Mishan Impossible Telugu Movie Review: మిషన్ ఇంపాసిబుల్ తెలుగు మూవీ రివ్యూ

Mishan Impossible Telugu Movie Review: మొదటి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తో మంచి విజయం అందుకున్న దర్శకుడు స్వరూప్ RSJ తదుపరి సినిమా కోసం చాల కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే తన మొదటి సినిమా లాగే చాలా కొత్త రకమైన కథ తో మిషన్ ఇంపాసిబుల్ సినిమా తిసాడు . ఈ ట్రైలర్ అయినప్పట్నుంచి సినిమా మిద ఆసక్తి రేకెత్తించింది, ఆర్ ఆర్ ఆర్ విజృంభన ఆగకముందే ఈ మిషన్ ఇంపాసిబుల్ సినిమా ఈరోజు థియేటర్ లో అంటే ఏప్రిల్ 1, 2022 న విడుదలైంది. అయితే ఈ సినేమా కి ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన వస్తుండడంతో సినిమా నిర్మాతలు మరియు దర్శకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మిషన్ ఇంపాసిబుల్ మూవీ గురించి డిటైల్డ్ గా ఈ రివ్యూ లో తెల్సుకుందాం.

Mishan Impossible Telugu Movie Review

 

కథ

తాప్సి ఒక న్యూస్ రిపోర్టర్, తాను భారత దేశం లోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని ఎలాగైనా పట్టుకోవాలని, ఒక ముగ్గురు టీనెజర్స్ తో కలిసి ఒక మిషన్ మొదలుపెడుతుంది. చివరగా తను మిషన్ విజయవంతం అయ్యిందా మరియు ఆ ముగ్గురు టీనెజర్స్ కి తనకి సంబంధం ఏంటి అనేది మిగతా కథ

మిషన్ ఇంపాసిబుల్ మూవీ నటీనటులు

తాప్సి ప్రధాన పాత్ర పోషించగా హర్ష రోషన్ , భాను ప్రకాషన్ మరియు జయాతీర్థ ములుగు ముఖ్య పాత్రలు పోషించారు. స్వరూప్ RSJ దర్శకత్వం వహించగా, దీపక్ ఎరగరా ఛాయాగ్రహణం చేసారు , మార్క్ కే రాబిన్ సంగీతం అందించారు మరియు మాట్ని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మిచారు.

సినిమా పేరుమిషన్ ఇంపాసిబుల్
దర్శకుడుస్వరూప్ RSJ
నటీనటులుతాప్సి, హర్ష రోషన్ , భాను ప్రకాషన్ మరియు జయాతీర్థ ములుగు
నిర్మాతలు నిరంజన్ రెడ్డి
సంగీతంమార్క్ కే రాబిన్
సినిమాటోగ్రఫీదీపక్ ఎరగరా
ఓటీటీ రిలీజ్ డేట్జూన్ 2022
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ఇంకా నిర్ధారించలేదు

మిషన్ ఇంపాసిబుల్ సినిమా ఎలా ఉందంటే?

మిషన్ ఇంపాసిబుల్ ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ మూవీ అని చెప్పుకోవొచ్చు . దానికి చాల కారణాలు ఉన్నాయ్. మూవీ లో పేరున్న తారాగణం లేకపోయినా మూవీ ఎందుకు బాగుంది అంటే, కథ, బలమైన కథ ఉంటె పేరున్న తారాగణం అవసరం లేదు అని ఈ సినిమా నిరూపించింది.
దర్శకుడు స్వరూప్ RSJ తన మొదటి సినిమా లాగే ఈ మూవీ లో కూడా కామెడీ కి పెద్ద పీఠ వేసాడు , సినిమా కథ సీరియస్ అయినప్పటికీ తాను కామెడీ తోనే కథను చెప్పిన విధానం ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది, భవిష్యత్తు లో ఇలాంటి మరిన్ని మంచి చిత్రాలు తీయాలని ఆశిద్దాం.

ముగ్గురు టీనెజర్స్ చాలా బాగా నటించారు , అతి ముఖ్యమైన సన్నివేశాల్లో కూడా ఎక్కడ తడబడకుండా చాలా బాగా నటించారు , తాప్సి కి ఈ మూవీ తో చక్కటి కం బ్యాక్ అనొచ్చు , మిగతా సాంకేతిక నిపుణులు కూడా తమ పరిధి మేరకు బాగా చేసారు .

చివరగా మిషన్ ఇంపాసిబుల్ తప్పక చూడవలసిన చిత్రం.

సినిమా రేటింగ్: 2.5/5

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు