How To Use Tippa Teega: తిప్ప తీగవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తిప్పతీగకు ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం ఉంది. కరోనా సమయంలో ఈ తిప్పతీగ అనేక మందికి సంజీవనిలా పనిచేసింది.చాలా మందికి తిప్ప తీగ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా వాడాలో తెలియదు. వారందరి కోసం ఈ ఆర్టికల్ లో తిప్ప తీగకు సంబందించిన అవసరమైన సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాము.
తిప్పతీగను ఎలా ఉపయోగించాలి
- 30 మిల్లీలీటర్ల తిప్పతీగ కషాయలంో రెండు టీ స్పూనుల చక్కెర వేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
- ఒక గ్లాసు మజ్జిగలో 10, 20 తిప్పతీగ ఆకులను రుబ్బి కలుపుకొని తాగితే కమెర్లు వెంటనే నయం అవుతాయి.
డయాబెటిస్ ఉన్నవారు తిప్పతీగను ఎలా సేవించాలి
- తిప్పతీగ పొడి, ఎర్ర చందనం, ఉసిరి పొడిలో తేనె కలిపి చిన్న వేప బెరడు సైజులు చేసికొని రోజుకు మూడు సార్లు డయాబెటిస్ ఉన్న వారు తింటే చాలా మంచిది
- 20 మిల్లీలీటర్ల తిప్పతీగ రసంలో రెండు టీస్పూన్ల తేనెవేసుకొని తాగితే మధుమేహం నుంచి కొంత ఉపశమనం తగ్గుతుంది.
మూత్ర సమస్యలను నివారించడానికి తిప్పతీగ
కొందరు నాన్ స్టాప్ గా మూత్రానికి వెళ్తుంటారు. అలాంటి వారికి 20 మిల్లీలీటర్ల తిప్పతీగ రసంలో 2 గ్రాముల రాతి భేద పొడి 1 టీ స్పూన్ తేనె వేసి కలిపితే రోజుకు 3 నుంచి 4 సార్లు సేవిస్తే.. మూత్ర సమస్య కొంత తగ్గుతుంది.
ఏనుగు కాలు సమస్య పరిష్కారం
- 20 మిల్లీలీటర్ల తిప్ప తీగ రసంలో 30 మి.లీ ఆవనూనె కలిపి, ఖాళీ కడుపుతో తాగితే ఏనుగు కాళ్ల సమస్య కొంత తగ్గుతుంది.
- రోజుకు 2,3 సార్లు 20 మి.లీ తిప్పతీగ రసాన్ని తాగితే కొన్ని నెలలపాటు తాగితే కుష్టు వ్యాధి క్రమంగా నయం కావడం జరుగుతుంది.
జ్వరానికి తిప్పతీగ
- 20 గ్రా తిప్పతీగ పొడిలో 1 గ్రా పిప్పలి ఒక చెంచా తేనె వేసి కలిపితే జ్వరం, కఫం, దగ్గు, అనోరెక్సియా లాంటి వ్యాధులు నయమవుతాయి
- తిప్పతీగ, వేప, ఉసిరితో చేసిన 50 మి.లీ కషాయంలో తేనెను సమాన పరిమాణంలో కలిపి తాగితే జ్వరం తీవ్ర స్థాయిలో ఉన్నా తగ్గిపోతుంది.
- జ్వరం వచ్చిన రోగికి తిప్పతీగ ఆకులతో వండిన కూరగాయల కర్రీని తినిపిస్తే వెంటనే ఉపశమనం పొందుతారు.
తిప్ప తీగ జ్యూస్ ను ఎప్పుడు, ఎలా తీసుకోవాలి?
తిప్ప తీగ జ్యూస్ మార్కెట్లో సులభంగా అవైలబుల్ గా ఉంది. జ్యూస్ లేకున్నా పొడి మీకు సాధారణ జనరల్ స్టోర్ లో కూడా ఉంటుంది. ప్రతీ రోజు ఉదయం పరిగడపున తిప్ప తీగ రసం, లేదా గ్లాసు నీటిలో ఆ పొడి వేసుకొని తాగడం చాలా మంచిది.
కరోనాను తిప్పి తీగ ఎదుర్కొంటుందా
ఆయుర్వేదంలో తిప్పతీగకు రోగనిరోధకశక్తి ఎక్కువ ప్రసాదించే మూలికగా చేబుతారు. అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. కరోనా సెకెండ్ వేవ్ లో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చాలా మంది ఈ తిప్ప తీగను ఉపయోగించారు.
ఇవి కూడా చూడండి
- GREEN TEA BENEFITS: గ్రీన్ టీని ఎలా తయారు చేసుకోవాలి?
- Hair Growth Tips Telugu: జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి చిట్కాలు
- Coconut Oil Burning Fat: కొకొనట్ ఆయిల్ ను బరువు తగ్గడానికి..
- Coronavirus Prevention: కరోనా వైరస్ ను ఎదుర్కోవడం ఎలా..?