Hero Review: హీరో మూవీ రివ్యూ

Hero Review: ప్రిన్స్ మహేశ్ బాబు అల్లుడు అశోక్ గల్లా ప్రధాన పాత్రలో నటించిన సినిమా హీరో ఎట్టకేలకు గ్రాండ్ గా రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అశోక్ గల్లా కౌబాయ్ లా కలనిపించి టక్కరి దొంగ సినిమాలో మహేశ్ బాబును గుర్తుచేసాడని అభిమానులతో పాటు, ప్రేక్షకులు అంటున్నారు. సినిమా స్టోరీ, యాక్షన్ అద్భతంగా ఉందని చూసిన ఆడియన్స్ చెబుతున్నారు.

Hero Review

హీరో మూవీ అశోక్ గల్లా ప్రధాన పాత్రలో నటించగా.. నిధి అగర్వల్ హీరోయిన్ గా కనిపించింది. జగపతి బాబు, నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సత్య మెయిన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు కథ, స్ర్కీన్ ప్లే అందించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. పద్మావతి గల్లా అమర రాజా మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించింది. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చగా సమీర్ రెడ్డి, రిచార్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.

మొత్తం యాక్షన్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో శ్రీరామ్ ఆదిత్య ఈ మూవీని తెరకెక్కించారు. రొటీన్ కి భిన్నంగా కథ ఉంటుంది. ఏఆర్ టాగూర్, కళ్యాన్ శంకర్ అందించిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.

సినిమా ఎలా ఉందంటే

అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ హీరో సినిమా నచ్చుతుంది. సినిమాటోగ్రఫీ హాలీవుడ్ లెవల్ లో ఉంది. అశోక్ గల్లా, నిధి అగర్వాల్ కెమిస్ట్రీ సరిగ్గా సరిపోయింది. యాక్షన్ సీక్వెన్సెస్ అద్భతంగా వచ్చింది. థియేటర్లోనే ఈ సినిమా చూస్తే మజా వేరేగా ఉంటుంది.

మూవీ రేటింగ్ : 3.5/5

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు