Food For Gastric Problems: గ్యాస్ ట్రబుల్స్ ఎక్కువగా మిడిల్ ఏజ్ లో ఉన్న వారికి వస్తుంది. గ్యాస్ ట్రబుల్ కు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తన్ని ఆహారం సరిగా జీర్ణం కాకపోతే దాని నుంచి ఉత్పత్తయిన గ్యాస్ కడుపులోంచి పైకి రావడం స్టార్ట్ అవుతుంది. అలా వచ్చినప్పుడు కడుపులో ఛాతిలో మంట పుడుంది. ఈ స్థిత్తి నెమ్మదిగా గుండె జబ్బులకు దారి తీస్తుంది.
సమయానికి ఆహారం తీసుకోవకపోవడం, శుతి మించి ఆహారం తినడం, టీలూ కాఫీలు ఎక్కువగా తాగడం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, వేయించిన ఫుడ్స్ అంటే ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా తినడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి.
గ్యాస్ ట్రబుల్ ఉన్న వారి ఏమి తినవచ్చు?
- తక్కువ కొవ్వు పదార్ధాలైన పాల, పెరుగు తీసుకోవచ్చు
- కూరగాయల నూనెలు, ఆలివ్ నూనెను మాత్రమే వంటకాల్లో వాడాలి
- యాపిల్, పుచ్చకాయలు, అరటి లాంటి పళ్లు తినవచ్చు
- ఆకు కూరలు, క్యారెట్లు, పాలకూర, గుమ్మడికాయతో సహా కొన్ని కూరగాయలు తినవచ్చు
- క్యాబేజీ, కాలీఫ్లవర్, చిక్ పీస్, సోయాబీన్స్, కాయధాన్యాలుు తీసుకోవచ్చు
గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారు పాటించాల్సిన జాగ్రత్తలు
- సరైన సమయంలో భోజనం చేయాలి
- వేయించిన పదార్ధాలు ఎక్కువగా తినకూడదు. సులువుగా జీర్ణమయ్యే వాటినే తినాలి
- కాఫీ, టీ, సిగరెట్లు, ఆల్కహాల్ కు ఫుల్ స్టాప్ పెట్టాలి
- భోజనం అయిన తరువాత కొంత సేపు వాకింగ్ చేసిన తరువాతే పడుకోవాలి
- ఆహారం జీర్ణం కావడానికి సోంప్, కిళ్లీ తినడం మంచిది
గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారు ఉదయం లేవగానే కొంత వ్యాయామం చేయండం చాలా మంచిది. ఉదయం పరిగడపున గోరువెచ్చని నీటిని తాగితే కడుపు శుభ్రం అవుతుంది. రుచి కోసం కాకుండా ఆరోగ్యం కోసం మాత్రమే తినండి. గ్యాస్ట్రిక్ సమస్యని తక్కువ అంచనా వేయకూడదు. తేలికగా తీసుకుంటే అది గుండెజబ్బులకు దారితీస్తుంది.
ఇవి కూడా చూడండి