Dragon Fruit Health Benefits: డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

Dragon Fruit Health Benefits: డ్రాగన్ ఫ్రూట్ లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా గర్భిణులు ఎదుర్కొనే హెమోరాయిడ్ల సమస్యను నివారిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు కూడా కలిగి ఉంటాయి. ఇందులో కాల్షియం కూడా ఉంటుంది.గర్భిణీలు డ్రాగన్ ఫ్రూట్ ను తింటే తల్లితో పాటు శిశువు ఆరోగ్యానికి చాలా మంచిది.

health-benefits-of-dragon-fruit
Source: ripe.london

డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సీ క్యాన్సర్ రాకుండా పోరాడుతుంది. ఇది అనేక అధ్యయనాల్లో తేలింది.

చర్మానికి మంచింది

ఈ పండులో నీరు అధికంగా ఉంటుంది. బాడీలో ద్రువాలను విడుదల చేస్తుంది. ఇలా బాడీని ఎప్పుడూ హైడ్రేట్ గా వుంచుతుంది.

డయాబెటిస్ నివారిస్తుంది

డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇందులొ ఉండే యాంటీ డయాబెటిక్ మధుమేహాన్ని నివారిస్తుంది.

మల బద్ధకాన్ని తగ్గిస్తుంది

మల బద్దకం పోవాలంటే తినే ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండాలి. డ్రాగన్ ఫ్రూట్ లో ఆ ఫైబర్ అధికంగా ఉంటుంది. అలా మీ మలబద్ధకాన్ని కూడా ఇది పోగొడుతుంది.

కాల్షియం పుష్కలం

ఒక్క డ్రాగన్ ఫ్రూట్ తింటే మీకు రోజు అందాల్సిన కాల్షియంలో 70 శాతం అందినట్టే. రెండు డ్రాగన్ ఫ్రూట్లను తింటే ఇక మీకు కావలిన పోషకాలు అందుతాయి. పంటి సమస్యలను కూడా ఇది నివారిస్తుంది.

విటమిన్ సి

డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే విటమిన్ సీ, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ చర్మాన్ని ఎప్పుడూ కాంతివంతంగా ఉంచుతుంది.

జుట్టు కోసం డ్రాగన్ ఫ్రూట్

డ్రాగన్ ఫ్రూట్ రసాన్ని జుట్టు కు అంటిస్తే, ఫాలికల్స్ తెరుచుకుంటాయి, జుట్టు శ్వాస తీసుకోవడం ప్రారంభమవుతుంది. దీంతో మీ జుట్టు ఆరోగ్యవంతంగా మారుతుంది.

క్రిమి నాశక గుణాలు

డ్రాగన్ ఫ్రూట్ యాటిసెప్టిక్ గా పనిచేస్తుంది. బాడీలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్ లాంటి వాటితో పోరాడి అంటువ్యాధి రాకుండా దోహదపడుతుంది. కరోనా విజృంభిస్తున్న సమయం ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలా మందికి మంచి ఔషదంగా పనిచేసంది.

సనబర్న్ ను ప్రసారం చేస్తుంది

వడదెబ్బ నుంచి కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ మనల్ని కాపాడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ రసంలో కొద్దగి తేనె ఇంకా కొద్దిగా దోసకాయ రసాన్ని వేసి కలపుకోవాలి. ఈ పేస్ట్ ను ఫేస్ ప్యాక్ లా చేసుకొని 30 నిమిశాల పాటు అలాగే వుంచాలి. అనంతరం మంచి నీళ్లతో కడుక్కున్న తరువాత మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.

శ్వాసకోశ వ్యాధులతో పోరాడుతుంది

శ్వాసకోశ సమస్యలున్నవారు డ్రాగన్ ఫ్రూట్ ఖచ్చితంగా తినాలి. దీర్ఘకాలికంగా దగ్గు ఉంటే కూడా తగ్గిస్తుంది. గ్రోన్కైటిస్, ఆస్తమా లాంటి వాటిని ఎదుర్కోవడంలో డ్రాగన్ ఫ్రూట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు