Vitamin C Rich Foods: మన శరీరానికి విటమిస్ సీ చాలా అవసరం దీన్నే ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా అంటారు. ఆహరంలో ఉండే ఇనుమును ఈ ఆస్కార్బిక్ ఆమ్లం శరీరానికి చేరవేయడంలో సాయపడుతుంది. విటమిన్ సీ వళ్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అయితే ఈ విటమిన్ సీ ఏ ఆహారా పదార్ధాల్లో లభిస్తుందనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
పురుషులకు ప్రతీ రోజు 90 మిల్లీగ్రాముల విటమిన్ సీ, మహిళలకు 75 మిల్లీగ్రీముల విటమిన్ సీ అవసరం పడుతుంది.
విటమిన్ సీ పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలు
జామకాయ – 100 గ్రాముల జామకాయలో 228.3 మి.గ్రాముల విటమిన్ సీ ఉంటుంది. నారింజలో కన్నా జామలోనే విటమిన్ సీ ఎక్కువ
ఉసిరికాయ – 478 మిల్లీగ్రాముల ఉసిిరికాయలో 100 మిల్లీగ్రాముల విటమిన్ సీ ఉంటుంది. రోజుకు ఒకటి లేదా రెండు ఉసిరికాయలు తింటే అవసరమైనంత విటమిన్ సీ లభిస్తుంది.
నిమ్మకాయ – 100 గ్రాముల నిమ్మరసంలో 53 మిల్లీగ్రాముల విటమిన్ సీ ఉంటంది. యాపిల్, పుచ్చకాయలు, మామిడి పండ్లలో కన్నా వీటిలోనే విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది
బ్రోకలీ – 100 గ్రాముల బ్రోకలీలో 89.2 మిల్లీగ్రాముల విటమిన్ సీ ఉంటుంది. బ్రోకలీలో విటమిన్ సీ తో పాటు ఐరన్, విటమిన్ బి6, విటమిల్ ఏ లాంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
కాలీఫ్లవర్ – ఓ కప్పు కాలీఫ్లవర్ లో 40 మిల్లీగ్రాముల విటమిన్ సీ ఉంటుంది. దీంట్లో ఫైబర్ కూడా ఉండడంతో జీర్ణ క్రియ కూడా బాగా జరుగుతుంది.
టమోటా – ఒక టమోటాలో 20 మిల్లీగ్రాముల విటమిన్ సీ ఉంటుంది. టమోటాను సాండిచ్ తో పచ్చిగా తింటే చాలా మంచిది.
స్ట్రాబెర్రీలు – 100 గ్రాముల స్ట్రాబెర్రీలో 85 మిల్లీగ్రాముల విటమిన్ సీ ఉంటుంది. స్ట్రాబెర్రీల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది.
బొప్పాయి – బొప్పాయిలో విటమిన్ సీతో పాటు విటమిన్ ఏ కూడా ఉంటుంది. 100 గ్రామల బొప్పాయిలో 60.9 మిల్లీగ్రాముల విటమిన్ సీ ఉంటుంది.
కివీ పండు – 100 గ్రాముల కివీలో 92.7 మిల్లీగ్రామలు విటమిన్ సి ఉంటుంది. కివిలో నారింజ కన్నా విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. కివీలో ఫైబర్, ప్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు కూడా ఉంటాయి.
క్యాప్సికమ్ – 100 గ్రాముల క్యాప్సికమ్ లో 80.4 మిల్లీగ్రాముల విటమిన్ సీ ఉంటుంది.
ఎవరికి ఎంత విటమిన్ సీ అవసరం?
పుట్టిన నుండి 6 నెలల వరకు 40 మి.గ్రా
శిశువులు 7–12 నెలలు 50 మి.గ్రా
పిల్లలు 1–3 సంవత్సరాలు 15 మి.గ్రా
పిల్లలు 4–8 సంవత్సరాలు 25 మి.గ్రా
పిల్లలు 9–13 సంవత్సరాలు 45 మి.గ్రా
టీనేజ్ 14–18 సంవత్సరాలు (బాలురు) 75 మి.గ్రా
టీనేజ్ 14–18 సంవత్సరాలు (బాలికలు) 65 మి.గ్రా
పెద్దలు (పురుషులు) 90 మి.గ్రా
పెద్దలు (మహిళలు) 75 మి.గ్రా
ఇవి కూడా చూడండి:
- Castor Oil Hair Growth: జుట్టు పెరుగుదలకు ఆముదంను ఎలా ఉపయోగించాలి?
- Diabetes: డయాబెటిస్ అంటే ఏంటి, లక్షణాలు, చికిత్స, నివారణా మార్గాలు, చిట్కాలు
- Health Tips At Home: వంటింటి చిట్కాలు, ఆరోగ్య చిట్కాలు, పెద్దలకు…
- Vitamins Uses: విటమిన్ల పోషకాలు, ఉపయోగాలు, ఆహార పదార్ధాలు