KGF 2 Telugu Movie Review: కే జి యఫ్ 2 తెలుగు మూవీ రివ్యూ

KGF 2 Telugu Movie Review: కే జి యఫ్ 2 ప్రపంచ వ్యాప్తంగా ఎదురుగా చూస్తున్న సినిమా.కే జి యఫ్ 1 అంతగా అంచనాలు లేకుండా రిలీజ్ అయి ఎంత సంచనాలు సృష్టించిందో మనందరికీ తెల్సిందే, కొన్ని సంవత్సరాల క్రితం కన్నడ ఇండస్ట్రీ అంటే ఒక చిన్నచూపు ఉండేది, ఎందుకంటే కన్నడలో అన్ని తక్కువ ఖర్చుతో, క్వాలిటీ లేకుండా సినిమాలు తీస్తారు అని, కానీ కే జి యఫ్ కన్నడ ఇండస్ట్రీ ని పూర్తిగా మార్చేసింది. కన్నడ ఇండస్ట్రీ కూడా పెద్ద బడ్జెట్ తో తీయగలదు అని కే జి యఫ్ నిరూపించింది. అయితే కే జి యఫ్ 2 అన్ని అంచనాల మధ్య ఈరోజు అంటే ఏప్రిల్ 14 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లో రిలీజ్ అయ్యి సంచలనం సృష్టిస్తుంది.ప్రేక్షకులు థియేటర్ లో చూపు తిప్పుకోకుండా చూస్తున్నారని తెలుస్తుంది, అయితే కే జి యఫ్ 2 ఏ మేరకు అంచనాలను అందుకుంది , ఈ మూవీ చూడదగినదా కాదా ఈ రివ్యూ లో తెల్సుకుందాం.

KGF 2 Telugu Movie Review

కథ

కే జి యఫ్ 2 కథ కే జి యఫ్ 1 ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుండి మొదలవుతుంది, అయితే గరుడని చంపినా తరువాత రాకి భాయ్(యష్ )మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిపోతాడు,అయితే భారతదేశపు ప్రధాన మంత్రి రమిక సేన్ (రవీనా టండన్ ) కే జి యఫ్ ని తన గుప్పెట్లో పెట్టుకున్న అధీరా(సంజయ్ దత్)మిద యుద్ధం ప్రకటిస్తుంది, ఇంతలో రమిక సేన్ కి అధీరా భలం ఏంటో, అతని సైన్యం ఏంటో తెలుస్తుంది, అప్పుడే అధీరా ని ఎదిరించడానికి ఒక ధైర్యవంతుడు కావాలని రాకీ భాయ్ ని రంగం లోకి దింపుతుంది, చివరగా రాకీ భాయ్ అధీరా ని ఎలా ఎదిరించాడు అనేది మిగతా కథ.

కే జి యఫ్ 2 మూవీ నటీనటులు

యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరి రావ్ మరియు తదితరులు నటించగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు, భువన్ గౌడ ఛాయాగ్రహణం అందించగా, రవి బసూర్ సంగీతాన్ని సమకూర్చారు, విజయ్ కిరాగండూర్ ఈ చిత్రాన్ని హోంబాలే బ్యానర్ పైన నిర్మించారు.

సినిమా పేరుకే జి యఫ్ 2
దర్శకుడుప్రశాంత్ నీల్
నటీనటులుయష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరి రావ్ మరియు తదితరులు
నిర్మాతలువిజయ్ కిరాగండూర్
సంగీతంరవి బసూర్
సినిమాటోగ్రఫీభువన్ గౌడ

కే జి యఫ్ 2 సినిమా ఎలా ఉందంటే?

కే జి యఫ్ 2 కథ ఎలా ఉన్న సరే, కే జి యఫ్ 2 ని ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన చిత్రం, ఎందుకంటే భారతదేశపు సినీ చరిత్ర లొ మునుపెన్నడూ చూడలేనటువంటి, సన్నివేశాలు, కళ్ళు మిరుమిట్లు కొలిపే పతాక సన్నివేశాలు, సౌండ్ డిజైన్ ఇలా చాల వాటికోసం కే జి యఫ్ 2 పక్కా చూడాల్సిన చిత్రం.
ఇక కే జి యఫ్ 2 గురించి మాట్లాడుకుంటే కే జి యఫ్ 1 కన్న చాలా రేట్లు బెటర్ ఈ కే జి యఫ్ 2 ఎందుకంటే కథ, కే జి యఫ్ 1 లొ హీరో మీదనే ఎక్కువ దృష్టి పెట్టిన ప్రశాంత్ నీల్, ఈ కే జి యఫ్ 2 లో వాటన్నిటితో పాటు కథ మీద కూడా దృష్టి పెట్టాడు.ప్రతి పాత్రని అద్భుతంగా రాస్కున్నాడని చెప్పొచ్చు. కే జి యఫ్ 2 లో ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ కథనాన్ని మరో మెట్టు ఎక్కించారు అనడం లో సందేహం లేదు.
యష్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెరమీద తెలుస్తుంది, ఒక పెద్ద హీరో ఒకే మూవీ మీద దాదాపు 4 సంవత్సరాలు ఉండడం అనేది మాములు విషయం కాదు, అయితే రాకీ భాయ్ గ యష్ తప్ప ఇంకెవరు చేయలేరు అన్నంత అద్భుతంగా నటించాడు, అధీరా గా సంజయ్ దత్ అయితే ఖచ్చితంగా భయపెడతాడు అనడంలో సందేహం లేదు, పాత్ర కోసం తనని తాను మార్చుకున్న తీరు చాల బాగుంది, రమిక సేన్ గా రవీనా టండన్ బాగానే చేసింది, ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ ఉన్నదీ కాసేపే అయినా కథకి వాళ్ళ పాత్రలు వెన్నెముకగా నిలిచాయి.

ఒక దర్శకుడి ఐడియా ని నమ్మి ఇంత ఖర్చు చేయడం అనేది మాములు విషయం కాదు, కె జి యఫ్ లాంటి ప్రపంచాన్ని సృష్టించడం అనేది అంత తేలికైన విషయం కాదు, ప్రశాంత్ నీల్ ఇంతటి ప్రపంచాన్ని సృష్టించి అద్భుతమైన పాత్రలతో, అద్భుతమైన కథని చెప్పడం లో విజయవంతం అయ్యాడు.
కె జి యఫ్ 2 కి అయినా కె జి యఫ్ 1 కి అయినా ఛాయాగ్రహణం అందించిన భువన్ గౌడ మరియు సంగీతం అందించిన రవి బసూర్ లేకపోతే కె జి యఫ్ అనేది ఇలా ఉండేది కాదు.
చివరగా కె జి యఫ్ 2 థియేటర్ లో ఒక సినిమాటిక్ ఎక్సపీరియన్స్ కోసం తప్పకుండ చూడవల్సిన చిత్రం.

సినిమా రేటింగ్: 3/5

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు