Home Remedies For Diabetes: షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే ఇక అది జీవితాంతం మనతోనే ఉంటుంది. పెళ్లి చేసుకున్న భార్యలా ఎప్పుడూ మనతోనే ఉంటుంది. అయితే ఈ షుగర్ కు కూడా విడాకులు ఇచ్చేయొచ్చని కొందరు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ ఖర్చు లేకుండా, కొన్ని ఇంటి చిట్కాలతోనే షుగర్ ను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ చిట్కాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో మీకు అందిస్తున్నాము.
బాడీలో కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా అయిపోతే క్రమంగా అవి ఎక్కువ గ్లూకోజ్ కింద మారి తరువాత అది షుగర్ కు దారి తీస్తుంది. అయితే వచ్చిన షుగర్ ను ఈ కింది చిట్కాల ద్వారా కంట్రోల్ చేసి క్రమంగా పూర్తిగా తగ్గించవచ్చు.
రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గించే చిట్కాలు, మార్గాలు
- కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారాన్ని తీస్కోండి
- కూరలో కార్బొహైడ్రేట్లు తక్కువగా, అన్నంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కూర ఎక్కువగా తిని, అన్నం తక్కువగా తినాలి
- ఆకుకూరలు ఎక్కువగా తినాలి
- రాత్రి భోజనానికి బదులుగా పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, బాదాం పప్పు, స్వీట్ కార్న్ లాంటివి తినాలి
- అన్ని పండ్లు కాకుండా రేగు పండు, దానిమ్మ, బొప్పాయి, యాపిల్, అవొకాడో, జామకాయ లాంటివి తినాలి
- మెంతులు తినడం కూడా చాలా మంచిది. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయని పరిశోధనల్లో తేలింది.
- చక్కెర, స్వీట్ పదార్ధాలను తినడం ఆపివేయాలి.
- అవిసె గింజలు కూడా మధుమేహం ఉన్న వారికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ తో పాటు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇన్సులిన్ స్థాయిని కూడా పెంచుతాయి.
- మామిడి ఆకుల రసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రసంలో అల్ఫా గ్లోకోసిడేస్ అనే ఎంజైమ్ ని నిరోధించే శక్తి ఉంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
ఇవి కూడా చూడండి