Tuna Fish Benefits: ట్యూనా ఫిష్ తింటే కలిగే ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు

Tuna Fish Benefits: సీఫుడ్స్ లో ట్యూనా ఫిష్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల సముద్రంలో ఉంటుంది. సముద్రంలో లభించడంతో దీన్ని ఉప్పు చేప అని కూడా అంటారు. ట్యూనా చేప వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

tune fish in telugu benefits and side effects

ఈ చేపలో సొడియం శాతం తక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్, సెలీనియం, ఫాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం స్థాయిలు సమృద్ధిగా ఉంటాయి. ట్యూనా చేపలో విటమిన్ బి 12 మరియు నియాసిన్, విటమిన్ బి 6 రిబోఫ్లేవిన్ ఉంటాయి. ట్యూనా చేపలకు సంబంధించిన మరిన్న ప్రయోజనాలు, దుష్ఫ్రయోజనాల గురించి తెలుసకుందాం.

ట్యూనా చేపల వల్ల కలిగే ప్రయోజనాలు

  • ఈ చేపల్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల వల్ల రక్తనాళాల్లో సమతుల్యతను తీసుకువస్తుంది.
  • బి-కాంప్లెక్స్ విటమిన్లతో పాటు, ఐరన్ పుష్కలంగా ఉంటుంది, దీంతో రక్తకణాలు బలపడతాయి
  • ట్యూనాలో పొటాషియం సమృద్ధిగా ఉండడంతో అధిక రక్తపోటును తగ్గిస్తుంది.
  • ఈ చేపల్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లలు కంటి చూపు మందగించడం, కంటి సమస్యల నుంచి ట్యూనా చేప మనల్ని రక్షస్తుంది
  • ట్యూనాలో విటమిన్ డి కూడా ఉండడంతో యముకలను బలపర్చడంలో దోహదపడుతుంది
  • ట్యూనాలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్స్రర్ కణాలతో పోరాడతాయి. రొమ్ము క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, పేగు క్యాన్సర్, వంటి వాటిని ట్యూనా చేపను తినడం ద్వారా గణనీయంగా తగ్గించవచ్చు.

ట్యూనా చేపలవల్ల కలిగే దుష్ఫ్రభావాలు

మెర్క్యూరీని థర్మామీటర్లలో, విద్యుత్ ప్లాంట్లలో, సిమెంట్ ప్లాంట్లలో రా మెటిరియల్ గా ఉపయోగిస్తారు. ఈ మెర్క్యురీకి సంబంధించిన వేస్టును ఆయా పరిశ్రమకు సంబంధించిన వారు సముద్రంలో కలుపుతారు. ఈ వేస్ట్ మెర్కయురీని తింటే భవిష్యత్తులో వాటిని పట్టి తిన్న మనుషులపై అనేక దుష్ప్బ్రవాలు ఉంటాయి.

  • మెర్క్యురీ తిన్న చేపలను తింటే అది బాడీలో న్యూరోటాక్సిన్స్ గా మారి మెదడు పై ప్రభావం చూపుతుంది.
  • మెర్క్యూరీ తిన్న ట్యూనా చేపలను పిల్లలు తింటే, పిల్లల్లో బుద్ధిమాంద్యం పెరిగే అవకాశం ఉంది. సెరిబ్రల్ పాల్సీ, చెవిటితనం, అంధత్వానికి కూడా దారితీస్తుంది.
  • జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉంది
  • కంటిచూపు మందగించి అంధత్వానికి దారి తీయవచ్చు
  • బాడీలో అధిక తిమ్మిర్లకు కూడా కారణం కావచ్చు.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు