Ayurvedic Powder Reduce Belly Fat: ఈ మధ్య అనేక మందికి పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోతుంది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుత జీవన విధానం. వ్యాయామాలు చేయడం ఆపేసారు, మధ్యాహ్నం నిద్రపోతున్నారు, కొంప్యూటర్ల ముందు గొంటల కొద్ది అలాగే కూర్చుంటున్నారు, హద్దు లేని జంక్ ఫుడ్ తినడం ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో ఆయుర్వేదం పొడితో పొట్ట చుట్టూ కొవ్వును ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాం.

ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం శరీరంలో కపా దోష పెరగడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. దీనికి తగ్గించాలంటే ఓ మంచి పొడి ఉంది. దీనికి ఉదయం, రాత్రి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఆయుర్వేదం పిప్పిళ్ల పొడి తయారీ విధానం
ఆమెజాన్ ఆన్ లైన్ లో long pepper ని ఆర్డర్ చేసుకోండి. దీనిని పిప్పళ్లు అంటారు. ఈ పిప్పిళ్లను చిన్న మంట పెట్టి వేయించండి. వేగిన తరువాత దాన్ని దంచి పొడిగా చేయాలి. పొడిని జల్లడ పట్టిన తరువాత దాన్ని ఒక జార్ లో లేదా ఓ సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇక పిప్పళ్ల పొడి రెడీ అయినట్టే.
3 చిటికెడు పిప్పిళ్ల పొడిలో కొంత తేనె కలిపి చిన్న ఉండలా చేసుకోవాలి. రాత్రి భోజనం చేసిన తరువాత పడుకునే ముందు దీన్ని తీసుకోవాలి. ఇది మీకు మొదట్లో చాలా ఘాటుగా, కారంగా అనిపిస్తుంది. అయినా సరే తీసుకోండి. ఆహారం జీర్ణం కావడానికి కూడా మీకు బాగా దోహదం చేస్తుంది. ఓ వారం తరువాత దీన్ని ఉదయం భోజనం చేసే అరగంట ముందు కూడా తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ప్రతీ వారం మీ పొట్ట చుట్టు కొవ్వు తగ్గడం మీరు చూస్తుంటారు.
ఈ పిప్పిళ్ల పొడి చిట్కాను పాటించండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. తయారీ విధానం ఈజీ. ఖర్చు కూడా చాలా తక్కువ. ఆయుర్వేదం చిట్కా కాబట్టి వెంటనే ఫలితం ఇవ్వదు, కాబట్టి ఓ రెండు నెలల వరకు ఈ కోర్సును ఫాలో అవండి, అద్భుతమైన ఫలితాన్ని మీరే చూస్తారు.
ఏవి తినకూడదు?
- ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు తినవద్దు
- దుంపలు మానెయ్యండి
- నూనె పదార్ధాలు తగ్గించండి
- పిజ్జా, బర్గర్, పఫ్స్ లాంటి జంక్ ఫుడ్ కు ఫుల్ స్టాప్ పెట్టండి
రోజు ఉదయాన్నే కొద్దిగా వాకింగ్, నీరు బాగా తాగడం లాంటివి చేస్తే రెండు నెలల్లోనే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆలస్యం చేయ్యకుండా వెంటనే ఈ పిప్పిళ్ల చిట్కా ఫాలో అయిపోండి.
ఇవి కూడా చూడండి
- Green tea hair pack: గ్రీన్ టీ హెయిర్ ప్యాక్
- Neem Tree Health Benefits: వేప ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
- Pumpkin Seeds Benefits: గుమ్మడికాయ గింజలు ఆరోగ్య ప్రయోజనాలు
- Senagapindi Face Pack: చర్మం కాంతివంతం కావడానికి చనగపిండి ఫేస్ ప్యాక్ టిప్స్