Flax Seeds Uses In Telugu: ఫాక్స్ సీడ్స్ ను తెలుగులో అవిసె గింజలను అంటారు. మదనగెంజలు, ఉలుసులు, అతశి అని ఇతర పేర్లతో కూడా వీటిని పిలుస్తారు. అవిసె గింజల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి స్వయంగా మహాత్మాగాంధీ గారే ఎన్నో సందర్భాల్లో అన్నారు. రోజు అవిసె గింజలను ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరానికి అవసరమైనంత శక్తి లభిస్తుందని డాక్టర్లు సైతం చెబుతున్నారు.
అవిసె గింజలను బరువును తగ్గిస్తాయి. వాటిలో కొలిస్ట్రాల్ ఉండదు. గుండెకు మంచిది. అవిసె గింజలను ఊళ్లల్లో నాటు వైద్యాంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో వీటికి ప్రముఖ స్థానం ఉంది.
అవిసె గింజలను ఎలా తినాలి?
- అవి గింజెలను పదిహేని నిమిషాలు నానబెడితే వాటికి మొలకలు వస్తాయి. ఈ మొలకలను తినడం ద్వారా సాధారణం కంటే మంచి పోషకాలు బాడీకి అందుతాయి.
- గింజలను ఎండలో ఎండబెట్టి, పొడి చేసి, ఆ పొడిని పాలల్లో, జ్యూస్ లలో వేసుకొని తాగవచ్చు.
- ఉదయాన్నే ఫ్రెష్ అయిన తరువాత కొన్ని అవిసె గింజలను పరిగడపున తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
- అవిసె గింజల నూనెను ఎట్టి పరిస్థితుల్లో వేడి చేయకూడదు. అలా చేస్తే వాటిలో ఉండే పోషకాలు నాశనమవుతాయి. కానీ అవిసె గింజలను నూనెలో వేయించుకొని తినవచ్చు.
- వెజిటేరియన్ లేదా నాన్ వెజ్ కూరలు చేసేటప్పుడు వాటిలో అవిసె గింజల పొడిని కొంత వేసుకోవచ్చు.
అవిసె గింజలను నిల్వ ఉంచే విధానం
అవిసె గింజలను లేదా వాటి పొడిని గ్లాసు సీసాలో ఓ సంవత్సరం పాటు భద్రపరచుకోవచ్చు. సంవత్సరం కంటే ఎక్కువగా ఈ గింజలను ఉపయోగించకూడదు. నిల్వ ఉంచేటప్పుడు తడి అంటకుండా చూసుకోవాలి.
జీవక్రియ రేటు పెదుదలలో దోహదం
అవిసె గింజలు జీవక్రియ రేటును పెంచుతుంది. చలికాలంలో అవిసె గింజలు బాడీలో వేడిని పుట్టిస్తాయి. చలి జ్వరం, జలుబు, దగ్గు రాకుండా నివారిస్తుంది. వీటిలో పీచు పధార్ధంతో పాటు విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉన్నాయి. జీర్ణవ్యవస్థకు ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిస్తుంది.
అవిస గింజలల్లో ఒమెగా 3
అవిస గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం ద్వారా బాడీలో కొవ్వు పెరగకుండా ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ను కూడా నివారిస్తుంది. గుండెసంబంధిత వ్యాధులు, ఉబ్బసం, మధుమేహం, క్యాన్సర్ లాంటివి రాకుండా నివారిస్తాయి. లైంగిక సామర్ధ్యాన్ని కూడా ఈ అవిస గింజలు పెంచుతాయి.
ఫ్లాక్స్ సీడ్స్ వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు
- ఇందులో ఉండే బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ రకాన్ని శుద్ధ చేస్తాయి. బాడీలో నిరోధక శక్తిని పెంచుతంది.
- ఈ గింజల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ వల్ల మహిళల్లోని రుతుక్రమానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనానన్ని కలిగిస్తుంది.
- రోజు 50 గ్రాముల అవిస గింజలను తీసుకుంటే 20 శాతం రక్తపోటు తగ్గుతుంది.
- ఓ కప్పు నీటిలో 2 – 3 స్పూన్ల అవిస గింజలను వేసి మరిగింజి తాగిది జలుబు, దగ్గు చిటికెలో నయం అయిపోతుంది.
ఇవి కూడా చూడండి
- Munagaku Benefits In Telugu: మునగ ఆకు వలన ఉపయోగాలు
- Fabiflu Tablet Uses In Telugu: ఫ్యాబీ ఫ్ల్యూ టాబ్లెట్స్ ఉపయోగాలు
- Triphala Churna Uses In Telugu: త్రిఫల చూర్ణం ఉపయోగాలు
- Chia Seeds In Telugu: చియా సీడ్స్ ప్రయోజనాలు