Hair Growth Tips Telugu: జుట్టుని ఆడవారు బంగారంలా భావిస్తారు. వారికి జుట్టు ఊడిపోతుంటే బంగారమే పోతుందేమోననే స్థితిలో బాధపడిపోతారు. ఒత్తు, పొడవైన జుట్టు మహిళల్లో అందాన్ని పెంచుతుంది. జుట్టును పరిరక్షించుకోవడానికి నానా విధాలుగా ప్రయత్నిస్తుంటారు. పెద్దలు కూడా జుట్టును కాపడుకోవడానికి ఎన్నో చిట్కాలు చెప్పారు. కొందరు కొన్ని చిట్కాలు పాటించి బోల్తా పడతారు. కొన్ని చిట్కాలతో జుట్టు ఊడే సమస్య మరింత పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకు సంబంధించిన మరిన్ని చిట్కాలను, సమాచారాన్ని ఈ ఆర్టికల్ లో మీకు అందిస్తున్నాము.

జుట్టు వేగంగా పెరగాలంటే ఇవి పాటించండి
- వారానికి కనీసం 2 సార్లు జుట్టుకు నూనె రాసుకోవాలి
- జుట్టును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి
- వారానికి రెండు సార్లు జుట్టుకు ష్యాంపూ అప్లై చేయాలి
- రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి
- ధూమపానం మానేయాలి
- గొరువెచ్చి నీటితో జుట్టును కడగరాదు
- తెరిచిన జుట్టుతో అంటే లూజ్ హెయిర్ తో నిద్రపోకూడదు
జుట్టుకు బలం చేకూర్చే నియమాలు, ఆహారపదార్ధాలు
- పాలకూరగాయలు, బచ్చలికూర, క్యారెట్లు, బీన్స్ తినాలి
- డ్రైఫ్రూట్స్, జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం లాంటివి తీసుకోవాలి
- సీజనల్ పండ్లు యాపిల్, ఆరెంజ్, దానిమ్మ, బెర్రీ, అవొకాడో, అరటి, చిలగడదుంపలు లాంటి వాటిని ఎప్పటికప్పుడు సేవించాలి
- గుడ్లు, చేపల్లో కూడా జుట్టును పెంచే పోషకాలు చాలా ఉన్నాయి
- నీరు బాగా త్రాగాలి
జుట్టు పెరుగుదలను ఆపేసే ఆహారపదార్దాలు
- మద్యం సేవించవద్దు
- తీపి తినవద్దు
- సోడిక్ పానియాలు తాగవద్దు
- ఎక్కువ నూనె ఉన్న ఆహార పదార్ధాలు తినవద్దు
జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణాలు
జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. వయసు పెరుగుదల కూడా అందులో ఒక భాగమే. ఇంకా ఇతర కారణాలేవన్ని ఓ సారి చూద్దాం
- వయసు పెరుగుదల
- వంశపారంపర్య
- ఆహారంలో పోషక లోపం
- ఒత్తిడి
- హార్మోన్ల బ్యాలెన్స్ ఆటంకాలు
- వాతావరణంలో మార్పు
- జుట్టు మీద రకరకాల వస్తువులను ఉపయోగించడం లేదా జుట్టును అలంకరించడం
- హార్మోన్ ఇంబ్యాలెన్స్ ల వల్ల
జుట్టు పెరుగుదలకు చిట్కాలు
- ఆముదం నూనెను గోరువెచ్చగా చేసి జుట్టుకు పట్టించి మసాజ్ చేసి. తమకు బట్ట కట్టి, గంట తరువాత శుభ్రం చేసుకుంటే చాలా మంచిది.
- కలబంద గుజ్జును జుట్టుకు రాసుకోవాలి. గంట తరువాత ష్యాంపూతో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
- ఉల్లాపాయలను మిక్సీలో తరిగి, దాంట్లోంచి ఉల్లి రసాన్ని తీసి జుట్టుకు రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్ర చేసుకుంటే జుట్టుకు చాలా మంచిది
- కరివేపాకు రసాన్ని గోరువెచ్చని కొబ్బరి నూనెలో వేసి కలిపి జుట్టుకు పట్టించాలి. అనంతరం జుట్టును బాగా శుభ్రం చేసుకోవాలి. దీంతో మీ జుట్టు చాలా అందంగా, దృడంగా తయారవుతుంది.
- పచ్చిగుడ్డుని తలకు రాసుకొని 20 నిమిషాల తరువాత ష్యాంపుతో కడుక్కుంటే మంచి ఫలితం వస్తుంది.
- నిద్రకు వెళ్లే ముందు గోరువెచ్చని కొబ్బరి నూనెతో జుట్టుకు మసాజ్ చేయాలి. రాత్రి అలాగే పడుకొని ఉదయం నిద్రలోంచి లేచిన తరువాత శుభ్రం చేసుకుంటే జుట్టు బలంగా తయారవుతుంది.
- గొరింట పొడిని జుట్టుకు రాసుకుంటే, జుట్టు దృఢంగా మాత్రమే ఉండకుండా, మృదువుగా కూడా తయారవుతుంది.
- ఆవనూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. రాత్రి దీనితో జుట్టుకు మసాజ్ చేసి ఉదయాన్ని ష్యాంపూతో శుబ్రం చేసుకుంటే చాలా మంచిది.
ఇవి కూడా చూడండి
- Coconut Oil Burning Fat: కొకొనట్ ఆయిల్ ను బరువు తగ్గడానికి…
- Coronavirus Prevention: కరోనా వైరస్ ను ఎదుర్కోవడం ఎలా..?
- Kitchen Tips: వంటింటి చిట్కాలు, కిచెన్ టిప్స్
- Pumpkin Seeds Benefits: గుమ్మడికాయ గింజలు ఆరోగ్య ప్రయోజనాలు