Coconut Water Benefits: కొబ్బరి బోండా మన సంస్కృతిలో భాగం అయిపోయింది. పెళ్లి వేడుకల్లో, పూజల్లో, ఎండాకాలంలో వీటి ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆసుపత్రిలో బెడ్ పై ఉన్నవారికి ఈ కొబ్బరి బోండం గ్లూకోజ్ లా పనిచేస్తుంది. కొబ్బరి బోండం గురించి మరన్ని విశేషాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లలో మెగ్నిషిం, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. శరీరంలో బలం లేనప్పుడు పూర్తిగా అలసటగా ఉన్నప్పుడు ఈ కొబ్బరి నీళ్లు మనకు ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. డయేరియాతో బాధ పడే పిల్లలకు డీహైడ్రేషన్ రాకుండా ఈ కొబ్బరి నీళ్లు కాపాడుతుంది.
కొబ్బరి నీళ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
- శరీరంలో సహజ లవణాన్ని కోల్పోయిన్పప్పుడు కొబ్బరి నీరు అప్పటికప్పుడు ఎనర్జీను ఇస్తుంది. పిల్లల్లో డయేరియా రాకుండా, డీహైడ్రేషన్ కు గురికాకుండా కొబ్బరి నీళ్లు కాపాడుతుంది.
- వేసవి కాలంలో కూల్ డ్రింక్స్ కంటే కొబ్బరి నీళ్లు చాలా మంచివి. కూల్ డ్రింక్స్ లో కార్బన్, చక్కెర, ఇతర కెమికల్స్ కూడా ఉంటాయి. అదే కొబ్బరి నీళ్లలో మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, జింక్, సోడియం లాంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి.
- గర్భవతులకు ఈ కొబ్బరి నీళ్లు చాలా మేలు చేస్తాయి. వారికి ఆ సమయంలో ఉండే మలబద్దకం, గుండెలో మంట, జీర్ణకోశంలో తేడాలు లాంటి సమస్యల నుంచి అధికమిస్తుంది. పాలిచ్చే తల్లులు కొబ్బరి నీరు తాగితే పసిపిల్లలకు, తల్లికి చాలా మంచిది.
- కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, ఇతర ఖనిజాలు రక్తపోటును తగ్గిస్తాయి, గుండె సమస్యలను కూడా నివారిస్తుంది.
- కొబ్బరి నీళ్లు రెగులర్ గా తీసుకుంటే హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ కూడా తగ్గుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
- లైంగిక సామర్ధ్యాన్ని కూడా కొబ్బరి నీళ్లు పెంచుతాయి. కిడ్నీలో రాళ్లు ఉంటే కరిగిపోవడానికి దోహదం చేస్తుంది. మూత్రకోశ ఇన్ఫెక్షన్లను కూడా ఇది తగ్గిస్తుంది.
- రక్తప్రసరణ సక్రమంగా ఉండాలంటే కొబ్బరి నీరు తాగడం చాలా అవసరం. షుగర్ స్థాయిని కూడా ఇది నియంత్రిస్తుంది.
- బరువు పెరగడానికి కూడా కొబ్బరి నీరు సహాయపడుతుంది. ఇందులో కొంత కొవ్వు పదార్ధం ఉంటుంది. రెగులర్ గా కొబ్బరి నీరు తాగితో ఆరోగ్యంతో పాటు కొంత బరువు కూడా పెరుగుతారు.
- నిద్రపోయే ముందు ముఖానికి కొబ్బరి నీళ్లు రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. చేతులు గోళ్లకు రాసుకుంటే ప్రకాశవంతంగా అవుతాయి.
- కొబ్బరి నీళ్లకు ప్రాససింగ్ అవసరం లేదు. వీటిలో 1 శాతం కల్తీ కూడా ఉండదు. నేరుగా దీనికి తాగవచ్చు.
ఇవి కూడా చూడండి
- Pumpkin Seeds Benefits: గుమ్మడికాయ గింజలు ఆరోగ్య ప్రయోజనాలు
- Aloe Vera Benefits: కలబంద ఆరోగ్య ప్రయోజనాలు
- Immunity Foods: రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు
- Thati Bellam Benefits: తాటి బెల్లం వల్ల కలిగే అద్భతమైన ఆరోగ్య ప్రయోజనాలు