కతో వెంటనే తొలగిపోతుంది.
  • మధుమేహంతో బాధపడేవారికి దాల్చిన చెక్క ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పటు, ఇన్సులిన్ సెన్సిటివిటీను కూడా పెంచుతుంది.
  • దాల్చిన చెక్కలో కొవ్వు పదార్ధం ఉండదు. బాడీలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ధమనులలో కొవ్వు గడ్డలు ఏర్పడకుండా చేస్తుంది. ఇలా దాల్చిన చెక్క గుండెకు అనేక రకాలుగా మేలు చేస్తుంది.
  • దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఫేస్ ప్యాక్ లా ఉపయోగిస్తే, చర్మంపై ఉన్న మొటిమలు తొలగిపోతాయి.
  • దాల్చినచెక్క 420 మిల్లీ గ్రాముల రసాన్ని మహిళలు రోజుకు మూడు సార్లు నీలళ్లో కలిపి తీసుకుంటే వారిలో బహిష్టు సమస్యలు, తిమ్మిరి, రక్తస్రావం, వికారం, వాంతులు లాంటివి రాకుండా ఉంటాయి.

దాల్చిన చెక్క దుష్ప్రభావాలు

  • దాల్చిన చెక్కలో ఘాటు వేడి పదార్ధం ఉంటుంది. కాబట్టి దాల్చిన చెక్కను ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంట పెరిగే అవకాశముంది
  • దాల్చిన చెక్కలో ఉండే “సిన్నమల్డిహైడ్” నోటిలో పుండ్లను పుట్టిస్తుందని పరిశోధనల్లో తేలింది. వంశపారంపర్యంగా కూడా కొందరికి దాల్చిన చెక్క వంటికి పడదు.
  • దల్చిన చెక్క రక్తాన్ని పలచబరుస్తుంది. కాబట్టి మీరు శస్త్ర చికిత్స చేయించుకుంటే దాల్చిన  చెక్కను వాడే ముందు డాక్టరు సలహాను తీసుకోవడం చాలా మంచిది.
  • దాల్చిన చెక్కను లేపనంగా వాడాలనుకునే ముందు పాచ్ పరీక్షను ఖచ్చితంగా చేసుకోవాలి.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు