Mehendi Tips: గోరింటాకు ఎర్రగా పండటానికి మహిళలు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు నూనె పెడతారు, కొందరు నిమ్మకాయ పిండుతారు. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడని ఎప్పటినుంచో ఓ నమ్మకంగా వస్తుంది. పండుగల్లో, పెళ్లిలో గోరింటాకు హడావిడి మామూలుగా ఉండదు. గోరింటాకు ఎర్రగా పండాలంటే ఎలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలనే విషయాలను ఈ ఆర్టికల్ లో మీకు అందిస్తున్నాము.

గోరింటాకు ఎర్రగా మారేందుకు చిట్కాలు
ఎక్కువ సేపు ఉండనివ్వండి
చేతులు బాగా శుబ్రం చేసుకున్న తరువాతే గోరింటాకు పెట్టుకోండి. గోరింటాకు పెట్టుకున్న 12 గంటల తర్వాతనే చేతులను శుభ్రం చేసుకోవాలి. సబ్బుతో నీళ్లతో చేతులు కడగవద్దు. రెండు చేతులను ఒకదానకి ఒకటి రాయడం ద్వారా గోరింటాకుని తొలగించాలి. ఆ తరువాత కొంత సేపటికి చల్లటి నీళ్లతో చేతులను శుభ్రం చేసుకోవాలి.
నిమ్మ-చెక్కర రసం చిట్కా
కొన్ని నీటిలో కొంత చక్కెర వేసి ఉడకబెట్టాలి. చల్లారిన తరువాత దాంట్లో నిమ్మరసం వేయాలి. ఆ మిశ్రామాన్ని ఆరిపోతున్న గోరింటాకు పై అద్దాలి. అలా చేయడం ద్వారా చక్కెర మెహందీని ఎక్కువ సేపు ఉండేలా చేస్తుంది. నిమ్మరసం, మెహందీ మరింత లోతుకు వెళ్లేలా దోహదం చేస్తుంది.
మెహందీ లవంగం పొగ ఆవిరి చిట్కా
ఎండుతున్న గోరింటాకు పై నిమ్మ చెక్కర రసం అద్దిన తరువాత పెనం పై కొన్ని లవంగాలు వేయించండి. ఆ లవంగాల నుంచి వచ్చే ఆవిరిని మీ మెహందీ అరచేతికి తాకేలా చూడండి. అలా చేస్తే మీ మెహందీ మరింత లోతుకు వెళ్లి ఎర్రగా మారుతుంది.
మెహందీ పెట్టుకున్న తరువాత ఈ తప్పులు చేయకండి
- గొరింటాకు చేతులను సబ్బుతో, హ్యాండ్ వాష్ తో కడగవద్దు అలా చేస్తే మీ మెహందీ డిమ్ కలర్ లోకి మారిపోతుంది
- గోరింటాకు పెట్టుకున్న తరువాత పని చేయవద్దు అలా చేస్తే మీ గోరింటాకు పోవడమే కాకుండా అరచేతుల పై స్కిన్ తొలగిపోయే ప్రమాదం ఉంది.
- గోరింటాకును నీళ్లతో కూడా కడగవద్దు. చేతులను ఒకదానికి ఒకటి పెట్టి రాయడం ద్వారా గోరింటాకును తొలగించే ప్రయత్నం చేయండి.
- మెహందీ త్వరగా ఆరడానికి హెయిర్ డ్రైయ్యర్ లాంటివి ఉపయోగించవద్దు, అలా చేస్తే డిజైన్ మారిపోతుంది.
గోరింటాకు కొనే సందర్భంగా చాలా జాగ్రత్తలు పాటించండి. అనేక రకాల కెమెకల్స్ తో కూడిన గోరింటాకులు మార్కెట్లో ఉంటాయి. వాటిని కొనకుండా కేవలం న్యాచురల్ గోరింటాకులనే ఉపయోగించండి. కావేరి మెహందీ, ప్రేమ్ దుల్హన్ మెహంది, గొలిచ్చా ఫాస్ట్ హెన్నా, ఎక్స్ పర్ట్ ట్రేటర్స్ మెహందీ కోన్ బాక్స్ లాంటి బ్రాండెడ్ మెహందీలనే కొనండి.
గోరింటాకు వల్ల ప్రయోజనాలు
- స్త్రీలలో హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తుంది
- వర్షాకాలంలో, చలికాలంలో చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి
- గోరిటాకు చేతికి ఉంటే ఇన్ఫెక్షన్స్ కూడా కలిగే అవకాశాలు తక్కువ
ఇవి కూడా చూడండి
- Egg Benefits For Hair: కొడిగుడ్లతో జుట్టుకు కలిగే ప్రయోజనాలు, టిప్స్
- Food For Gastric Problems: గ్యాస్ సమస్య ఉన్న వారు తీసుకోవాల్సిన…
- Fruits For Diabetes: మధుమేహం, డయాబెటీస్, షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక పండ్లు
- Health Tips For Women: మహిళలకోసం ప్రత్యేకంగా ఆరోగ్య చిట్కాలు