Home ఆరోగ్యం Dolo 650 Tablet Uses: డోలో 650 ట్యాబ్లెట్లను ఎలా వాడాలి? ఉపయోగాలు

Dolo 650 Tablet Uses: డోలో 650 ట్యాబ్లెట్లను ఎలా వాడాలి? ఉపయోగాలు

0
Dolo 650 Tablet Uses: డోలో 650 ట్యాబ్లెట్లను ఎలా వాడాలి? ఉపయోగాలు

Dolo 650 Tablet Uses: డోలో ట్యాబ్లెట్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్లను అడిషనల్ గా ఉంచుకోవడం చాలా మంచిది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత ఎక్కువ ఉన్న కారణంగా చాలా మందికి జ్వరాలు అతి సాధారణంగా వస్తున్నాయి. అలాంటి సందర్భంలో ఈ డోలో 650 ట్యాబ్లెట్లను వేసుకోవాలి. డోలో ట్యాబ్లెట్ ను ప్రధానంగా జ్వరం వస్తే వేసుకుంటారు, కాని డోలో జలుబుకు, శరీర నొప్పులకు, తల నొప్పికి కూడా బాగా పనిచేస్తుంది. డోలో ట్యాబ్లెట్స్ గురించి మరిన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

dolo-650-tablet-uses-in-telugu

డోలో ట్యాబ్లెట్ ఉపయోగాలు

  • నొప్పిని నివారిస్తుంది
  • తలనొప్పి
  • మైగ్రేన్
  • నరాల నొప్పి
  • పంటి నొప్పి
  • గొంతు నొప్పి
  • పీరియడ్స్ (రుతుస్రావం) నొప్పులు
  • కీళ్లనొప్పులు, కండరాల నొప్పులను తగ్గిస్తుంది

డోలో అన్ని రోగాలకు సంజీవనిలా పనిచేస్తుంది. అయితే దీన్ని తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే అవకాశముంది.

జ్వరానికి కారణమయ్యే కెమికల్ ఏజెంట్ విడుదలను ఈ డోలో ఆపేస్తుంది. ఆ కారణంగా డోలో వేసుకోగానే జ్వరం రావడం తగ్గిపోతుంది. అయితే డోలో వేసుకునే ముందు ఒక సారి డాక్టర్ సలమా తీసుకోవడం చాలా మంచిది.

డోలో 650 దుష్ప్రభావాలు

  • అనారోగ్యం
  • మలబద్ధకం
  • తలతిరగడం
  • నిద్రమత్తు
  • మూర్ఛ పోవడం
  • బలహీనత
  • అల్ప రక్తపోటు
  • వికారం (నాజియా)

డోలో 650 తీవ్రమైన దుష్ప్రభావాలు

  • ఎలెక్టాసిన్
  • స్వరపేటిక దుస్సంకోచాలు
  • ఆంజియోడెమా
  • అసాధారణ కాలేయ పనితీరు
  • అసాధారణ నాడీ వ్యవస్థ
  • ఊపిరితిత్తుల పనితీరు తగ్గడం
  • క్రమరహిత హృదయ స్పందన
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

డోలో ట్యాబ్లెట్ వేసుకునే సమయంలో మీరు అప్పటికే వేరే ట్యాబ్లెట్స్ ను వాడుతూ ఉండవచ్చు. అలాంటప్పుడు డోలో వాడడం వల్ల కొన్ని రియాక్షన్స్ అయ్యే ప్రమాదం ఉంది. కడుపులోకి వెళ్లిన డోలో ట్యాబ్లెట్ మీరు వేసుకున్న వేరే ట్యాబ్లెట్లతో మిక్స్ అయి నెగిటివ్ ప్రభావం చూపే అవకాశం ఉంది. మద్యం సేవించినప్పుడు కూడా డోలో వాడవద్దు ఇలాంటి కొన్ని నియమాలు, డోలోతో సంఘర్షించే ట్యాబ్లెట్స్ వివరాలను కింద అందిస్తున్నాము.

డోలో వీటితో తీసుకుంటే నెగిటివ్ ప్రభావం

  • ఆల్కహాల్
  • Juxtapid mipomersen
  • Ketoconazole
  • Leflunomide
  • Prilocaine
  • Teriflunomide

డోలో ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు మీకు ఉపశమనం కలగకుండా ఏమైనా రియాక్షన్స్ లా అనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. డాక్టర్ సలహా మేరకే డోలోని తీసుకోండి.

ఇవి కూడా చూడండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here