Thyroid Cure: ఈ కాలంలో డయాబెటిస్ ఎంత కామన్ గా అనేక మందికి వస్తుందో థైరాయిడ్ కూడా అంతే మందికి అలాగే వస్తుంది. సుమారు 4.2 మిలియన్ల మంది ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యధి సోకిన వారిలో ఆహార నియమాల్లో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. థైరాయిడ్ గురంచి మరిన్న విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

థైరాయిడ్ అంటే ఏమిటి?
గంతు ముందు సీతాకోకచిలుక ఆకారంలో గ్రంథులు ఉంటాయి. ఇవి హార్మోన్లను విడుదల చేస్తాయి. ఈ హార్మోన్లు జీర్ణవ్యవస్థ, శరీర ఉష్ణోగ్రత, బరువు, కొలెస్ట్రాల్ వాటిపై ప్రభావం చూపుతాయి. ఈ హార్మోన్లు ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో విడుదలైనప్పుడు థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. శరీరంలోని ఇతర భాగాలపైన కూడా ఈ థైరాయిడ్ సమస్య ప్రభావం చూపిస్తుంది.
థైరాయిడ్ ఎన్ని రకాలు
- హైపోథైరాయిడిజం
- హైపర్ థైరాయిడిజం
- గాయిటర్
- థైరాయిడ్ నోడ్యూల్స్
- థైరాయిడ్ క్యాన్సర్
పైన ఉన్న థైరాయిడ్ లలో హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ చాలా సాధారణం, ఎక్కువ కేసులు కూడా ఇవే, కాబట్టి వీటి గురించి తెలుసుకుందాం.
హైపో థైరాయిడ్ అంటే ఏంటి?
థైరాయిడ్ గ్రంథి టి3, టి4 హార్మోన్లను కావలసినంత మోతాదులో విడుదల చేయవు అప్పుడు ఈ హైపోథైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది.
హైపో థైరాయిడ్ లక్షణాలు
- బరువు పెరగడం
- పొడి చర్మం
- జుట్టు రాలడం
- గుండె నెమ్మదిగా కొట్టుకోవడం
- శరీరంలో అధిక చెడు కొలెస్ట్రాల్ పెరగడం
- ముఖం వాపు
- కండరాల అసౌకర్యం మరియు
- మలబద్ధకం
హైపోథైరాయిడ్ ఆహార నియమాలు
- అయోడిన్ లోపం వల్ల హైపోతైరాయిడ్ కి గురౌతారు. కాబట్టి మంచి ఐయోడైజ్డ్ ఉప్పును మాత్రమే వినియోగించండి.
- చేపలలో ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు సెలీనియం పుష్కలంగా లభిస్తాయి. సాల్మన్, ట్యూనా లాంటి రకాల చేపలను తినడం చాలా మంచిది.
- గుడ్డులో అయోడిన్, ప్రొటీన్ సమృద్ధిగా ఉంటాయి. హైపోథైరాయిడ్ ఉన్నవారు రోజుకు రెండు గుడ్లు తీసుకుంటే చాలా మంచిది.
- అవిసె గింజలలో ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు, జింక్, సెలీనియం, అయోడిన్ ఉంటాయి. రోజూ రెండు లేదా మూడు స్పూన్ల అవిసె గింజల నూనెను ఆహారంలో భాగం తీసుకుంటే చాలా మంచిది.
హౌపర్ థైరాయిడ్ అంటే ఏమిటి?
థైరాయిడ్ గ్రంధి అధిక హార్మోన్లు ఉత్పత్తి చేసినప్పుడు హైపర్ థైరాయిడ్ పరిస్థితి వస్తుంది.
హైపర్ థైరాయిడ్ లక్షణాలు
- బరువు తగ్గడం
- గుండె వేగంగా కొట్టుకోవడం
- ఆందోళన
- చిరాకు
- క్రమరహిత కాలాలు
- నిద్ర రాకపోవడం
- ఏకాగ్రతతో ఇబ్బంది
- ఆకలి పెరగడం
- తేమగా ఉండే చర్మంతో సమస్యలకు దారితీస్తుంది
హైపర్ థైరాయిడ్ లో ఏమి తినాలి?
బచ్చలికూర, బ్రోకలీ, క్యాబేజీ, క్యారెట్లు, కాలీఫ్లవర, ముల్లంగి లాంటి ఆకుపచ్చ కూరగాయలు తినవచ్చు. సలాడ్లు, దోసకాయలు, క్యాప్సికమ్ లాంటి తింటే కూడా చాలా మంచిది.
పండ్లు
స్టాబెర్రీ, దానిమ్మ, యాపిల్, నారింజ, అవోకాడో లాంటివి తీసుకోవాటి. అవోకాడో లో ప్రొటీన్, ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లలు, విటమిన్లు, సెలీనియం లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
గుడ్లు
థైరాయిడ్ సమస్యకు గుడ్లు చాలా మంచివి. అయితే గుడ్డులో తెల్లసొనని మత్రమే తినండి, పచ్చ సొనని తక్కువగా తినండి, పచ్చసొనలో ఐయోడిన్ ఎక్కువగా ఉంటుంది.
గ్రీన్ టీ
రోజూ ఉదయం గ్రీట్ టీ చాలా మంచిది. ఇది కషాయంలా పనిచేస్తుంది. గ్రీన్ టీ యాంటీ థైరాయిడ్ లక్షణాలను కలిగి ఉంటుంది.
మాంసం, చేప చికెన్
మాంసం, చేపలు, చికెన్ థైరాయిడ్ సమస్య ఉన్న వారు తప్పకుండా తినాలి. అయితే సముద్ర చేపలు తినకుండా జాగ్రత్తవహించాలి, ఎందుకంటే వాటిలో ఐయోడిన్ ఎక్కువగా ఉంటుంది.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఏమి తినకూడదు
అధిక అయోడిన్, సెలీనియం ఉన్న ఆహారాన్ని తినవద్దు
చక్కెర అధికంగా ఉండే పానియాలు తినవద్దు, చక్కెరకు బదులుగా తేనెను తీసుకోండి
బ్రెడ్, బిస్కెట్ లాంటి వాటికి దూరంగా ఉండాలి, జంక్ ఫుడ్స్ కూడా తీసుకోవద్దు
పండ్ల రసం తాగవద్దు దానికి బదులుగా పండు తినాలి
ఇవి కూడా చూడండి
- Thati Bellam Benefits: తాటి బెల్లం వల్ల కలిగే అద్భతమైన ఆరోగ్య…
- Vitamin C Rich Foods: విటమిన్ సి అధికంగా ఉండే ఆహార…
- Castor Oil Hair Growth: జుట్టు పెరుగుదలకు ఆముదంను ఎలా ఉపయోగించాలి?
- Diabetes: డయాబెటిస్ అంటే ఏంటి, లక్షణాలు, చికిత్స, నివారణా మార్గాలు, చిట్కాలు