GREEN TEA USES: నేటి ఆధునిక సమాజంలో ఒబేసిటీ ఎంతో ప్రమాదకరంగా మారింది. అధిక పొట్ట ఒక రోగాల పుట్ట అన్న వైద్యుల మాట అక్షర సత్యాలవుతున్నాయి. ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం ప్రధాన సమస్యగా ఉంది. మారుతున్న జీవన పరిణామాలకు అనుగుణంగా ఆహార అలవాట్లు మారుతుండటంతో ఒబేసిటీ ప్రాణాంతక వ్యాధులకు తీస్తోంది. అయితే చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారిని ఇబ్బంది పెట్టే ఈ ఒబేసిటీ సమస్యకు చెక్ పెట్టేందుకు గ్రీన్ టీ అద్బుతంగా పనిచేస్తుంది.

గ్రీన్ టీ లో ఉండే EGCG అనే పదార్థం మీ జీవక్రియ రేటు పెంచి అదనంగా ఉండే కొవ్వును కరిగిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడాంట్స్ రోగనిరోధక శక్తి పెంచడానికి దోహదపడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ల బారినుండి రక్షిస్తూ.. శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. శరీరంలో ఏర్పడే కొవ్వును తొలగించి, తద్వారా శరీరం అధిక బరువు సమస్య నుంచి కాపాడుతుంది. అలాగే జీవక్రియలో పాల్గొని కొవ్వు పదార్థాల నుండి ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు కాఫీ, టీలకు బదులుగా గ్రీన్ టీని తాగడం వల్ల చక్కని ఫలితాలు పొందవచ్చు.
గ్రీన్ టీలో వాడే పదార్ధాల ప్రయోజనాలు
నిమ్మకాయ
ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మన శరీరంలో ఉండే పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి నిమ్మకాయ ఎంతగానో సహాయపడుతుంది. ఇది మనం వ్యాయామం చేసే సమయంలో 30 శాతం మరింత కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది.
తేనె
బరువును నియంత్రణలో ఉంచడంలో తేనే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తేనె అధిక బరువును తగ్గించడమే కాకుండా.. హృదయ సంబంధ రుగ్మతల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు వేడి నీటిలో మూడు టీ స్పూన్ల తేనెను కలుపుకుని తాగితే మీ బరువుని క్రమంగా తగ్గించవచ్చు. ఇలా కాకుండా గ్రీన్ టీ లో వేసుకుని తాగినా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు
దాల్చిన చెక్క:
శరీరంలో కొవ్వును తగ్గించడంలో దాల్చిన చెక్క కూడా అద్బుతంగా పనిచేస్తుంది. కానీ దాల్చిన చెక్క ఒక్కటే తీసుకోవడం ద్వారా ఈ ఫలితాలు పొందలేము. తక్కువ కేలరీలు తినడంతో పాటు రోజూ క్రమం తప్పకుండా ఖచ్చితమైన వ్యాయామం తప్పనిసరిగా చెయ్యాలి.
గ్రీన్ టీ తయారీ విధానం:
కావాల్సిన పదార్థాలు:
- నీళ్లు – 2 కప్స్
- గ్రీన్ టీ బ్యాగ్ – 1
- తేనె – 2-3 టీ స్పూన్లు
- నిమ్మకాయ – పెద్దది 1
- దాల్చిన చెక్క – ½ అంగుళం
ముందుగా గిన్నెలో రెండు గ్లాసుల నీటిని ఒక్క నిమిషం పాటు మరగనివ్వాలి. ఆ తర్వాత మంటను తగ్గించి గ్రీన్ టీ పొడి వేసి ఒకటి నుంచి రెండు నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు గ్రీన్ టీ వడకట్టి గ్లాసులోకి తీసుకోవాలి. వచ్చిన పానీయంలో నిమ్మకాయ రసం, రెండు టీ స్పూన్ల తేనె, దాల్చిన చెక్కను కలపాలి.
ఎలా ఉపయోగించాలి?
ఇలా తయారు చేసుకున్న గ్రీన్ టీ ని ఉదయం లేవగానే మళ్లీ సాయంత్రం సమయంలో తీసుకోవాలి. ఇది మీ శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. ఉదయం వ్యాయామం చేసే 30 నిమిషాల ముందు ఈ గ్రీన్ టీని తాగితే వ్యాయామం చేసే సమయంలో ఇది ఇంధనంగా పనిచేసి త్వరగా మీ శరీరంలో ఉన్న కొవ్వుని కరిగిస్తుంది.
బరువును తగ్గించడానికి గ్రీన్ టీ – అదనపు చిట్కాలు
మీరు తీసుకున్న గ్రీన్ టీ మంచి కంపెనీ అయి ఉండాలి. మంచి క్వాలిటీది కాకపోతే ఎలాంటి ఫలితం ఉండదు కాబట్టి మంచి కంపెనీ గ్రీన్ టీని ఎంచుకోండి..
మీరు గ్రీన్ టీ బ్యాగ్ ఉపయోగించిన తర్వాత వాటిని పడేయవద్దు. గ్రీన్ టీ బ్యాగ్ తో చర్మ సౌందర్యానికి ఉపయోగపడే చక్కటి ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకోవచ్చు.
కొబ్బరినూనె కూడా బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ లో ఒకటి లేదా రెండు teaspoon టీస్పూన్ల కొబ్బరినూనె వేసుకుని త్రాగితే మంచి ఫలితాలను పొందవచ్చు.
ఇవి కూడా చూడండి