Stand Up Rahul Movie Review: స్టాండ్ అప్ రాహుల్ మూవీ రివ్యూ

Stand Up Rahul Movie Review: ఉయ్యాల జంపాల మూవీతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన రాజతరుణ్ స్టాండ్ అప్ రాహుల్ సినిమాతో మనముందుకు వచ్చాడు. ఈ మూవీ ఈ రోజు మార్చ్ 18న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ట్రైలర్ కు వచ్చిన మంచి రెస్పాన్సే సినిమా చూసిన తర్వాత కూడా వచ్చింది. మొత్తం కుటుంబం కలిసి చూసి కడుపుబ్బా నవ్వుకునే సినిమా స్టాండ్ అప్ రాహుల్ అని క్రిటిక్స్ సైతం ఈ మూవీకి పాజిటివ్ పాయింట్స్ ఇస్తున్నారు.

Stand Up Rahul Movie Review

కథ

కథ విషయానికి వస్తే.. స్టాండ్ అప్ రాహుల్ ఒక కంప్లీట్ కామెడీ డ్రామా మూవీ. రాహుల్ పాత్రలో రాజ్ తరుణ్ హీరోయిన్ గా వర్ష బొల్లమ్మ నటించింది. రాహుల్ లైఫ్ లో ఇంకా సెటిల్ కాడు, సక్సస్ ఫుల్ స్టాండ్ అప్ కమెడియన్ కావాలనుకుంటాడు.. ఇక హీరోయిన్ పాత్రలో ఉన్న వర్ష విఆర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తుంది. వీరిద్దరూ కలిసి ప్రేమించుకొని పెళ్లి చేసుకునే దాకా వెళ్తారు. అయితే కథ మొత్తం ఇక్కడే అడ్డం తిరుగుతుంది. సెటిల్ కాని రాహుల్ లైఫ్, లవ్ ఎలా ఉంటుందనేదే ఈ చిత్రం మెయిన్ కాన్సెప్ట్.

తారాగణం

సాంటో ఈ మూవీని రచించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిశోర్, ప్రధాన పాత్రల్లో నటించారు. మురళి శర్మ, ఇంద్రజ, దేవి ప్రసాద్, మధురిమ నర్ల, రాజ్ కుమార్ కసిరెడ్డి, తెజోయ్ భట్టరు, వెంకటేశ్ మహ, అనిష అల్ల రెడ్డి సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి కలిసి ఈ మూవీని డ్రీం టౌన్ ప్రొడక్షన్స్, హైవైవ్ పిక్చర్స్ బ్యానర్స్ పై నిర్మించారు. స్వీకార్ అగస్తి సంగీతాన్ని సమకూర్చగా, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.

సినిమా పేరుస్టాండ్ అప్ రాహుల్
దర్శకుడుసాంటో
నటీనటులురాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిశోర్, మురళి శర్మ, ఇంద్రజ, దేవి ప్రసాద్, మధురిమ నర్ల, రాజ్ కుమార్ కసిరెడ్డి, తెజోయ్ భట్టరు, వెంకటేశ్ మహ, అనిష అల్ల రెడ్డి
నిర్మాతలునందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి
సంగీతంస్వీకార్ అగస్తి
సినిమాటోగ్రఫీశ్రీరాజ్ రవీంద్రన్

 

సినిమా ఎలా ఉందంటే?

మొత్తం కుటుంబం కలిసి చూసి కడుపుబ్బా నవ్వుకునే సినిమా స్టాండ్ అప్ రాహుల్. ఉయ్యాల జంపాల్ తరువాత అంతగా అలరించిన రాజ్ తరుణ్ మూవీ ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. కామెడీ అంతగా పండకపోయినప్పటికీ డైలాగ్స్, స్క్రిప్ట్, డైరెక్షన్ బాగున్నాయి. రాజ్ తరుణ్ కు ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో పాటు మళ్లీ తిరిగి మంచి పేరును సంపాదించి పెడుతుంది.

మూవీ రేటింగ్ : 3.5 / 5

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు