Tea Tree Oil Benefits: టీ ట్రీ ఆయిల్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. టీ ఆకుల నుంచి నూనెను తీస్తారు. అయితే ఈ టీ ఆకుల ఆస్ట్రేలియాకు చెందినవి. మన భారత్ లో ఈ టీ ఆకులు లభించవు. ఆస్ట్రేలియాలో మాత్రమే ఆ టీట్రీ ఆకులు లభ్యమవుతాయి. కానీ ఈ టీ ఆకుల ఆయిల్ మనకు ఆమెజాన్ ఆన్ లైన్ స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఈ టీ ఆయిల్ తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
టీ ట్రీ ఆయిల్ ప్రయోజనాలు
మొటిమలను తొలగిస్తుంది
టీ ట్రీ ఆయిల్ కు ముఖంపై ఉండే సెబమ్ విడుదలను తగ్గించే సామర్ధ్యం ఉంటుంది. మెటిమల క్రిములతో పోరాడే శక్తి ఆ టీట్రీ ఆయిల్ కు ఉంటుంది. రెండు చుక్కల టీట్రీ ఆయిల్ లో ఒక టీ స్పూన్ తేనెకలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై వేలితో అప్లై చేసుకోవాలలి. అరగంట ఫేస్ ప్యాక్ తరువాత ముఖాన్ని మంచినీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు రాసుకుంటే మొటిమలు మాయం అవుతాయి.
మూత్రాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది
మాత్రాశయంలో ఉండే బ్యాక్టీరియా వల్ల ఎన్నో ఇన్ఫెక్షన్స్ వ్యాపించే అవకాశం ఉంది. దీని వల్ల మూత్రపిండాల సమస్యలు కూడా వచ్చే అవకాశముంది. టీట్రీ ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియల్ ఫంగల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది. స్నానం చేసేటప్పుడు బకెట్లో 10 చుక్కల టీట్రీ ఆయిల్ ను కలుపుకుంటు మూత్రాశయ మార్గాన్ని శుబ్రం చేసి, ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది.
శరీర దుర్వాసనను తగ్గిస్తుంది
బాడీపై ఉండే చెమట బ్యాక్టీరియా వల్ల కొన్ని సందర్భాల్లో శరీరం నుంచి చాలా దుర్వాసన వస్తుంది. టీట్రీ ఆయిల్ లో యాంటీ ఫంగల్ ఎలిమెంట్స్ ఉంటాయి. దుర్వాసన పోవాలంటే రెండు చుక్కుల టీట్రీ ఆయిల్ ను రెండు చేతల చంకల కింద అప్లై చేసుకోవాలి. అప్పుడు మీ బాడీ నుంచి దుర్వాసన రావడం ఆగిపోతుంది.
గోరుచుట్టుకు టీట్రీ ఆయిల్
కొందరిలో గోరుచుట్టు వేళు ఎర్రగా అయిపోయి చీము పట్టడం స్టార్ట్ అవుతుంది. అక్కడు ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్ ను టీట్రీ ఆయిల్ తో సులభంగా తగ్గించవచ్చు. వేడి నీటిలో 2 టీస్పూన్ల టీట్రీ ఆయిల్ ను వేయాలి. నిటీలో ఆయిల్ బాగా మిక్స్ అయిన తరువాత దాంట్లో గోరు చుట్టు ఉన్న వేళ్లని 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అప్పుడు గోరుచుట్టు తగ్గి, ఫంగస్ పోయి, బ్యాక్టీరియా చనిపోయి మంచి ఫలితం ఉంటుంది.
మౌత్ వాష్ కోసం టీట్రీ ఆయిల్
నోటి నుంచి దుర్వాసన పోయి నోరు శుబ్రంగా ఉండాలంటే.. నోటిలో క్రిములు లేకుండా ఉండాలంటే టీట్రీ ఆయిల్ తో మౌత్ వాష్ చేయండి. ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో 2-3 చుక్కల టీట్రీ ఆయిల్ ను వేసి ఆ నీటిని నోట్లో వేసుకొని పుక్కలించండి. అయితే ఆ నీరుని ఎట్టిపరిస్థితుల్లో మింగకూడదు. ఇలా చేస్తే మీ నోటిలో బ్యాక్టిరియా, దుర్వాసన తొలగిపోతాయి.
టీట్రీ ఆయిల్ ఉపయోగించేటప్పుడుు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- టీట్రీ ఆయిల్ ను నేరుగా చర్మంపై అప్లై చేయవద్దు. ఇతర కొబ్బరి, ఆలివ్, బాదం నూనెతో కలిపి చర్మానికి అప్లై చేయాలి
- టీట్రీ ఆయిల్ కళ్లల్లో పడితే చాలా ప్రమాదం
- టీట్రీ ఆయిల్ అప్లై చేయగానే దురద అనిపిస్తే వెంటనే కడిగేయండి.
- టీట్రీ ఆయిల్ ను ఎట్టి పరిస్థితుల్లో మింగకూడదు
- టీట్రీ ఆయిల్ ను శరీరానికి అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి
- పిల్లలకు అందుబాటులో ఉండకుండా జాగ్రత్త పడండి
ఇవి కూడా చూడండి
- Tips For Oily Skin: చర్మంపై జిడ్డు తగ్గించే చిట్కాలు
- Ayurvedic Powder Reduce Belly Fat: ఆయుర్వేదంతో పొట్ట చుట్టూ ఉండే…
- Senagapindi Face Pack: చర్మం కాంతివంతం కావడానికి చనగపిండి ఫేస్ ప్యాక్…
- Weight Loss Tips: ఇలా 10 రోజుల్లో బరువు తగ్గించేసేయండి