Aakasa Veedhullo Movie Review: ఆకాశ వీధుల్లో మూవీ రివ్యూ

Aakasa Veedhullo Movie Review: యంగ్ టీమ్ ‘ఆకాశ వీధుల్లో’ అనే ఇంటెన్స్ లవ్ స్టోరీని రూపొందించింది, టీజర్ నుండి ట్రైలర్ వరకు అందరి దృష్టిని ఆకర్షించింది, అయితే, ఆకాశ వీధుల్లో గౌతమ్ కృష్ణ నటించి మరియు దర్శకత్వం వహించాడు, ఈ చిత్రం ఈ రోజు సెప్టెంబర్ 02, 2022 న విడుదల అయ్యి చాలా సానుకూల స్పందనను పొందుతోంది ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా, లోతైన సమీక్షలోకి వెళ్లి చిత్రం చూడదగినదా కాదా తెలుసుకుందాం.

Aakasa Veedhullo Movie Review

కథ

సిద్ధు (గౌతమ్ కృష్ణ) ప్రేమ విఫలం అయ్యి బాధపడుతూ ఉంటాడు చివరికి పెద్ద రాక్స్టార్ అవుతాడు, అయినప్పటికీ, మద్యపానం మరియు మాదకద్రవ్యాలకు బానిస అవ్వడం వల్ల ధర్మ మ్యూజిక్ ప్రొడక్షన్ వారు ఇకపై వారితో సంబంధం లేదని ప్రకటించడంతో అతని జీవితం తలకిందులవుతుంది, అతను ఈ సమస్యలన్నింటిని ఎలా ఎదుర్కొంటాడు అనేధీ మిగతా కథ.

ఆకాశ వీధుల్లో మూవీ నటీనటులు

గౌతం కృష్ణ, పూజిత పూన్నాడ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి గౌతమ్ కృష్ణ దర్శకత్వం చేయగా, సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి, సంగీతం: జూడా సంధ్య మరియు నిర్మాతలు మనోజ్ జె.డి., డా.జె.మణికంఠ GK ఫిల్మ్ ఫ్యాక్టరీ మరియు మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుఆకాశ వీధుల్లో
దర్శకుడుగౌతమ్ కృష్ణ
నటీనటులుగౌతం కృష్ణ, పూజిత పూన్నాడ
నిర్మాతలుమనోజ్ జె.డి., డా.జె.మణికంఠ
సంగీతంజూడా సంధ్య
సినిమాటోగ్రఫీవిశ్వనాథ్ రెడ్డి
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

ఆకాశ వీధుల్లో సినిమా ఎలా ఉందంటే?

కథానాయకుడు లవ్ ఫెయిల్యూర్‌తో డిప్రెషన్‌లో పడిపోవడం, తర్వాత కెరీర్‌పై దృష్టి పెట్టడం వంటి ఈ మూసతో ఎన్నో సినిమాలు చూశాం, ఆకాశ వీధుల్లో కూడా ఇదే కోవలోకి వస్తుంది,మొదటి నుంచి చివరి వరకు ఎప్పుడో chusina సన్నివేశాలతో ఊహించదగిన సన్నివేశాలు మరియు పేలవమైన ప్రదర్శనలతో మొదటి సగం ముగుస్తుంది.

కొన్ని ప్రేమ సన్నివేశాలు మరియు ప్రయాణ సన్నివేశాలు కొత్తగా లేకపోయినా, ఆ సన్నివేశాలు మిమ్మల్ని కాసేపు నిమగ్నం చేస్తాయి ఎందుకంటే ఆ సన్నివేశాలు తెరపై చూడటానికి బాగానే అనిపిస్తాయి, అది తప్ప సినిమాలో ఏమీ లేదు. ఆకాశ వీధుల్లో ఒక క్యారెక్టర్ జర్నీ, అయితే హీరో క్యారెక్టర్‌లో కొత్తదనం ఏమీ లేదు ఆ పాత్రను కూడా ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు, బహుశా మనం మొదటి నుండి డిస్‌కనెక్ట్ అవ్వడానికి కారణం కూడా ఇదే అయ్యుండొచ్చు.

గౌతమ్ కృష్ణ హీరోగా, దర్శకుడిగా కూడా పని చేసాడు ఈ మూవీ కి మంచి నటనను ప్రదర్శించాడు కానీ దర్శకుడిగా ఫెయిల్ అయ్యాడు. అయితే అనుభవం లేని దర్శకుడు సినిమా ఎలా తీస్తాడో సినిమా చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. అనుభవమున్న దర్శకుడైతే సినిమా బాగుండేది, మిగతా నటీనటులు బాగా చేసారు.

సాంకేతికంగా, ఆకాశ వీధుల్లో విశ్వనాథ్ రెడ్డి విజువల్స్ నుండి జూడా సంధ్య సంగీతం వరకు అన్ని సాంకేతిక అంశాలు సినిమాను కాపాడాయి.

చివరగా, ఆకాశ వీధుల్లో ఒక్కసారి చూసే చిత్రం, మీకు చూడటానికి ఏమీ మిగిలి ఉండకపోతే, ఒకసారి ప్రయత్నించవచ్చు.

సినిమా రేటింగ్: 2.5/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు