Neem Tree Health Benefits: వేప ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు

Neem Tree Health Benefits: వేప చెట్టును భారతీయులు దైవంతో సమానంగా చూస్తారు. ఉళ్లల్లో వేపచెట్టును పూజించని వారుండరు. వేప చెట్టుకు ఆయుర్వేదంలో మంచి ప్రముఖమైన స్థానం ఉంది. మంచి ఎప్పుడూ చేదుగానే ఉంటుంది అన్నట్లు వేప చేదుగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. వేప చెట్టు నీడలో సేద తీరితే ఆ హాయి, సంతృప్తి వర్ణించలేనిది. వేప చెట్టు గురించి మరిన్ని విషయాలను ఆ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

vepa chettu uses in telugu
Source: m.media-amazon.com

ఉదయం లేవగానే పరిగడపును అంటే బ్రేక్ ఫాస్ట్ కు ముదే వేప ఆకులను తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మధుమేహం, కడుపులో అల్సర్, బర్నింగ్, గ్యాస్, కుష్టు వ్యాధి, కంటి రుగ్మతలు, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, చర్మపు పూతల, గుండె ఇతర రక్త నాళాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.

వేపచెట్టు వల్ల లెక్కలేనన్ని ఉపయోగాలు ఉన్నాయి. వేప శరీరానికి ఎలా మంచి చేస్తుందోనని నిపుణులు ప్రతీ రోజు ఇంకా కొత్త విషయాలను కనుగ్గొంటున్నారు. వేప పుల్లను టూత్ బ్రష్ గా ఉపయోగిస్తారు. వేప ఆకులను స్నానం నీటిలో వేసుకొని స్నానం చేస్తారు. వేప ఆకులను ఆవిరి పడతారు. ఇలా వేప నుంచి లభించే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల గురించి మనము తెలుసుకుందాం.

షుగర్, మధుమేహాన్ని ఇలా అదుపులో ఉంచుతుంది వేప

 • లేత వేప చిగుర్లు సేవిస్తే చక్కెర వ్యాధి కంట్రోల్ అవుతుంది.
 • వేపాకులను రుబ్బి ఆ రసాన్ని రోజు 2 స్పూన్లు తాగితే మధుమేహం తగ్గుతుంది

వేప బెరడు ఉపయోగాలు

 • 60 గ్రా వేప బెరడుని 4 గ్లసుల నీటిలో ఉడికించి తాగితే కాళేయ వ్యాధులు మటుుమాయం అవుతాయి
 • వేప బెరడు రసాన్ని పది వారాలపాటు రోజుకు రెండు సార్లు తీసుకుంటే మలేరియా ఇంకా అనేక చర్మ వ్యాధులు నయం అవుతాయి
 • వేపబెరడు పొడి, ఆకులు కలపి నూరిన  దానికి గాయంపై రాస్తే వెంటనే నయం అవుతుంది.
 • వేప బెరడును కాల్చి మసి చేసి సీసాలో దాచుకోవాలి. దాన్ని పుండు పై చల్లితే పుండ్లు మానుతాయి.
 • ఉదయం సాయంత్రం వేప బెరడు రసాన్ని తాగితే ప్రేగుల్లో ఉన్న క్రిముల నాశనమవుతాయి.

వేప నూనె ఉపయోగాలు

ఒకప్పుడు వేప నూనె ఆముదం నూనెకన్నా చాలా చీప్ గా లభించేది. ప్రస్తుతం దాని విలువ తెలుసుకొన్నారు కాబట్టి డిమాండ్ కూడా పెరగడంతో రేటు చాలా ఎక్కువగా ఉంది. వేప గింజల్లో 45 శాతం వరకు నూనె పదార్ధమే ఉంటుంది. ఈ వేపనూనెను నేరుగా సవిస్తే కడుపులో ఉన్న పురుగులు, ఏలిక పాములు నశిస్తాయి.

 • వేప నూనె ఆస్తమా, శ్వాస సమస్యలను నివారిస్తుంది
 • ప్రతీ రొజు కొన్ని వేప చుక్కలు తీసుకుంటే కఫం, దగ్గు, జ్వరాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది
 • వేప నూనెతో తామర, దద్దుర్లు తొలగిపోతాయి
 • శరీరానికి వేప నూనె రాయడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు కూడా నివారణ అవుతాయి
 • వేప పువ్వు రక్తాన్ని శుద్ధి చేస్తుంది
 • వేప నూనె రాసుకుంటే చర్మం నునుపుగా మారుతుంది

కళ్లకు వేప ఎలా ఉపయోగపడుతుంది?

 • వేప నూనె ద్వారా కనురెప్పల కింద ఉన్న నల్లని మచ్చలు తొలగిపోతాయి
 • ప్రతీ రోజు కంటి చుట్టున వేప నూనె రాస్తే కనురెప్పలు ఆరోగ్యంగా ఉంటాయి
 • వేప చిగుళ్లను కంటి రెప్పపైపెట్టుకుంటే మంట తగ్గుతుంది
 • వేప నూనెలో ముంచిని వత్తిని వెలిగించి ఆ మసిని కటుకలో కలిపి పెట్టుకుంటే కంటి వ్యాధులు అసలు దరిచేరవు

వేప వల్ల మరిన్ని ఉపయోగాలు

 • వేప కషాయం ప్యాంక్రియాస్ గ్రంధి, రక్తంలో ఇన్సులిన్ స్థాయిని క్రమబద్దీకరించడానికి తొడ్పడుతుంది
 • వేపాకు కషాయం రోజుకు రెండు సార్లు తాగితే ఎటువంటి జ్వరమైనా తగ్గిపోతుంది
 • వేపాకు ఆకులను మెత్తగా నూరి సేవిస్తే ఆయాసం తగ్గుతుంది.
 • వేపాకు పసరు పాముకాటుకు, తేలుకాటుకు దివ్య ఔషదంగా పనిచేస్తుంది.
 • వేపాకు ఆకులను నమిలి రసం మాత్రం మింగితే కడుపునొప్పి వెంటనే తగ్గిపోతుంది.
 • వేపాకు రసాన్ని అరికాళ్లకు రాస్తే.. పగుళ్లు కూడా మాయం అవుతాయి.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు