Weight Gain Tips: బరువు తగ్గించడానికి చాలా మంది రకరాల తిప్పలు పడుతుంటారు, అయితే బరువు పెరగడానికి కూడా చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే బరువు పెరగడం అంటే లావు అవడం కాదు. బరువు పెరిగినా అందంగా పెరగడం. ఆ ఆర్టికల్ లో మీకు బరువు ఎలా పెరగాలనే టిప్స్ ను అందిస్తాము. వెయిట్ గెయినింగ్ కోసం వేలు, లక్షలు ఖర్చు చేయకుండా ఈ టిప్ప్ పాటించి చూడండి. తప్పకుండా ఫలితం ఉంటుంది.
బరువు తక్కువగా ఉండటానికి కారణాలు
- సమయానికి ఆహారం లేకపోవడం
- ఆహారంలో పోషల విలువలు లోపించడం
- తక్కువ కెలరీల ఆహారం తీసుకోవడం
- టీబీ, హైపర్ థైరాయిడ్, క్యాన్సర్, రక్తహీనత లాంటి వ్యాధుల వల్ల కూడా బరువు తగ్గుతుంటారు.
- అనోరెక్సాయి, అజీర్ణం, దీర్ఘకాలిక విరేచనాలు, సక్రమంగా ప్రేగు సిండ్రోమ్ లాంటి వ్యాధులు కూడా బరువు తగ్గడానికి కారణం అవుతాయి.
B.M.I ఇండెక్స్
మీరు అవసరమైన బరువుకు తగ్గట్లు ఉన్నారా, తక్కువగా ఉన్నారా లేక ఎక్కువ బరువు ఉన్నారా తెలుసుకోవడానికి ఆనలైన్ లో ఉన్న B.M.I వెబ్సైట్ కు వెళ్లి తెలుసుకోవచ్చు. BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఈ సైట్ లో మీ శరీరం ఎత్తు, బరువు వివరాలు ఇస్తే మీ BMI ఇండెక్స్ చూపిస్తుంది. మీ బీఎంఐ లెక్క 18.5 కన్నా తక్కువగా ఉంటే మీరు తక్కువ బరువు ఉన్నట్లు, 18.5 నుంచి 24.9 ఇండెక్స్ చూపించినట్లయితే మీరు అధిక బరువు ఉన్నట్లు, 30 కన్నా ఎక్కువ ఉంటే చాలా అధిక బరువు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
వేగంగా బరువు పెరగడానికి కొన్ని చిట్కాలు
- రోజు మూడు పుటలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సరైన సమయానికి తీసుకోండి. మధ్యలో ఫ్రూట్స్, సలాడ్స్ కూడా తీసుకోండి. పాలు ఎక్కువగా తాగండి. నెయ్యి, వెన్న, ఆకుపచ్చ కూరగాయలు, పెరుగు, లాంటివి పుష్కలంగా తినండి.
- అరటిపండు, మామిడి పాలు కలిపిన జ్యూస్ ను తాగండి. రోజు రెండు అరటి పండ్లు మీ ఆహారంలో ఉండేలా చూస్కోండి. డ్రైఫ్రూట్స్ కూడా ఎక్కువగా తినండి. భోజనం చేసేటప్పుడు అన్నంలో, కూరలో నెయ్యి ఉండేవిధంగా చూడండి.
- మాంసం, చేపలు, గుడ్లల్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. ఇవి మీ శరీర కండరాలను పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి రోజూ తింటే మీరు త్వరగా బరువు పెరుగుతారు.
- ఆహారంతో పాటు మంచి నిద్రకూడా అవసరం. తిన్న వెంటనే నిద్రపోకుండా కొంచం సేపటివరకు వాకింగ్ చేసి ఆ తర్వాత నిద్ర పోండి. వీలయితే మధ్యహ్నం లేదా సాయంత్రం కూడా ఓ అరగంట నిద్రపోయే విధంగా చూస్కోండి. తినే ఆహారంలో ఫైబర్ కూడా ఉండేలా చూస్కోండి. ఫైబర్ జీర్ణం కావడానికి దోహదం చేస్తుంది.
- వ్యాయామం కూడా తప్పనిసరిగా చేయండి. తేలికపాటి వ్యాయామం చేయడం. చిన్న చిన్న స్టెచ్చింగ్స్, అరగంట జాగింగ్ లాంటి చాలా మంచి. ఆహారం ఎక్కువ తీసుకుంటారు కాబట్టి జీర్ణం కావడానికి ఈ వ్యాయామం చాలా తోడ్పడుతుంది.
- భోజనానికి ముందు నీరు తాగవద్దు. అవసరమైతే ఓ అరగ్లాసు కన్నా ఎక్కువ తాగరాదు. లేదంటే జీర్ణ ప్రక్రియలో ఇబ్బందులు ఏర్పడతాయి.
- ఆన్లైన్ షాపింగ్ మాల్ ఆమెజాన్ లో క్రియేటిన్ మోనోహైడ్రేట్ (creatine monohydrate) అవలైబుల్ గా ఉంటుంది. దీన్ని ప్రతీ రోజు ఓ డాక్టర్ సలహా తీసుకొని సేవించండి. బరువు పెరగడానికి ఈ ప్రోటీన్ చాలా ఉపయోగపడుతుంది.
ఇవి కూడా చూడండి
- Aloe Vera Benefits: కలబంద ఆరోగ్య ప్రయోజనాలు
- Amla Health Benefits: ఉసిరికాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- Tippa Teega Benefits: తిప్ప తీగ ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
- Immunity Foods: రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు