Rama Rao On Duty Movie Review: రామారావు ఆన్ డ్యూటీ తెలుగు మూవీ రివ్యూ

Rama Rao On Duty Movie Review: మాస్ మహారాజా యొక్క లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది, అయితే ఈ చిత్రం కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తుంది అందుకు ఈ చిత్రం ట్రైలర్ ఒక కారణం మరియు ఈసారి రవితేజ కొంచెం కొత్తగా ప్రయత్నించినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల నుండి కూడా మంచి రివ్యూస్ పొందుతోంది, అయినప్పటికీ, ఎటువంటి ఆలస్యం చేయకుండా లోతైన సమీక్షలోకి ప్రవేశిద్దాం మరియు చిత్రం చూడదగినదా కాదా అని తెలుసుకుందాం.

Rama Rao On Duty Movie Review

కథ

రామారావు ఆన్ డ్యూటీ 1995లో ప్రారంభం అవుతుంది అక్కడ రామారావు (రవితేజ) సబ్ కలెక్టర్‌గా పనిచేస్తుంటాడు, వ్యవస్థ యొక్క చట్టాలకుకట్టుబడి అతను న్యాయం కోసం తన బాధ్యతను నిర్వర్తిస్తాడు, అయినప్పటికీ, కొన్ని కారణాల వల్ల, అతను పదవిని కోల్పోయి తహశీల్దార్‌గా తన సొంత గ్రామానికి ట్రాన్సఫర్ అవుతాడు, అక్కడ కొంత మంది ఉరి ప్రజలు తప్పిపోయారని తెలుసుకున్న రామారావు ఈ మిస్సింగ్ కేసు వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి నిర్ణయించుకుంటాడు ఆ తర్వాత రామ రావు కి ఏదురైనా సమస్యలు ఏంటి అనేది మిగతా కథ.

రామారావు ఆన్ డ్యూటీ మూవీ నటీనటులు

రవితేజ, దివ్యషా కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పత్త’ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధు సూదన్ రావు, సురేఖ వాణి తదితరులు నటించగా శరత్ మండవ దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, సంగీతం: సామ్ C S మరియు ఈ చిత్రాన్ని RT టీమ్‌వర్క్స్‌తో కలిసి SLV సినిమాస్ LLP బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

సినిమా పేరురామారావు ఆన్ డ్యూటీ
దర్శకుడుశరత్ మండవ
నటీనటులురవితేజ, దివ్యషా కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పత్త’ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధు సూదన్ రావు, సురేఖ వాణి
నిర్మాతలుసుధాకర్ చెరుకూరి
సంగీతంసామ్ C S
సినిమాటోగ్రఫీసత్యన్ సూర్యన్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఎలా ఉందంటే?

నిజం చెప్పాలంటే, రామారావు ఆన్ డ్యూటీ అనేది రవితేజ సినిమా కాదు, మాస్ మసాలా కమర్షియల్ చిత్రాలలో తన మార్క్ కామెడీతో నటించడం chusina ప్రేక్షకులకి ఈ చిత్రం ఒక కొత్త రవి తేజ ని చూపిస్తుంది,ఈ విషయం లో చిత్ర దర్శకుడు శరత్ మండవను మనం అభినందించాలి మరియురవితేజతో ఈ కథను చేసినందుకు.

హీరో ప్రపంచాన్ని పరిచయం చేస్తూ సినిమా బాగా మొదలవుతుంది, అలాగే దర్శకుడు మొదటి నుండి సినిమా యొక్క కోర్ పాయింట్‌ను పరిచయం చేశాడు, ఇది oka విధంగా ప్రేక్షకుడికి కథతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది, ఫస్ట్ హాఫ్‌లో ఉరి ప్రజలు మిస్ అయిన తర్వాత. సినిమా అంతటా ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉండటంతో సినిమా ఆసక్తికరంగా మారుతుంది.

ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగా పనిచేసింది, ఇది తరువాత సగం చూడాలనే ఉత్సుకతను కలిగిస్తుంది, అయితే, వచ్చిన సమస్య అల్లా అనవసరమైన పాటలు మేకర్స్ బలవంతంగా వీటిని ఇరికించారని స్పష్టంగా తెలుస్తుంది సెకండాఫ్ చాలా మలుపులు మరియు ట్విస్ట్‌లతో పేసీ స్క్రీన్‌ప్లేతో సాగి మంచి ఉత్సుకతని రేకేత్రిస్తుంది, అయితే క్లైమాక్స్ ఇంకా బాగా ఉండాల్సింది.

శరత్ మండవ అద్భుతమైన రచన తో ఈ చిత్రాన్ని చాల బాగా ఎగ్జిక్యూట్ చేశాడు, అతను భావోద్వేగాలను తెర మీద చాల బాగా చూపించాడు, మరియు మొదటి నుండి చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేయడంలో అతను విజయం సాధించాడు.

ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమాలు చేయడానికి ఎప్పుడూ ఆసక్తిని కనబరుస్తూ రవితేజ ఈ చిత్రాన్ని అంగీకరించినందుకు అభినందించాలి ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ రెగ్యులర్ సినిమాల మాదిరిగా కాకుండా ఉంటాయి మరియు రామారావుగా రవితేజ అద్భుతంగా నటించాడు మరియు అతను లుక్, కాస్ట్యూమ్స్ మరియు బాడీ లాంగ్వేజ్ మొత్తం పాత్రకి అనుగుణంగా మారి ఆ యొక్క పాత్రకి న్యాయం చేసాడు, ఇక మలయాళీ నటి రజిషా విజయన్ తన పాత్ర మేరకు బాగానే చేసింది మరియు దివ్యషా కౌశిక్ ఆమెకు స్కోప్ లేదు. అయితే చిరు నవ్వుతో, కళ్యాణ రాముడు, హనుమాన్ జంక్షన్ వంటి అధిభూతమైన కామెడీ తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి, చాలా సంవత్సరాల తర్వాత ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా రే ఎంట్రీ ఇచ్చాడు, మరియు అతను పాత్రలో చాల బాగా చేసాడు, మరియు మిగిలిన నటీనటులు వారి వారి పాత్రలలో బాగా చేసారు. .

టెక్నికల్‌గా రామారావు ఆన్ డ్యూటీ టాప్ నాచ్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, అతను విలేజ్‌లో ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలన్నీ బాగా తీశాడు మరియు సామ్ సిఎస్ పాటలు అంతగా గొప్పగా ఎం లేవు, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో తన మార్క్ చూపించాడు మరియు పీటర్ హెయిన్, స్టన్ శివ అద్భుతమైన యాక్షన్ బ్లాక్‌లని కంపోజ్ చేశారు రవితేజ అభిమానులకు విజువల్ ఫీస్ట్ మరియు మిగిలిన సాంకేతిక విభాగాలు సినిమాకు అవసరమైన విధంగా బాగా చేసాయి.

చివరగా, రామారావు ఆన్ డ్యూటీ ఒక ఆకర్షణీయమైన యాక్షన్ థ్రిల్లర్, దీనిని ప్రతి వర్గాల ప్రేక్షకులు వీక్షించవచ్చు.

సినిమా రేటింగ్: 3.75/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు