Fruits For Diabetes: డయాబెటీస్ ఉన్న వారు పండ్లను తినవద్దు అనే అపోహ ఉండేది. చాలా ఏళ్ల వరకు పళ్లు మధుమేహం సోకిన వారికి మంచిది కాదని, దానిలో ఉండే తీపి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను పెంచుతుందని కొందరు డాక్టర్లు సైతం అనేవారు. అయితే తాజాగా జరిపిన పరిశోధనల్లో పండ్లు డయాబెటిస్ ఉన్న వారికి మంచివేనని అంటున్నారు. కాని కొన్ని రకాల పండ్లను మాత్రమే తినాలని సూచిస్తున్నారు. ఆ పండ్లు ఏవి, వాటి వివరాలను ఆ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా ఉంటుంది. బాడీలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న డయాబెటిక్ పేశంట్లు పండ్లను మితంగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
డయాబెటిస్ ఉన్న వారు తినవలసిన పండ్లు
నేరేడు పండ్లు (చెర్రీస్)
డయాబెటిస్ ఉన్న వారు ఏ జంకూ లేకుండా నేరుడు పండ్లను ఆరగించవచ్చు. అర గిన్న నేరుడు పండ్లలో 62 కేలరీలు 16 గ్రాముల కార్బొహైడ్రేట్లు ఉంటాయి. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో చక్కెర స్థాయిని కూడా ఈ నేరేడు పండు తగ్గిస్తుంది..
ఆపిల్
ఒక చిన్న యాపిల్ లో 54 కేలరీలు, 14 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఆపిల్ లో ఉండే పెక్టిన్ అనే రసాయనం రక్తంలోని చక్కెర స్థాయిని 50 శాతం తగ్గిస్తుంది. మదుమేహం ఉన్న వారికి పచ్చ రంగులో ఉన్న యాపిల్ చాలా మంచిది.
పుచ్చకాయ
పుచ్చపండులో ఉండే కార్టెనోయిడ్లు రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఫ్రక్టోస్ ఉండడం వల్ల డయాబెటిక్ పేశంట్లు దీన్ని తినడం వల్ల ఎలాంటి నెగెటివ్ ప్రభావం చూపదు.
నారింజ
డయాబెటిక్ పేశంట్లు ప్రతీ రోజూ ఒక నారింజ తినాలను పరిశోధనలు చెబుతున్నాయి. నారింజలో జీర్ణక్రియను పెంచే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉండడం, గైసెమిక్ స్థాయి కూడా 35 నుంచి 50 మధ్య ఉండడం ఆరోగ్యానికి చాలా మంచిది.
బొప్పాయి
షుగర్ వ్యాధి ఉన్న వారికి బొప్పాయి చాలా మంచిది. ఇది తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. బొప్పాయిలో కారోటీన్, పాపైన్ లాంటి ఎన్జైమ్స్ ఉండడం వల్ల మూత్రపిండాల వ్యధుల నుంచి కాపాడుతుంది.
అవొకాడో
ఇది అమెరికాలోని మెక్సికోలో పెరుగుతుంది. డయాబెటిక్ పేశంట్లకు ఈ పండు చాలా మంచిది. గుండె జబ్బులు ఉన్న వారికి కూడా డాక్లర్లు ఈ పండును తినమని సిఫారసు చేస్తారు.
దానిమ్మ పండు
దానిమ్మ పండులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. డయాబెటిక్ పేశంట్లకు ఈ పండు చాలా మంచిది. ఇది బాడీలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలిస్ట్రాల్ ను పెంచుతుంది.
ఇవి కూడా చూడండి
- Tulasi health benefits: తులసి ఆరోగ్య ప్రయోజనాలు..
- Coconut Water Benefits: కొబ్బరి నీళ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- Best Nutrition foods: పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు
- GREEN TEA BENEFITS: గ్రీన్ టీని ఎలా తయారు చేసుకోవాలి?