Apple cider vinegar benefits: ఆపిల్ సైడర్ వెనిగర్ ఎలా తాగాలి

Apple cider vinegar benefits:  ఇటీవలి కాలంలో ఆపిల్ సైడర్ వెనిగర్ వాడకం బాగా ప్రజాదరణ పొందింది. వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు అలాగే వంటలకు దశాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. ఆపిల్ సైడర్ వెనిగార్ అనేది ఒక రకమైన వెనిగార్.. ఆపిల్ పళ్ల రసాన్ని పులియబెట్టడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. ఆపిల్ రసానికి యీస్టును జోడిస్తారు. ఇది పండ్ల చక్కెరలను ఆల్కహాల్ గా మారుస్తుంది. అపుడు బ్యాక్టీరియా ఆల్కహాల్ కు చేర్చబడుతుంది . ఇది క్రమంగా దానిని ఎసిటిక్ ఆమ్లంగా మారుస్తుంది.  దీనిని వాడడం ద్వారా పలు ఆరోగ్య సమస్యలనుంచి బయటపడవచ్చు.

apple-cider-vinegar-benefits
Source: timesofindia.indiatimes.com

వివిధ రకాల ఆపిల్ సైడర్ వెనిగార్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో సాధారణమైన raw ఆపిల్ వెనిగర్ ఎక్కువగా ఉపయోగిస్తారు. అల్లం,నిమ్మకాయ రుచితో కలిగి ఉన్న ఆపిల్ వెనిగర్ కూడా మనకు మార్కెట్లో లభిస్తాయి

ఆపిల్ సైడర్ వెనిగర్ ను రోజూ వాడడం ద్వారా అధిక బరువును,చుండ్రుని, మొటిమలు, గ్యాస్టిక్, షుగర్ వ్యాధులను తగ్గించుకోవచ్చు. అలగే క్యాన్సర్ నుంచి కూడా బయటపడవచ్చు.

ఇది రోజు వాడటం ద్వారా మీరు మీ ఆరోగ్యానికి దగ్గర కావచ్చు. వేలాది సంవత్సరాలు నుంచే ఆపిల్ సైడర్ వెనిగర్ వైద్య పరంగా వాడుతున్నారు.ఇందులో ముఖ్యంగా కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, రాగి, భాస్వరం, సోడియం మరియు ఫ్లోరిన్ పుష్కలంగా ఉన్నాయి.

ఆపిల్ వెనిగర్ మనం రోజూ తీసుకోవడం ద్వారా చాలానే ఉపయోగాలు ఉన్నాయి. అందుకే దీనిని అమృత పానీయం అనే పేరుతో పిలుస్తారు. రోజు ఉదయాన్నే ఆపిల్ వెనిగర్ నీటితో కలిపి తీసుకోవడం ద్వారా భయంకరమైన క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా బయటపడవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్‌ను నియంత్రించడంలో..

ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉండటం బరువు పెరగడానికి దారితీస్తుంది. మీరు ఆపిల్ సైడర్ వెనిగర్ తాగితే అది చక్కెరను తగ్గిస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ శరీరంలో కొవ్వును నిల్వ చేయడానికి పనిచేస్తుంది. ఇది బరువును కూడా తగ్గిస్తుంది.

 కొవ్వును తగ్గించడంలో..

శరీరంలో ఊబకాయం పెరగడం వల్ల అనేక రకాల వ్యాధులు మొదలవుతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ శరీరం నుండి అదనపు కొవ్వును కరిగించడం ద్వారా తగ్గించడానికి పనిచేస్తుంది. ఆపిల్ సైజు వెనిగర్ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు పరిమాణం తగ్గుతుందని చాలా పరిశోధనలలో కనుగొనబడింది.

ఆపిల్ సైడర్ వెనిగర్ ఎలా తాగాలి

బరువు తగ్గడానికి, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఆపిల్ సైడర్ వెనిగర్ త్రాగాలి. 2 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని, అందులో సగం నిమ్మకాయ రసం, 1 టీస్పూన్ తేనె , సగం టీస్పూన్ రాక్ సాల్ట్ ను ఒక గ్లాసు నీటిలో వేసి త్రాగాలి. అదే విధంగా, రాత్రి భోజనానికి ముందు ఒకసారి త్రాగవచ్చు. బరువు తగ్గించడంలో ఇది మీకు చాలా సహాయపడుతుంది.

చుండ్రును తగ్గించడంలో..

చుండ్రుని తగ్గించడానికి  నిమ్మకాయలో యాంటీ ఫంగల్ లక్షణాలు మరియు విటమిన్ సి యొక్క గొప్ప లక్షణం చుండ్రు తగ్గించడంలో ప్రభావితంగా పనిచేస్తుంది అంతేకాదు ఇది తలలో వచ్చే దురదను తగ్గిస్తుంది మరియు చుండ్రు వల్ల వచ్చే చికాకు తగ్గిస్తుంది ఒక అద్భుతమైన శుద్ది ఏజెంట్ గా చెప్పవచ్చు

కావలసినవి

  • పావు కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్
  • 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్
  • అర కప్పు నిమ్మకాయ రసం
  • ఒక కప్పు నీళ్లు

తయారు చేసుకునే విధానం

ఒక గిన్నెలో 1/4 కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్,1/2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, అర కప్పు నిమ్మకాయ రసం,ఒక కప్పు నీళ్లు వేసి బాగా కలపండి

ఇలా సిద్ధం చేసుకున్న ఆపిల్ సైడర్ వెనిగర్ మీ జుట్టు కుదుళ్లుకు రాసుకుని ఒక 30 నిమిషాలు ఉన్న తరువాత తలస్నానం చేయండి.

మొటిమలను తగ్గించడంలో..

ముఖంపైన ఎక్కువగా జిడ్డు ఉంది మొటిమలు వస్తే ఈ చిట్కా పాటించండి ఆపిల్ సైడర్ వెనిగర్ మొఖం మీద ఉన్న జిడ్డు మరియు మొటిమలను తగ్గించి చర్మంలో ఉండే మట్టి చెడు కణాలను బయటికి లాగి చర్మాన్ని శుభ్రంగా ఉండేలా చేసి మొటిమలను తగ్గిస్తుంది

కావలసినవి

  • రెండు కప్పుల నీళ్లు
  • నాలుగు tablespoons ఆపిల్ సైడర్ వెనిగర్
  • రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్

తయారు చేసుకునే విధానం

  • నాలుగు టీస్పూన్ ఆపిల్ వెనిగర్ ని నీటి లో వేసి నీళ్లను బాగా మరగనివ్వండి
  • ఒక్కసారి నీళ్లు బాగా మరిగిన తర్వాత రెండు లేదా మూడు చుక్కల ట్రీ ఆయిల్ వెయ్యండి
  • ఇపుడు ఈ నీటి నుంచి వచ్చిన ఆవిరి మొటిమలు ఉన్న చోట వేడి ఆవిరి తగిలేలా పట్టించండి.

ఇలా క్రమం తప్పకుండా వీలున్నప్పుడల్లా చేస్తుంటే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు