Benefits Of Almonds: బాదంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు దుష్ప్రభావాలు

Benefits Of Almonds: డ్రైఫ్రూట్స్ లో బాదం కింగ్ లాంటిదని చెప్పుకోవచ్చు. రోజూ 4 బాదం పప్పులను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి కొనాలంటే కూడా చాలా ఖరీదు. కేవలం 100 గ్రాములే వందల రూపాయలు ఉంటుంది. బాదంలో ఎన్నో పోషకాలు, ఖనిజాలు ఉన్నాయి. ఆయుర్వదంలో కూడా బాదంకు ప్రముఖమైన స్థానం ఉంది. ప్రపంచంలో బాదం ఎక్కువగా అమెరికా, స్పెయిన్, ఇరాన్ దేశాల్లో పండుతాయి. భారత్ లో కేవలం జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో మాత్రమే బాదం పప్పులను పండిస్తారు.బాదం గురించిన మరిన్ని విశేషాలను మనం తెలుసుకుందాం

almond-benefits-and-side-effects
Source: www.prameyanews.com

ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న బాదంలో 70 శాతం అమెరికాలో పండుతుంది. దాంట్లో 25 శాతం కంటే ఎక్కువ కాలిఫోర్నియాలో పెరుగుతాయి.

100 గ్రాముల బాదంలో ఉండే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు

  • శక్తి – 571 కి.కేలరీలు
  • ప్రొటీన్ – 21.43 గ్రా
  • కార్బొహైడ్రేట్ – 21.43గ్రా
  • ఫైబర్ – 10.7 గ్రా
  • కొవ్వు – 50 గ్రా
  • కాల్షియం – 286 మి.గ్రా
  • ఇనుము – 3.86 మి.గ్రా
  • మెగ్నీషియం – 286 మి.గ్రా
  • ఫాస్ఫరస్ – 536 మిగ్రా
  • పొటాషియం – 714 మిగ్రా
  • కాపర్ – 1.07 మిగ్రా
  • మాంగనీస్ – 2 మిగ్రా
  • విటమిన్ బి2 – 0.911 మిగ్రా
  • సంతృప్త కొవ్వు ఆమ్లాలు – 3.57 గ్రా
  • మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు – 32.14 గ్రా
  • బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు – 12.5 గ్రా

బాదం ఆరోగ్య ప్రయోజనాలు

  • బాదం మెదడును మరింత పదునెక్కిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచడంలో దోహదం చేస్తుంది. పార్కన్సన్స్, అల్జీమర్స్ లాంటి మెదడు సంబంధిత వ్యాధులను నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
  • రోజూ బాదం పప్పులను కొంత మొతాదులో తీసుకుంటే బరువు తగ్గడంలో దోహదం చేస్తుంది. నడుము చుట్టు ఉన్న కొవ్వను కరిగించేస్తుంది.
  • బాదం పప్పులను రోజూ తీసుకునే వారు రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, పురీష క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్ లాంటి క్యాన్సర్ల బారి నుండి బయటపడే ప్రమాదం ఉంది.
  • బాదంలో యాంటీ ఇన్ ప్లమేటరీ లక్షణాలు ఉంటయి. ఇవి ఆర్తరైటిస్ రాకుండా మీకు దోహదపడతాయి. 12 రోజుల వరకు బాదం ను తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ రోగులకు సంబంధించిన ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది.

బాదం దుష్ప్రభావాలు

  • బాదంను ఎక్కువగా తినవద్దు. ఎక్కువగా తింటే.. అది మలబద్దకం, కడుపు నొప్పి, కడుపు మంటకు దారి తీయవచ్చు.
  • మీకు రోజు 15 మిల్లీగ్రాముల విటమిన్ ఇ మాత్రమే అవసరమవుతుంది. ఒక వేల మీరు 100 గ్రాముల బాదంను తీసుకుంటే.. అందులో 25 మిగ్రా విటమిన్ ఇ ఉంటుంది. ఇది మీ బాడీలో అతిసారం, తలతిరగడం లాంటివి కలిగించవచ్చు.
  • బాదం పప్పులో ఆక్సలేట్ సమృద్ధిగా ఉంటుంది. ఈ ఆక్సలేట్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతుంది. మూత్ర పిండాల సమస్యతో బాధపడేవారు బాదం పప్పులను తీసుకోకపోవడమే ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు