Coronavirus Prevention: కరోనా వైరస్ ను ఎదుర్కోవడం ఎలా..? 

Coronavirus Prevention: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉంది. వైరస్ అంతమైపోవడమేమోకానీ.. రోజు రోజుకూ కొత్త వేరియంట్లతో విజృంభిస్తూ ప్రపంచంలోని అన్ని దేశాలపై విషం చిమ్ముతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు, చికిత్స, అలాగే నివారణ గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

coronavirus-symptoms-causes-prevention-telugu
Source: www.narayanahealth.org

కరోనా వైరస్ యొక్క లక్షణాలు… 

ఈ వ్యాధి లక్షణాల గురించి మాట్లాడితే, ఇది సాధారణ జలుబు లేదా న్యుమోనియా మాదిరిగానే ఉంటుంది. వైరస్ సోకిన తరువాత, జ్వరం, జలుబు, ఊపిరి తీసుకోవడంలొ ఇబ్బంది, ముక్కు కారటంతో పాటు గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ వైరస్ ఒక వ్యక్తి నుండి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది, కాబట్టి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఎవరికి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఇక కరోనా వైరస్ సోకిన తర్వాత దాని లక్షణాలు బాధితుడిలో కనిపించవచ్చు కనిపించకపోవచ్చు కూడా.. ఒకవేళ లక్షణాలు ఉంటే అవి 2 నుండి 14 రోజుల తరువాత కనిపిస్తాయి.

కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

  1. కరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 400-500 మైక్రో సైజులో కలిగి ఉంటాయి. అందువల్ల ఏదైనా మన్నికైన క్లాత్ తో తయారు చేసిన మాస్క్ ను ధరించడం వల్ల వైరస్ మీ దగ్గరకి రాకుండా నివారించవచ్చు.
  2. కరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందువల్ల బట్టలు ఉతికినా, లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా, వైరస్‍ని అడ్డుకోవచ్చు.
  3. ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది.
  4. గోరువెచ్చటి నీటిలో ఉప్పు , చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, కొంత వరకు వైరస్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా, ఊపిరితిత్తుల్లోకి కొరొనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు.
  5. జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది.
  6.  అలాగే తులసి ఆకులు, కొంచెం పసుపు వేసి నీటిని కాచి కొంచెం వెల్లుల్లి రసము లేదా అల్లము రసము వేసి ఉదయము తీసుకుంటూ ఉంటే వైరస్ మన శరీరంలోకి రాకుండా అడ్డుకోవచ్చు.
  7. అదేవిధంగా మిరియాల పాలు తప్పనిసరిగా పిల్లలకు ఇవ్వండి. ఇలా చేసినా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
  8. రోజూ కాచి చల్లార్చిన నీటిని తాగుతూ ఉన్నా.. మంచి ఫలితం ఉంటుంది.

కరోనా వైరస్ గురించి అపోహలు నిజానిజాలు:

అపోహ: వెల్లుల్లి తినడం ద్వారా కరోనా వైరస్ నివారించబడుతుంది..?

వాస్తవికత: వెల్లుల్లి తినడం వల్ల కరోనా వైరస్ సంక్రమణను నివారించవచ్చని వాట్సాప్‌లో చాలా సందేశాలు ఉన్నాయి, అయితే ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం మాత్రమే. వెల్లుల్లి యాంటీమైక్రోబయాల్ లక్షణాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహార పదార్థం, కాని వెల్లుల్లి కరోనా వైరస్ను నయం చేస్తుందనే ఆధారాలు లేవు.

అపోహ: ఆవు పేడ మరియు ఆవు మూత్రం కరోనా వైరకస్ ను అడ్డుకుంటుంది..?

వాస్తవికత: ఆవు పేడ మరియు ఆవు మూత్రం కరోనా వైరకస్ ను అడ్డుకుంటుందనేది కూడా అపోహ మాత్రమే.. దీనికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు 

అపోహ: పెంపుడు జంతువుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా..?

వాస్తవికత: దీనికి ఇప్పటివరకు ఏ పరిశోధనలో లేదా అధ్యయనంలో రుజువు కాలేదు. ఈ పెంపుడు జంతువుల నుండి ఇప్పటివరకు మానవులలో కరోనా వ్యాప్తి చెందిన కేసులు ఏవీ నివేదించబడలేదు. అయినప్పటికీ, పెంపుడు జంతువును తాకిన తరువాత, ఎలాంటి బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా ఉండటానికి మీరు పూర్తిగా హ్యాండ్‌వాష్ చేసుకోవడం చాలా మంచింది.

అపోహ : కరోనావైరస్ దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందుతుంది..?

వాస్తవికత: కరోనావైరస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని సూచించడానికి ఈ రోజు వరకు ఎటువంటి సమాచారం లేదా ఆధారాలు లేవు. కరోనావైరస్ అనేది శ్వాసకోశ వైరస్, ఇది ప్రధానంగా సోకిన వ్యక్తి దగ్గుతున్నప్పుడు లేదా తుమ్ముతున్నప్పుడు ముక్కు నుండి లేదా లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, మీ చేతులను తరచుగా ఆల్కహాల్ ఆధారిత చేతి రుద్దుతో శుభ్రం చేయండి అలాగే, దగ్గు మరియు తుమ్ము ఉన్న వారితో సన్నిహిత సంబంధాన్ని నివారించండి.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు