Iron Rich Foods: శరీరంలో విటమిన్, ప్రొటీన్, ఖనిజాలు, కొవ్వు ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రతీ ఒక్క ఖనిజానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అయితే వీటన్నింటిలో ఐరన్ కు ప్రముఖ స్థానం ఉంది. బాడీలో ఐరన్ ఉంటే మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎర్ర రక్తకణాలను కూడా ఐరన్ పెంచుతుంది. ఐరన్ తక్కువగా ఉంటే, హెమోగ్లోబిన్ స్థాయి కూడా తక్కువగా ఉంటుంది. ఐరన్ లోపించడం వల్ల ఎన్నో అనారోగ్యాలకు లోనవుతాము. ఐరన్ ప్రాముఖ్యత గురించి, ఐరన్ పుష్కలంగా లభించే ఆహార పదార్ధాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ఐరన్ లభించే ఆహార పదార్ధాలు
పాలకూర : 100 గ్రాముల్లో 2.71 మి.గ్రాముల ఐరన్ ఉంటుంది
పాలకూరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఖనిజాలు ఉన్నాయి. ఆసుపత్రికి వెల్లిన ప్రతీ పేశంట్ ను పాలకూర తినమని డాక్టర్ ఖచ్చితంగా చెబుతాడు. పాలకూరలో ఐరన్ తో పాటు క్యాన్స్ తో పోరాడే యాంటీ ఓవర్సిటీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇందులో ఉండే హైపోలిపిడామిక్ కొవ్వును తగ్గిస్తుంది.
గుమ్మడి గింజలు: 100 గ్రాముల్లో 3.31 మిగ్రాల ఐరన్ ఉంటుంది
గుమ్మడి గింజల్లో ఐరన్ తో పాటు, ప్రొటీన్లు, విటమిన్లు, ఫ్యాటీ ఆమ్లాలు, సెలీనియం, జింక్ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలికి ఉంటాయి. బీడీలో ఉండే హానికరమైన కొలెస్ట్రాల్ లను కూడా ఇది తగ్గిస్తుంది. అధిక రక్తపోటు, ఆర్ధరైటిస్, క్యాన్స్ ర్ లాంటి రోగాల నుంచి కాపాడడంలో దోహదం చేస్తుంది.
ఎండు ద్రాక్ష: 100 గ్రాముల్లో 3.33 మి.గా ఐరన్ ఉంటుంది
ఎండు ద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బాడీలో రక్తం ఫార్మ్ అవ్వాలంటే విటమిన్ బి కాంప్లెక్స్ చాలా అవసరం. ఆ విటమిన్ బి కాంప్లెక్స్ ఈ ఎండు ద్రాక్షలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. రక్తహీనత, ఐరన్ లోపం ఉన్నవారు ఇది తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
గుడ్లు: 100 గ్రాముల్లో 1.2 మి.గా ఐరన్ ఉంటుంది
గుడ్డులో దాదాపు అన్ని విటమిన్లు, పోషకాలు ఉంటాయి. ఐరన్ కూడా ఉంటుంది. రోజూ రెండు గుడ్లు తీసుకుంటే అవసరమైనం ఐరన్ లభిస్తుంది. గుడ్డులో ప్రొటీన్, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది.
డ్రైఫ్రూట్స్: 100 గ్రాముల్లో 1 మిగ్రా ఐరన్ ఉంటుంది
డ్రైఫూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లలో కన్నా వీటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. కాజు, బాదాం, అక్రూట్, ఎండు ద్రాక్ష, పిస్తా లాంటి డ్రైఫ్రూట్స్ ను రోజు కొన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అవసరమైనన్ని ఖనిజాలు బాడికి అందుతాయి. ఉదయం పరిగడపున అంటే ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది.
డార్క్ చాక్లెట్: 100 గ్రాముల్లో 3.47 మిగ్రా ఐరన్ ఉంటుుంది
డార్క్ చాక్లెట్ అనగానే చిరుతిండ్లు అనుకుంటారు. కాని ఈ డార్క్ చాక్లెట్ లో ఎన్నో పోషక పదార్ధాలు ఉన్నాయి. డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి చాలా మంచిదని, అలసట, అజీర్ణం, ప్రేగు సంబంధిత రుగ్మతల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. డార్క్ చాక్లెట్ లో ప్లేవనాయిడ్స్, కెఫిన్, జింక్ తో పాటు, మెగ్నీషియం, ఐరన్ లాంటి ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి.
ఇవి కూడా చూడండి