Senagapindi Face Pack: శెనగపిండిని బేసన్ అని కూడా అంటారు. ఆయుర్వేదంతో పాటు బ్యూటీ టిప్స్ లో ఈ శనగపిండికి ప్రముఖమైన స్థానం ఉంది. దీనిని ముఖం పై ఫేస్ ప్యాక్ గా చేసుకుంటే చర్మ సమస్యలతో పాటు, నల్ల మచ్చలు లాంటివి ఏవన్నా ఉంటే తొలగిపోతాయి. శనగపిండిలో జింక్ ఖనిజం ఉంటుంది, ఇది ముఖం పై వచ్చే మొటిమలను పెరగకుండా చేస్తుంది. శనగపిండికి సంబంధించిన ఇలాంటి ఎన్నో ఉపయోగాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం.
శనగ పిండి ప్రయోజనాలు
- శనగపిండిలో ఆల్కలైజింగ్ లక్షణాలు ఉండడం వల్ల చర్మ సమతుల్యతను కాపాడుతుంది
- చర్మం లోపల ఉండే దుమ్ము, విష పదార్ధాలను తొలగిస్తుంది
- చర్మంపై తేమను సక్రమంగా ఉంచుతుంది
- చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది
- చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది
- చర్మంలో నలుపుని తగ్గిస్తుంది
కలబంద శనగపిండి ఫేస్ ప్యాక్
- 1 టీస్పూన్ శనగపిండి
- 1 టీస్పూన్ కలబంద గుజ్జు
తయారీ విధాంనం: శనగపిండి, కలబందను కలిపి మెత్తని పేస్టుగా తయారు చేసుకోవాలి. దాన్ని ముఖానికి ప్యాక్ గా చేసుకోవాలి. 10 నుంచి 15 నిమిషాల వరకు దాన్ని అలాగే ఉంచాలి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
వారానికి ఇలా రెండు మూడు సార్లు చేస్తే చర్మం మృదువుగా అవుతుంది. ముఖంపై ఏవైనా నల్లని మచ్చలుంటే తొలగిపోతాయి.
శెనగపిండి పసుపు ఫేస్ ప్యాక్
- 2 టీస్పూన్ల శనగపిండి
- ఒక చిటికెడు పసుపు
- రోజ్ వాటర్
తయారీ విధానం: శనగపిండిలో పసుపు వేసి రోజ్ వాటర్ వేసి పేస్ట్ గా తయారు చేస్కోండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా ముఖానికి పెట్టుకున్న తరువాత 15 నిమిశాలకు శుభ్రం చేసుకోండి. మీ చర్మం పొడిగా ఉంటే దాంట్లో అరటీస్పూన్ మీగడని కూడా కలపండి.
వారానికి రెండు సార్లు ఇలా చేస్తే.. చర్మం పొడిబారడం తగ్గి ప్రకాశవంతం అవుతుంది. చర్మంపై ఏదైనా బ్యాక్టీరియా ఉంటే తొలగిపోతుంది, మొటిమలు కూడా తగ్గిపోతాయి.
శెనగపిండి రోజ్ వాటర్ ప్యాక్
- 2 స్పూన్ల శెనగపిండి
- 2-3 స్పూన్ల రోజ్ వాటర్
తయారీ విధానం: శనగపిండి రోజ్ వాటర్ ను మిక్స్ చేసి ముద్దగా కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖం, మెడపై రాసుకోండి. 20 నిమిశాల వరకు అలాగే వుంచి, ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
వారానికి ఇలా రెండు సార్లు చేస్తే చర్మ సౌందర్యం పెరుగుతుంది. మీ చర్మంలో ఉండే జిడ్డు కూడా తొలగిపోతుంది.
శెనగపిండి బాదం ప్యాక్
- 4 బాదం
- 1 టేబుల్ స్పూన్ పాలు
- అర స్పూన్ నిమ్మరసం
- 1 టీస్పూన్ బేసన్
తయారీ విధానం: బాదాం పప్పును రుబ్బుకుని ఆ పొడిని శనగపిండితో కలపాలి. ఆ తరువాత నిమ్మరసాన్ని అందులో పిండి పేస్ట్ గా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖం, మెడపై ప్యాక్ ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. 20 నిమిశాల తరువాత చల్లనీటితో కడిగేయాలి.
వారానికి ఇలా రెండు సార్లు చేస్తే బాదంలో ఉన్న విటమిన్-ఇ చర్మానికి అందుతుంది. విటమిన్-ఇ లో చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచే లక్షణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కళ్ల చుట్టూ ఉండే నల్లని మచ్చలను కూడా ఇది తొలగిస్తుంది.
ఇవి కూడా చూడండి
- Green tea hair pack: గ్రీన్ టీ హెయిర్ ప్యాక్
- Hibiscus For Hair Growth: మందారంతో జుట్టుకు కలిగే ప్రయోజనాలు
- Weight Gain Tips: బరువు పెరగడానికి మంచి చిట్కాలు
- Castor Oil Hair Growth: జుట్టు పెరుగుదలకు ఆముదంను ఎలా ఉపయోగించాలి?