Weight Loss Tips: ఇలా 10 రోజుల్లో బరువు తగ్గించేసేయండి

Weight Loss Tips In Telugu: బరువు తగ్గించడానికి అనేక మంది రకరకాల చిట్కాలని ఫాలో అవుతుంటారు. ఊబకాయం అనారోగ్యాన్ని మాత్రమే పెంచకుండా మనకి ఇంకా అనేక రకాల ఇబ్బందలను క్రియేట్ చేస్తంది. బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంటే మన రోజూ వారి పనులు కూడా సాఫీగా జరిగే ఆస్కారం ఉండదు. బరువును తగ్గించే మంచి చిట్కాలను ఈ ఆర్టికల్ లో మీకు అందిస్తున్నాము. వీటిని పాటించి, వెయిట్ లాస్ అయి ఆరోగ్యంగా ఉండండి.

weight-loss-tips-in-telugu

పీచు పద్ధార్ధాలను తినండి

క్యారెట్, బీట్ రూట్, ఖీర, గోరు చిక్కుడు లాంటి పీచు పదార్ధాలు ఆహారంలో ఉండేలా చూసుకోండి. దీని వల్ల మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడడం మాత్రమే కాకుండా, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజు 30 గ్రాముల పీచు పదార్ధం తీసుకోవడం బాడీకి ఎంతో మంచిది.

పిండి  పధార్ధాలు తగ్గించండి

ఆహారంలో చపాతీలు, బర్గర్లు, బజ్జీలు, చిప్స్, పిజ్జా, పూరీ ఇవన్నీ తగ్గించండి. వండిని పిండిపధార్ధాల్లో నూనె కూడా ఉంటుంది. దీంతో కలెస్ట్రాల్ కాబ్రోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో మీ బాడీల్లోకి వెళ్తుంది. ఒక గ్రాము కార్బోహైడ్రేట్ లో 4 క్యాలరీల ఉంటాయి.

తగినంత నీరు త్రాగాలి

శరీరంలో నీరు చాలా ప్రముఖపాత్రని పోషిస్తుంది. బిజీ లైఫ్ వల్ల చాలా మంది అవసరమైనంత నీటిని తీసుకోలేక పోతారు. కానీ ఓ వ్యక్తి ప్రతీ రోజు సుమారు 4 నుంచి 5 లీటర్ల నీటిని త్రాగాలి. అలా చేయడం వల్ల రక్తం శుద్ది అవుతుంది, బరువు తగ్గడంలో దోహదపడుతుంది. 2 గంటల్లో జీర్ణక్రియ 30 శాతం పెరుగుతుంది.

గ్రీన్ టీ

కాఫీ టీ కాకుండా ప్రతీ రోజు గ్రీన్ టీను తాగండి. గ్రీన్ టీలో కాటెచిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది బాడీలో కొవ్వును తగ్గిస్తుంది. గ్రీన్ టీలో తేనె వేసుకొని తాగింతే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.

వ్యాయామం తప్పనిసరి

వ్యాయామం చేయకుండా ఎవరూ బరువు తగ్గలేరు. 20 నిమిషాల వ్యాయామం మీ బాడీలో ఎన్నో క్యాలరీలను కరిగిస్తుంది. కొవ్వు చెమట ద్వారా వెళ్లిపోతుంది. శ్వాస ప్రక్రియ మెరుగుపడుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడం ప్రాధమికంగా జరుగుతుంది.

సోడా మరియు కూల్ డ్రింక్స్ కి ఫుల్ స్టాప్

సోడా, కూల్ డ్రింక్స్ లో అధిక కొవ్వు ఉంటోందని, వీటిని రోజు తీసుకున్న వారా ఆమాంతం బరువు పెరుగుతున్నారని అధ్యయనంలో తేలింది. కోక్ లో చక్కర పదార్ధం ఎక్కువ ఉండడం కూడా దీనికి కారణం అని నిపుణులు తేల్చారు.

చిన్న చిన్న మార్పలతో పెద్ద చేంజ్

బరువు తగ్గడానికి మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు. 2, 3 కిలోమీటరు దూరం ఉంటే బైక్ పై కాకుండా నడుచుకుంటూ వెళ్లండి లేదా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లండి. రోజూ ఉదయాన్నే లేచి వ్యయామం చేయండి.  ఇంట్లోనే భోజనం తయారు చేస్తోండి, జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండండి.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు