Coconut Oil Burning Fat: కొకొనట్ ఆయిల్ ను బరువు తగ్గడానికి ఎలా ఉపయోగించాలి?

Belly fat burning foods telugu: బరువు తగ్గించడంలో కొబ్బరి నూనె ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఆయుర్వేద నిపుణులు వీరమాచినేని గారు కొబ్బరి నూనెతో ఉండే ఎన్నో ప్రయోజనాల గురించి వివరించారు. ఆహారంలో కొబ్బరినూనెను భాగం చేసుకుంటే పొట్ట తొందరగా తగ్గుతందని ఆయన ఎన్నో సార్లు చెప్పుడు,కొన్ని క్లినికల్ ట్రయల్స్ వల్ల నిరూపించారు కూడా.

belly-fat-burning-foods-telugu
Source: cdn.massagemag.com

కేరళలో కొబ్బరి నూనెను అధికంగా వాడతారు. కేవలం తలవెంట్రుకలకే కాకుండా వారు బజ్జీలు చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు కూడా కొబ్బరి నూనెనే ఉపయోగిస్తారు. అందుకే కేరళీయులు ఒత్తైన జుట్టుతో సన్నగా ఉంటారు.

కొబ్బరినూనె పొట్టను ఎలా తగ్గిస్తుంది?

కొబ్బరి నూనె వేడిని పుట్టిస్తుంది. ఆహారంలో కొబ్బరి నూనెను భాగంగా చేసుకుంటే కడుపులోకి వెళ్లిన తర్వాల పొట్టలో ఉన్న కొవ్వును కూడా ఇది కరిగిస్తుంది. ఈ రకంగా పొట్ట తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది.

కొబ్బరి నూనె తాగితే కడుపు నిండినట్టుగా ఉంటుంది. దీంతో మీకు ఆకలి వేయదు, తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. అలా మీ బరువును తగ్గించడానికి కొబ్బరి నూనె పరోక్షంగా దోహదపడుతుంది.

కొబ్బరినూనెను బరువు తగ్గడానికి ఎలా ఉపయోగించాలి?

టిఫిన్, లంచ్ లేదా డిన్నర్ చేసే అరగంట ముందు ఓ చెంచాలో కొబ్బరి నూనెను నీళ్లల్లో వేసుకొని తాగాలి. ఇలా ఒక వారం పాటు చేసి మీ బరువును ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా రెండు వారాల్లో మీ బరువు గణనీయంగా తగ్గిపోతుంది.

ఎలాంటి కొబ్బరి నూనె తీసుకోవాలి?

పారాషూట్ లాంటి కొబ్బిరి నూనెను కాకుండా, సహజంగా ఇంట్లో తయారు చేసిన కొబ్బరి నూనెను వాడండి.

కొబ్బరి నూనెను మీకు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చిన్నగా కొబ్బరి ముక్కలను కట్ చేసి, ఎండలో పెట్టి అనంతరం వాటి నుంచి మిల్స్ తీసి దాన్ని కాగబెడితే కొబ్బరినూనె

మీరు కొబ్బరి నూనెను ఇంట్లో తయారు చేసుకోలేకపోతే మార్కెట్లో కూడా కొనుక్కోవచ్చు అయితే ఆ బాటిల్ పై Edible Cocontu Oil అని రాసి ఉండాలి. Extra Edible Coconut Oil అని ఉంటే మరీ మంచిది, ఎక్సఫైరీ డేట్ చూసి తీసుకోండి.

కొబ్బరి నూనె ఆరోగ్యప్రయోజనాలు

కొబ్బరి నూనెలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ అది మంచి కొలెస్ట్రాల్, శరీరానికి ఏ హానీ చేయదు. అందులో ఉండే లౌరిక్ యాసిడ్ అధిక రక్తపోటు రాకుండా నివారిస్తుంది.

  • రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది
  • కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
  • మధుమేహాన్ని తగ్గిస్తుంది
  • చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది
  • కిడ్నీ వ్యాధులు తగ్గిస్తుంది
  • జ్ఞాపకశక్తి ని పెంచుతుంది
  • కడుపులో ఉండే నులి పురుగుల్ని చంపుతుంది

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు