Hibiscus For Hair Growth: మందారాన్నే ఆంగ్లంలో హైబిస్కస్ అంటారు. ఇది దేవుడి ఆరాధనలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ హైబిస్కస్ పువ్వు చాలా సాధారణంగా మనకు అందుబాటులో ఉంటుంది. ఆడపడుచులు ఈ మందారాన్ని తల్లో పెట్టుకుంటే జుట్టుకు, వారికి అందం రెట్టింపవుతుంది. అయితే ఈ మందారం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మందారంలో ఉండే విటమిన్లు జుట్టు పొడవుగా పెరగడానికి దోహదం చేస్తుంది. మందారానికి సంబంధించిన ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
బలమైన జుట్టుకు మందారం
మందారం పువ్వులో సి విటమిన్ ఉంటుంది. మందారం నూనె జుట్టును మరింత దృడంగా తయారు చేస్తుంది. మూలాల నుంచి జుట్టును బలపరుస్తుంది. విటమిన్-సి సమృద్ధిగా ఉండడంతో మాందార జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది.
చుండ్రు నుండి ఉపశమనం
మందారంలో యాంటీ ఫంగల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది జుట్టులో ఉన్న చుండ్రుని పెరగకుండా చేస్తుంది. ఒక వేల ఉన్నా చుండ్రును తొలగిస్తుంది.
మెరిసే జుట్టు కోసం మందారం
మందారంలో తేమ లక్షణాలు ఉంటాయి. దీంతో జుట్టుకు మందారం నూనె అంటించి మసాజ్ చేసినప్పుడు జుట్టు నిగనిగ మెరిసిపోతుంది. తెల్ల జుట్టును ఇది తగ్గిస్తుంది. జట్టు మృదువుగా కూడా మారుతుంది.
మందారం నూనెను ఎలా తయారు చేసుకోవాలి?
కావలసినవి
- 8 మందారం పువ్వులు
- 8 మందారం ఆకులు
- 1 కప్పు కొబ్బరి నూనె
తయారీ విధానం
- మందారం ఆకులను, పువ్వులను కడిగి మిక్సీలో బాగా రుబ్బుకోవాలి
- మొత్తని పేస్ట్ వచ్చిన తరువాత దాన్ని బాండీలో గోరువచ్చగా కాగుతున్న కొబ్బరి నూనెలో వేయాలి
- కొద్ది సేపు నూనెలో కలిసిన తరువాత, నూనె చల్లారిన అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక బాటిల్ లో నిల్వ చేసుకోవాలి. ఇక అదే మీ మందారం నూనె.
- తయారైన నూనెతో జుట్టుకు మసాజ్ చేయండి. గంట అలాగే ఉంచి ష్యాంపూతో శుభ్రం చేసుకోండి
- మందారం నూనెలో కాల్షియం, భాస్వరం, ఇనుము లాంటి ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
మందారం ఉసిరికాయ హెయిర్ మాస్క్
కావలసినవి
- 6 టీస్పూన్ల మందారం పువ్వులు ఆకుల పేస్ట్
- 3 టీస్పూన్ల ఉసిరి పౌడర్
తయారీ విధానం
మీ దగ్గర ఉన్న మందారం పేస్టును ఉసిరికాయ పౌడర్ ను రెండింటినీ కలపండి. అందులో కొన్ని చుక్కల నీరు వేసి ఇంకా బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు మీద రాసుకొని 40 నిమిషాలు అలాగే వుంచి అనంతరం ష్యాంపూతో కడిగేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ జుట్టుకు చాలా మంచిది.
గుడ్డు మందారం
కావలసినవి
- 2 గుడ్డు తెలుపు
- 3 టేబుల్ స్పూన్ల మందార పేస్ట్
తయారీ విదానం
తెలుపుసొన తుడ్డు, మందార పేస్ట్ రెండింటినీ బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు మొత్తం కవర్ అయ్యే విధంగా పట్టించాలి. అలాగే వదిలేసి అరగంట తరువాత ష్యాంపూతో కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మీ జుట్టుకు చాలా మంచిది. ఈ మిశ్రమంలో ప్రొటీన్, జింక్, విటమిన్లు అధికంగా ఉండడంతో జుట్టు దృఢంగా రాలకుండా ఉంటుంది.
ఇవి కూడా చూడండి
- Tulasi health benefits: తులసి ఆరోగ్య ప్రయోజనాలు..
- Neem Tree Health Benefits: వేప ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
- How To Use Tippa Teega: తిప్ప తీగను ఎలా ఉపయోగించాలి?
- GREEN TEA BENEFITS: గ్రీన్ టీని ఎలా తయారు చేసుకోవాలి?